ఏప్రిల్ 18, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

టీఆర్ఎస్ పార్టీ అహాంకారాన్నిబొంద పెట్టిన ప్రజలు: ఈటెల

  • హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల ఘన విజయం
  • చిత్తుగా ఓడిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి
  • ఉనికి కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ
  • టీఆర్ఎస్ కోట్లు కుమ్మరిచినా..హుజారాబాద్ ప్రజలు నా వెన్నంటే ఉన్నారు..
  • ఇది హుజూరాబాద్ ప్రజా విజయమన్న ఈటెల రాజేందర్

ఆర్సీ న్యూస్, నవంబర్ 02 (హుజూరాబాద్): ఎంతో ఉత్కంటగా జరిగిన హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 107022 ఓట్లు లభించగా..టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 83167 ఓట్లు..కాంగ్రేస్ అభ్యర్థికి 3014 ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేయడంతో పాటు కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి తన శాసన సభ పభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేసి భారీ విజయం సాధించారు. 

  • ముందుగా ఊహించినట్లుగానే ఆయన విజయం ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపించినట్లు అయ్యింది. 
  • తన విజయం హుజూరాబాద్ ప్రజల విజయమని ఈటెల రాజేందర్ అన్నారు. 
  • తన విజయం నియోజక వర్గం ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. 
  • కుల,మత,రాజకీయ వర్గ విభేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు తనను ఆధరించారన్నారు. 
  • అందుకే టీఆర్ఎస్ పార్టీ అహాంకారాన్ని నియోజక వర్గం ప్రజలు బొంద పెట్టారన్నారు.
  •  ఇది పూర్తిగా ప్రజా విజయమన్నారు. 
  • ఈ ఉప ఎన్నికలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోెగం జరిగిందన్నారు.
  •  అడ్డగోలుగా ప్రభుత్వాధికారం దుర్వినియోగం జరిగిందన్నారు.
  •  ఎన్నో రకాలుగా తమ ఓటర్లను మభ్య పెట్టినప్పటికీ..సీఎం కేసీఆర్ కు తగిన రీతిలో హుజూరాబాద్ నియోజక వర్గం ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. 

టీఆర్ఎస్ స్పీడ్ తో ప్రచారం నిర్వహించినా…కమలంకే పట్టంకట్టిన ఓటర్లు..

  • హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే,ప్రస్తుతం బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
  •  ఎన్నో రాజకీయ పరిణామాలకు దారి తీసిన ఈ నియోజకవర్గంలో అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరిగింది. 
  •  ఉప ఎన్నికలను పురస్కరించుకుని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పై దృష్టి సారించి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.
  • ఏ విధంగానైనా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించగా.. పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం కోసం అహర్నిశలు కృషి చేశారు.  
  • నియోజకవర్గంలో తిష్ట వేసిన మంత్రులు కిందిస్థాయి కార్యకర్తల నుంచి ప్రధమ స్థాయి నాయకుని వరకు మంతనాలు జరిపారు. 
  • ఈటెల రాజేందర్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం అధికార టిఆర్ఎస్ పార్టీ అవసరమైన అన్ని పాచికలను వినియోగించి విఫలమైంది.  
  • స్వయంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి పావులు కదిపారు. అయినా ఫలితం దక్క లేదు. 
  • ఉప ఎన్నిక కోసమేనన్నట్లు ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాల పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలుపడంతో.. వివాదాస్పదంగా మారాయి. 
  • అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలకు అమలు చేసింది.
  • ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి దళిత బంధు పథకం పేరుతో అర్హులైన లబ్దిదారులకు అందజేసినప్పటికీ..టీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నికలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగ లేదు.

ఉప ఎన్నికకు దారి తీసిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే… 

  •  ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతూ వచ్చిన ఈటల రాజేందర్ పై ఏప్రిల్ 30వ తేదీన భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి.
  • ఓవైపు రాష్ట్రంలో కరోణ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండగా.. మరోవైపు ఈటెల రాజేందర్ పై భూకబ్జాలు పేరుతో రాజకీయ దుమారం కొనసాగింది.
  •  జమున హ్యచరీస్ అసైన్డ్ ల్యాండ్ భూ వివాదం తెరపైకి వచ్చింది.
  •  దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ భూ వివాదం పై ఉన్నత స్థాయి విచారణ జరిపించారు.
  • మే ఒకటో తేదీన ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగించారు.
  • మే రెండో తేదీన ఈటెల ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
  • మే మూడో తేదీన దేవర యంజాల్ లోని సీతా రామ స్వామి దేవాలయం భూకబ్జాలకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
  •  జూన్ 12న, ఈటెల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
  • జూన్ 14న, ఈటెల బీజేపీలో చేరారు.
  • ఈ విధంగా ఈటెల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 30న  ఉప ఎన్నిక జరిగేటట్లు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది