మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జూ పార్క్ సందర్శన షురూ…

పార్క్ సందర్శన షురూ…
  • రెండు నెలల పాటు మూసి వేసిన జంతు ప్రదర్శన శాల
  • కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మే 2 నుంచి మూసి వేసిన జూ 
  • ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభం
  • కరోనా నిబంధనలు పాటిస్తూ..సందర్శనకు అనుమతి

ఆర్సీ న్యూస్, జూలై 10 (హైదరాబాద్): కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో నగరంలోని నెహ్రూ జులోజికల్ పార్క్ ను ఈ నెల 11 ఉదయం నుంచి తిరిగి తెరుస్తున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సందర్శకులను పార్క్ లోనికి అనుమతించనున్నారు. గత రెండు నెలల క్రితం మూసి వేసిన జూ సందర్శన తిరిగి తెరుచుకుంటుండడంతో జంతు ప్రేమికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు దూరం కావడంతో రోజంతా ఇళ్లల్లోనే గడపడానికి చికాకుపడుతున్న నేపధ్యంలో ఆదివారం నుంచి జూ పార్కు సందర్శన అందుబాటులోకి వస్తుండడంతో ఆనందిస్తున్నారు. పార్క్ వెళ్లి తమకు ఇష్టమైన జంతువులను లైవ్ గా చూడవచ్చునని సంబరపడుతున్నారు. జూ లోనికి వచ్చే సందర్శకులు తప్పని సరిగా కోవిడ్19 నిబంధనలు పాటించాల్సి ఉంటుందని జూ పార్క్ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని వారికి ఛలానా విధించబడుతుందని తెలిపారు.

పాటించాల్సిన నిబంధనలు..

  • ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ధర్మన్ స్ర్కీనింగ్ తప్పని సరిగా చేయించుకోవాలి
  • జర్వంతో పాటు జలుబు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఎట్టిపరిస్థితులలో పార్క్ లోనికి అనుమతి ఉండదు.
  • ఆరోగ్యంగా ఉన్న వారు మాత్రమే జూ సందర్శనకు రావాలని సంబందిత అధికారులు సూచిస్తున్నారు.
  • 10 ఏళ్ల వయస్సు కన్నాతక్కువ ఉన్న చిన్నారులను..65 ఏళ్ల వయస్సు కలిగిన పెద్దలను వీకెండ్ లలో అనుమతించరు.
  • వీకెండ్ లలో సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుందని..వీరు ఆయా రోజులలో పార్క్ కు రాకపోవడమే మంచిదని అధికారులు అంటున్నారు.
  • సఫారీ పార్క్ కాంప్లెక్స్, రాత్రిపూట యానిమల్ హౌజ్,సరీస్రుపాల ఎన్ క్లోజర్, ఫిష్ అక్వేరియం,శిలాజ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం తదితర ఎన్ క్లోజర్ లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంచుతామన్నారు.
  • వీటిలోకి గుంపులు,గుంపులుగా సందర్శకులు వెళితే కరోనా వైరస్ వ్యాప్తి సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున ప్రస్తుతం అనుమతించడం లేదంటున్నారు.
  • టిక్కెట్ బుకింగ్ వద్ద భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.
  • జూ లోని ఎన్ క్లోజర్ల వద్ద గుంపులు,గుంపులుగా కాకుండా ఆరు అడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది.
  • సెఫ్ మాస్క్ లు లేకుండా జూ పార్క్ లోనికి అనుమతి లేదు.
  • జూ లోపలికి వెళ్లిన తర్వాత మాస్క లు లేకుండా కనిపిస్తే..రూ.200 జరిమాన కట్టాల్సి ఉంటుంది. జరిమానా కట్టకపోతే..జూ పార్క్ నుంచి బయటకు పంపిస్తారు.  
  • బ్యాటరీ వెహికల్స్,టాయ్ ట్రైన్ లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కారణం..భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున
  • అవసరమైతే ఒక కుంటుంబం తమ సౌకర్యార్ధం మొత్తం బుక్ చేసుకోవచ్చు.
  • జూ పార్క్ లోపల బారికేడ్లతో పాటు ఇతర వస్తువులను తాక రాదని చెబుతున్నారు. నియమిత రూట్ లలోనే నడవాల్సి ఉంటుంది.
  • సందర్శకుల సౌకర్యార్ధం ప్రధాన గేట్ లతో పాటు బుకింగ్ కౌంటర్స్ వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
  • నిర్ధేశించిన స్థలాలలోనే ఆహార పదార్ధాలను భుజించాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తిన డానికి వీలు లేదు.
  • తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అతిథి గ్రుహాల బుకింగ్ నిలిపి వేస్తారు.
  • జూ  లో ఉమ్మి వేస్తే..జీహెచ్ఎంసీ 1955 చట్టం ప్రకారం రూ.1000 జరిమానా విధిస్తారు.
  • విధినిర్వాహణ లోని సిబ్బంది ఎక్కడైనా కరోనా నిబంధనలు పాటించకపోతే..వెంటనే ఆయా సిబ్బందిపై సంబందిత అధికారులకు ఫిర్యాదు చేయ వచ్చు.