మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో ధర్నాలు,ర్యాలీలు నిర్వహించ వద్దు: సిటీ కమిషనర్

ధర్నాలు,ర్యాలీలు నిర్వహించ వద్దు కమిషనర్ అంజనీకుమార్

ఆర్సీ న్యూస్( హైదరాబాద్): ప్రస్తుతం కరోనా వైరస్ రోజు రోజు విస్థరిస్తున్నందున నగరంలో ధర్నాలు,ర్యాలీలు నిర్వహించ వద్దని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. సెకండ్ వేవ్ కరోనా భయాందోళన కలిగిస్తున్న నేపథ్యంలో గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదన్నారు. ఇలాంటి సమయాల్లో పోలీసులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయని… ప్రతి పోలీసు తగిన ముందస్తు జాగ్తత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి క్లిష్ట ( పాండమిక్) పరిస్థితుల్లో ర్యాలీలు అవసరం లేదన్నారు. మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఆయన శనివారం విలేకరులకు వివరించారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడం తో పాటు వైరస్ బారిన పడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు సూచించారు. కరోనా వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన 20 అంశాల పట్ల ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలని కోరారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల సమన్వయంతో కొన్ని అవసరమైన సూచనలు,సలహాలను రూపొందించారు. వీటిని పాటిస్తే..ఆశించిన ఫలితాలుం టాయని ఆయన తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల వారు కూడా ముందుకు వచ్చి తమతో సహకరిస్తే..మంచి ఫలితాలు సాధించగలమని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండడానికి ఈ సూచనులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఎవరికైనా జ్వరం, జలుబు,దగ్గు వచ్చినప్పుడు..వాసన,రుచి కోల్పోయి నప్పుడు..కండరాల నొప్పి కలిగినప్పుడు సంబంధిత విభాగంలో విధినిర్వహణ కొనసాగిస్తున్న సిబ్బంది వెంటనే తమ ఉన్నతాధికారులకు తెలియజేయాలని తాము నగరంలోని సిబ్బందికి తెలియజేశామన్నారు. ఇలా ఏ మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తమంతట తాము అలెర్టై..గుంపు నుంచి తమకు తాము వేరుపడి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అఫ్పుడే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవడమే కాకుండా సమాజంలోని ఇతరులను కాపాడడానికి వీలు పడుతుందని ఆయన సూచించారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి గురించి మాట్లాడితే..వైరస్ గాలిలో 3 గంటల వరకు ఉంటుందని..వైరస్ సోకిన వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే..అతనికి దగ్గరగా ఉన్న ఎవరైనా వైరస్ బారిన పడే అవకాశాలున్నయని..ఒకవేళ అలాంటి వ్యక్తి తారసపడితే..అతనికి 6 అడుగుల దూరాన్ని మెయింటేన్ చేయాలని కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఇతరులు తాకిన వస్తువులను మనం తాకిన అనంతరం తప్పనసరిగా శానిటైజ్ (శుభ్రం) చేసుకోవాలన్నారు. తాము ఇప్పటికే నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లలోని సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. ఇక ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే..సంబందిత పోలీసు స్టేషన్ ఫోన్ నెంబర్ కు గానీ..సంబందిత ఎస్ఎహ్ఓ ( స్టేషన్ హౌజ్ ఆఫీసర్)కు ఫోన్ లో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తొందర పడి పోలీసు స్టేషన్ కు పరుగులు తీయాల్సిన అవసరం లేదన్నారు. ఫోన్ లలో ఫిర్యాదులను స్వీకరించి వెంటనే దర్యాప్తు చేపడతారన్నారు. అత్యవసరం అనుకుంటేనే పోలీసు స్టేషన్ కు నేరుగా రావాలన్నారు. అది కూడా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుని పీఎస్ కు రావాలన్నారు. పోలీసు స్టేషన్లోని సిబ్బంది ఫిర్యాదు దారులతో పాటు స్టేషన్ సిబ్బందితో మాట్లాడేటప్పుడు తప్పని సరిగా 6 అడుగుల దూరం పాటించాలన్నారు. మాస్క్ లు ధరించేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలని..ఎట్టిపరిస్థితుల్లో మాస్క్ ముందు భాగాన్నిఎట్టిపరిస్థితులలో చేతులతో తాకకూడదు..ఎందుకంటే చేతులతో పాటు మాస్క్ పై కూడా కరోనా వైరస్ ఉండవచ్చు.. అందుకే మాస్క్ లను తొలగించిన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని నగర పోలీసు కమిషనర్ సూచించారు. ఎల్లప్పుడు సింగిల్ మాస్క్ లనే ధరించాలి..డబుల్ మాస్క్ లను ధరిస్తే…తలనొప్పితో పాటు ఇతర సమస్యలు వస్తాయని ఆయన సూచించారు. నగర ప్రజల సౌకర్యార్ధం 9490616780 అనే హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 24 గంటలు పని చేస్తుందని..వాట్స అప్ సౌకర్యం కూడా ఉందని ఆయన తెలిపారు. అలాగే దయల్ 100 తో పాటు 040-23434343 అనే నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు ఏ ఫిర్యాదునైనా 90 శాతం ఫోన్ల ద్వారానే చేయాలని ఆయన కోరారు. ప్రతి కార్యాలయంలోని సిబ్బంది అందరూ ఒకేసారి బోజనాలు చేయవద్దని ఆయన సూచించారు. తలుపులు,లిఫ్ట్ బటన్లు,కంప్యూటర్ కీ బోర్డులు, మౌస్లు,వెహికల్ స్టీరింగ్ తదితర వాటిని ప్రతి షిప్టుకు శుభ్రపరచాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం మతపరమైన సమావేశాలు చేయవద్దు..ఈ విషయంలో ప్రజలు కూడా తమతో పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. సిబ్బంది, అధికారులు అనోరోగ్యంతో ఉన్నప్పడు వారికి బహిరంగంగా విధులు కేటాయించకుండా..ఇతర పనులు అప్పగించాన్నారు. డ్యూటీ ముగించిన అనంతరం ఇంటికి వెళ్లగానే..కుటుంబ(చిన్నారులను) సభ్యులను తాకరాదని..శుభ్రం చేసుకున్నాకనే తాకాలని ఆయన పోలీసులకు సూచించారు. చేతులను కనీసం రెండు నిమిషాల సేపు సబ్బుతో కడగాలని…చేతి గోళ్లను వారంలో రెండు సార్లు తప్పకుండా తొలగించాలని ఆయన సూచించారు. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటిస్తూ..నగర పోలీసులతో పూర్తిగా సహకరించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు.