ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

టీం వర్క్ తో  పని చేస్తే ఆశించిన ఫలితాలు: సీపీ

టీం వర్క్ తో  పని చేస్తే ఆశించిన ఫలితాలు: సీపీ

 

  • అఫ్జల్ గంజ్ పోలీసులకు సీపీ అభినందనల వెల్లువ
  • రాష్ట్రంలో 4వ ఉత్తమ పీఎస్ గా అఫ్జల్ గంజ్ 
  • పీఎస్ సిబ్బందికి మెమెంటోలను అందజేసి అభినందించిన సీపీ
  • శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రం కీలకం
  • ప్రజలతో మమేకమై టీం వర్క్ తో పని చేస్తే ఉత్తమ ఫలితాలు
  • టాస్క్ ఫోర్స్ పోలీసుల సేవలను మరువ లేం
  • కేవలం 1 నిముషంలోనే సంఘటనా స్థలానికి చేరుకుంటున్న టాస్క్ ఫోర్స్

ఆర్సీ న్యూస్,జూన్ 30 (హైదరాబాద్): పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అందరూ కలిసి కట్టుగా పని చేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తామని.. అప్పుడే ఆ పోలీసు స్టేషన్ పరిపూర్ణంగా ఉంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అఫ్జల్ గంజ్ పోలీసులు టీం వర్క్ చేస్తూ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 4వ ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపికైందన్నారు. ఈ పోలీసు స్టేషన్లో పని చేసే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తో పాటు సిబ్బంది కలిసి మెలసి విధినిర్వాహణ కొనసాగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. వీరందరికి అభినందనలు తెలియ జేస్తున్నానన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగవ ఉత్తమ పీఎస్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. 2020-21 సంవత్సరానికి ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక కావడంతో బుధవారం పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అభినందన సభ నిర్వహించారు. పీఎస్ లో పని చేస్తున్న సిబ్బందికి పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మెమెంటోలు అంద జేసి ఘనంగా సత్కరించారు. పేరు పేరున అందరినీ అభినందించారు. సిబ్బంది టీం వర్క్ కు ఫిదా అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..విధినిర్వాహణలో అలసత్వం లేకుండా క్రమశిక్షణతో పని చేస్తే..రిజల్ట్ అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ లాగా ఉంటుందన్నారు. నిర్లక్షంగా ఉంటే ఏదీ సాధించ లేమన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రజల రక్షణ కోసం పని చేసే పోలీసులు విధినిర్వాహణలోె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి వత్తిడులు వచ్చినా నిక్కచ్చిగా విధినిర్వాణలో ఉండే పోలీసులు తాము చేసే పనిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తాము చేసిన పనిలో ఫలితాలు వస్తే ఆ సంత్రుప్తి వేరేగా ఉంటుందన్నారు. పండుగలు,ఉత్సవాలు వచ్చినప్పుడు స్థానిక ప్రజలతో కలిసి పోయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే భాద్యత కూడా తమదేనన్నారు. స్నేహపూర్వకంగా ఉంటే ఎక్కడ సమస్యలు తలెత్తవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా నిరుద్యోగులు నేరుగా సబ్-ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలు పొందారన్నారు. వీరంతా నేరుగా ఎస్ఐ లుగా నియమితులయ్యరన్నారు. ప్రతిభ ఉన్న వారికి ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇక, ప్రతి పోలీసు స్టేషన్ లో 30 శాతం మంది మహిళలు విధినిర్వాహణ కొనసాగిస్తున్నారన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగే మహిళా నేరాలపై ఈ మహిళా పోలీసు సిబ్బంది వెంటనే స్పందిస్తూ సంబందిత పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు సహకరిస్తుంటారన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో మహిళా పోలీసులు కూడా పని చేస్తున్నారన్నారు. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో టాస్క్ పోలీసుల విధినిర్వాహణ ఎంతో కీలకంగా ఉంటుంది. నేరాలు జరిగినప్పడు వెంటనే స్పందిస్తారు. ఎక్కడైనా క్రైం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే టాస్క్ పోర్స్ పోలీసులు కేవలం ఒకే ఒక నిముషంలోనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్డుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సేవలను మరవలేమన్నారు. అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ఎలంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఇక్కడి పోలీసులు చేస్తున్న టీం వర్క్ ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు.  ఇంకా ఈ కార్యక్రమంలో నగర అదనపు పోలీసు కమిషనర్( లా అండ్ ఆర్డర్) డి.ఎస్.చౌహాన్,జాయింట్ సీపీ,ఈస్ట్ జో్న్ ఎం.రమేష్, టాస్క్ ఫోర్స్ డిసీపీ చక్రవర్తి, ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ ముత్యంరెడ్డి, ఓఎస్డీ(ఎస్బీ) గోవర్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.