areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జర్నలిస్ట్ రఘు అరెస్టును వ్యతిరేకిస్తూ జర్నలిస్టు సంఘాల నిరసనలు.. 

జర్నలిస్ట్ రఘు అరెస్టును వ్యతిరేకిస్తూ జర్నలిస్టు సంఘాల నిరసనలు..
 • నగరంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపిన జర్నలిస్టలు
 • నిరసన అనంతరం డీజీపీకి వినతి ప్రతం అందజేత
 • రఘు న్యాయ పోరాటంలో అండగా ఉంటామన్న జర్నలిస్టు నాయకులు
 • జర్నలిస్టు సంఘాల ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ
 • మఫ్టీలో వచ్చి ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చందో చెప్పాలన్న హెచ్చార్సీ
 • ఈ మేరకు రాచకొండ సీపీకి నోటీసులు జారీ చేసిన హెచ్చార్సీ.

ఆర్సీ న్యూస్, జూన్ 11(హైదరాబాద్): జర్నలిస్ట్ రఘు అరెస్టును వ్యతిరేకిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోొని పలు ప్రాంతాలలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్య్లూజేఎఫ్) తరఫున జర్నలిస్ట్ లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. చేతులలో ప్ల కార్డులు పట్టుకుని జర్నలిస్ట్ లు నిరసన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య పార్కు వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీడబ్య్లూజెఎఫ్, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీబీజేఏ),హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ (హెచ్ యు జే) తదితర జర్నలిస్ట్ సంఘాల నాయకులు,విలేకరులు పాల్గొని తమ గళం వినిపించారు. జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేయాలని, ఆయనపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రఘు అరెస్టులో అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా..ఆయన అందుబాటులో లేకపోవడంతో సంబందిత అధికారులకు అందజేశారు.

జర్నలిస్టు సంఘాల ఫిర్యాదుతో స్పందించిన హెచ్చార్సీ…

 • ఇప్పటికే ఈ నెల 9న, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరితో పాటు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో  ప్రతినిధుల బృందం ఈనెల 9వ తేదీన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది.
 •  జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు ఫిర్యాదు చేశారు.
 •  వెంటనే స్పందించిన మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ) జర్నలిస్ట్ రఘు అరెస్టు వ్యవహరంపై పూర్తిస్థాయిలో వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని రాచకొండ పోలీసు కమిషనర్ ను ఆదేశించింది.
 •  మఫ్టీలో జర్నలిస్టు రఘును ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చందో తెలపాలంటూ హెచ్చార్సీ రాచకొండ పోలీసు కమిషనర్ కు శుక్రవారం నోటీసు జారీ చేసింది.

జర్నలిస్ట్ రఘు సతీమణిని కలిసి అండగా ఉంటామన్న జర్నలిస్టు నాయకులు…

 • ఈ నెల 10వ తేదీన, టీడబ్య్లూజేఎఫ్ ప్రతినిధుల బృందం,ప్రొఫేసర్ కొదండరాం తదితరులు వేర్వేరుగా జర్నలిస్ట్ రఘు సతీమణిని కలిసి తమ సానుభూతి తెలిపారు.
 •  రామాంతాపూర్ లోని శ్రీనివాసాపురంలో తమ బంధువుల ఇంట్లో ఉంటున్న ఆమెను కలిసి జర్నలిస్ట్ విడుదలయ్యేంత వరకు తాము అండగా ఉంటామన్నారు.
 • ఆయన అక్రమ అరెస్టును తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని..రఘు చేసే న్యాయ పోరాటంలో తమ మద్దతు పూర్తిగా ఉంటుందని హామి ఇచ్చారు.
 •  రఘుకు మద్దతుగా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమెకు వివరించారు.
 • ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శుక్రవారం పలు జిల్లాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం

ప్రత్యేక రాష్ట సాధనకు పాటుపడిన జర్నలిస్ట్ లకు కరువైన రక్షణ..

 • రఘు అరెస్టును వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన అనంతరం టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యలు మాట్లాడారు.
 • . తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధనకు పాటుపడిన తెలంగాణ జర్నలిస్ట్ లకు రక్సణ కరువైందన్నారు.
 • విధినిర్వాహణలో భాగంగా జర్నలిస్ట్ రఘు సూర్యాపేట్ జిల్లాలోని హుజూర్ నగర్ కు వెళ్ళి గుర్రంపోడు గిరిజనుల పోడు భూములపై కథనాన్ని అందజేయడం జరిగిందని..ఈ కథనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలించడం సరైంది కాదన్నారు.
 •  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం క్రుషి చేసిన జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం బాధాకరమన్నారు.
 •  రాష్ట్రంలో పత్రికా స్వెచ్చ,భావ ప్రకటనా స్వెచ్చ ప్రమాదంలో పడ్డాయన్నారు.
 • రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తను చేసిన తప్పును ఒప్పుకుని జర్నలిస్ట్ రఘుపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తి వేసి బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
 •  వెంటనే రఘును విడుదల చేయకపోతే..రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రుతం చేస్తామన్నారు.
 • హైదరాబాద్ నగరంలో శుక్రవారం జరిగిన ఈ నిరఃసన కార్యక్రమంలో టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఐఎఫ్ డబ్య్లూ జె జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమెహన్, పద్మనాభరావు, టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, కార్యదర్శి ఏ.నర్సింగ్ రావు, సలీమా, కె.పాండు రంగారావు, హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్(హెచ్ యు జే) అధ్యక్షులు కె.చంద్రశేఖర్, కార్యదర్శి నిరంజన్, ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్(టీబీజేఏ) నాయకులు అనీల్ కుమార్,రాజమణి,కూకట్ పల్లి నియోజక వర్గం అధ్యక్షుల మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.