మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దోమల నివారణ అందరి భాధ్యత..

దోమల నివారణ అందరి భాధ్యత..

 

  • దోమల రహిత నగరం కోసం పోరాటం
  • దోమల నివారణకు శ్రీకారం 
  • ప్రతి ఆదివారం..10 గంటలకు..10 నిమిషాలు..
  • రాబోయే 10 వారాల పాటు..క్రుషి చేయాలి : మేయర్

 ఆర్సీ న్యూస్, ఆగస్టు 22 (హైదరాబాద్): దోమల నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరాన్ని దోమల రహిత నగరంగా మారడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఆదివారం తన ఇంట్లో సంబంధిత ఎంటమాలజీ అధికారులు సిబ్బందితో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు ఇతర గార్డెన్ ఏరియాలో నీటి నిల్వ ఉండకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలని కోరుతూ తన ఇంట్లో కొద్దిసేపు నీటి నిల్వతో పాటు చెత్తను తొలగించారు. దోమల రహిత నగరం కోసం పోరాడడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. దోమలనివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. అందరి సమిష్టి కృషితో దోమల నివారణ సాధ్యపడుతుందని ఆమె అంటున్నారు. తమ తమ ఇళ్లల్లో దోమల నుండి రక్షణ కోసం తగిన ముందు జాగ్రత్తలు అవసరం అంటున్నారు. కుటుంబ సమేతంగా మన ఇంటిని పరిసరాలను శుభ్రం చేసుకుందాం.. నిల్వ ఉన్న నీటిని తొలగిద్దాం.. దోమల నుండి రక్షణ పొందుదాం.. అంటూ నగరంలో ఈ ఆదివారం నుంచి రాబోయే 10 వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. నగరంలో మలేరియా, డెంగు తదితర వ్యాధుల నివారణకై గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమె కోరారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని గ్రేటర్ ప్రజలకు ఆమె సూచించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీ నుంచి దోమల నివారణ క్యాంపును రాబోయే 10 వారాల పాటు కొనసాగించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యేటట్లు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గ్రేటర్ లోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె కోరారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం దోమల రహిత నగరంగా మారుతుందన్నారు. ఇందుకోసం కార్పొరేటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె కోరారు. సీజనల్ వ్యాధుల నివారణకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మలేరియా,డెంగ్యూ,చికెన్ గునియా తదితర వ్యాధులను అరికట్టడానికి యాంటీ లార్వా క్యాంపు కొనసాగించాలన్నారు. దోమలను నశింప చేయడం కోసం ఇండ్లు, కార్యాలయాలలో ఉన్న నీటి నిల్వలను ఖాళీ చేయించి పరిశుభ్రంగా.. పొడిగా ఉంచాలన్నారు. తద్వారా దోమల వ్యాప్తి నివారణ సాధ్యమవుతుంద న్నారు. ఇందులో భాగంగానే తాను ఈ ఆదివారం తన ఇంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలోని నీటి నిల్వలు పెరటిలో పేరుకుపోయిన నీటిని తొలగించానన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు ఎవరి ఇంట్లో వారు దోమల పెరుగుదలకు ఉపయోగపడే వస్తువులను తొలగించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇల్లు,ఇళ్ల పరిసరాలు, ఆఫీసులు, పరిశ్రమలు, మూతలేని ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపు, డ్రమ్ములు, సిమెంట్ హౌస్ తొట్టిలు, కుండీలు, కూలర్లు, కుళాయిల కుంటలు, పాత టైర్లు, పూల కుండీల కింద ప్లేట్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ఇతర పనికిరాని పగిలిపోయిన వస్తువులు, నీటిలో దోమల గుడ్లు పెట్టి పెరుగుతాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తొలగిస్తే దోమల నివారణ సాధ్యమవుతుందన్నారు. దోమల వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దోమల రహిత నగరం కోసం కలిసి పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు.