మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

అశ్రు నయనాల నడుమ ముగిసిన బీబీ కా ఆలం ఊరేగింపు..

అశ్రు నయనాల నడుమ ముగిసిన బీబీ కా ఆలం ఊరేగింపు..
  • చార్మినార్ వద్ద బీబీకాఆలంకు స్వాగతం పలికిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు
  • పాతబస్తీ వీధుల్లో కొనసాగిన డబీర్ పురా బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు..
  • అంబారీపై ఆలంతో భారీగా సామూహిక ఊరేగింపు..
  • దారి పొడవునా రక్తం చిందించిన షియా ముస్లింలు..
  • పెద్ద ఎత్తున చార్మినార్ కు చేరుకున్న అన్ని వర్గాల ప్రజలు..
  • మీరాలంమండి వద్ద గాజుల అంజయ్య ఆధ్వర్యంలో స్వాగత వేదిక ఏర్పాటు..

ఆర్సీ న్యూస్, ఆగస్టు 20 ( హైదరాబాద్):  పదో మొహర్రంను పురస్కరించుకుని శుక్రవారం పాతబస్తీ వీధుల్లో డబీర్ పురా లోని బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు అశ్రు నయనాల నడుమ ముగిసింది. సామూహిక ఊరేగింపును పురస్కరించుకుని ఇప్పటికే పాతబస్తీ వీధులలో అంబారీపై బీబీ కా ఆలం ఊరేగింపు రిహార్సల్ నిర్వహించడంతో శుక్రవారం ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్త లేదు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని ఈనెల 20వ తేదీన డబీర్ పురా బీబీ కా అలావాలోని బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. 

  • బీబీ కా ఆలం ఊరేగింపుకు చార్మినార్ వద్ద నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు స్వాగతం పలికారు.
  •  ఏనుగుపై వచ్చిన ఆలంకు వారు పూలు,దట్టీలు సమర్పించారు.  
  • శుక్రవారం నిర్వహించిన బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు సందర్భంగా దక్షిణ మండలం పోలీసులు అవసరమైన బందోబస్తు చర్యలు తీసుకున్నారు.  
  • డబీర్ పురా నుంచి ప్రారంభమైన సామూహిక ఊరేగింపు యాకుత్పురా దర్వాజా, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలంమండి, పురాని హవేలీ, దారుల్ షిఫా ద్వారా చాదర్ ఘాట్ వరకు కొనసాగింది.  
  • ఊరేగింపును పురస్కరించుకొని ఆయా రోడ్లలో అవసరం మేరకు సమయాను కూలంగా ట్రాఫిక్ ను దారి మళ్ళించారు. 
  •  బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 
  • కేవలం షియా ముస్లిం ప్రజలే కాకుండా హిందువులు సైతం సందర్శించి బీబీ కా ఆలం లకు స్వాగతం పలికారు.
  • ఇరు వర్గాల ప్రజలు మొక్కలు చెల్లించుకోవడంతో మొహర్రం సంతాప దినాలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
  • ఊరేగింపు సందర్భంగా షియా ముస్లింలు దారి పొడవునా మాతం చేస్తూ రక్తం చిందించారు. 
  • హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్థం నిర్వహించే మొహరం సంతాపదినాలు ఈ నెల 11వ తేదీతో ప్రారంభమైన విషయం తెలిసిందే.
  •  షియా ముస్లింలు అరవై ఎనిమిది రోజుల పాటు సంతాప దినాలను నిర్వహిస్తారు. 
  • నల్లటి దుస్తులు ధరించి ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ స్మరిస్తూ నిరసనలు తెలియజేశారు.  
  • ఆయన మరణాన్ని తాము ఎప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ దారిపొడవునా మజ్లిస్, మాతం నిర్వహించారు.  
  • ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు..మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్ పురా లోని బీబీ కా అలావాలో ప్రతిష్టించిన బీబీ కా ఆలం లకు ప్రతి రోజు పలువురు అధికార, అనధికార ప్రముఖులు పూలు దట్టీలు సమర్పించారు.
  • ఇక, శుక్రవారం మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలంమండి ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన స్వాగత వేధికపై నుంచి పలువురు బీబీకాఆలంకు స్వాగతం పలికారు.
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అఖిల భారత యువజన కాంగ్రేస్ కమిటి ఉపాధ్యక్షులు అనీల్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి కార్యదర్శి గాజుల రాహుల్ తదితరులు హాజరై ఆలంకు పూలు,దట్టీలు సమరర్పించారు.

ఏనుగుపై వచ్చిన ఆలంకు వారు పూలు,దట్టీలు సమర్పించారు.