ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

వైకుంఠ ఏకాదశి పూజలు 2022.. నేత్ర దర్శనం రద్దు..

వైకుంఠ ఏకాదశి పూజలు 2022.. నేత్ర దర్శనం రద్దు..
  • ఈనెల 13న చార్మినార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వద్దు..
  • భక్తులు లేకుండానే స్వామి వారికి ప్రత్యేక పూజలు..
  • కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వామి వారి నేత్ర దర్శనం రద్దు..
  • ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భక్తులు లేకుండానే వైకుంఠ ఏకాదశి పూజలు..
  • భక్తులు గమనించాలని కోరిన పూజారి

ఆర్సీ న్యూస్, జనవరి 11 (హైదరాబాద్): చార్మినార్ ఈస్ట్ చౌక్ మైదాన్ ఖాన్ ప్రాంతంలోని అత్యంత ప్రాచీనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేత్ర దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ పూజారి శృంగారం ఆత్రేయ ఆచార్య తెలిపారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి కి తమ దేవాలయంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని దేవాలయంలో ఈ నెల 13వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇప్పటికే తగిన ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వైకుంఠ ఏకాదశి పూజలను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులెవరు లేకుండానే శ్రీ వెంకటేశ్వర స్వామి కి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను పొడిగించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ సూచనలను భక్తులు గమనించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేత్ర దర్శనం కోసం ప్రత్యేకంగా దేవాలయానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.