మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో నెలకొన్న ఆషాడ మాసం బోనాల సందడి ..

నగరంలో నెలకొన్న ఆషాడ మాసం బోనాల సందడి ..

 

  • పరస్పర సహకారంతో బోనాలను ఘనంగా నిర్వహిద్దాం: సీపీ
  • ఆరోగ్యంగా ఉన్నవారే జాతరలో పాల్గేటట్లు చర్యలు..
  • కన్నుల పండువగా బోనాల నిర్వాహణకు సిద్దం: ఊరేగింపు కమిటి
  • ఢిల్లీ ధర్వాజ మహాంకాళి అమ్మవారి దేవాలయం సందర్శన
  • వెంటనే అభివృద్ది పనులు చేపట్టాలన్న ఊరేగింపు కమిటి

ఆర్సీ న్యూస్,జూన్ 29 (హైదరాబాద్): నగరంలో ఆషాడ మాసం బోనాల సందడి కొనసాగుతోంది. తెలంగాణ సంస్ర్కుతి, సంప్రదాయాలకు అనుగుణంగా నగరంలో ప్రతి ఏటా బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. ఈసారి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా ఉత్సవాల నిర్వాహకులు సమావేశాలు నిర్వహిస్తూ తగిన ఏర్పాట్లకు సిద్దమవు తున్నారు. ఉత్సవాను పురస్కరించుకుని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం బషీర్ బాగ్ లోని పో్లీసు కమిషనరేట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..

  • బోనాల జాతర ఉత్సవాలను పరస్సర సహకారంతో ఘనంగా నిర్వహిద్దా మన్నారు.
  •  ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే దక్షిణ మండలం,ఉత్తర మండలం డీసీపీలు, పశ్చిమ మండలం జాయింట్ పోలీసు కమిషనర్ లు సంబందిత ఉత్సవాల నిర్వాహకులతో చర్చిస్తున్నారన్నారు. 
  • ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నా రన్నారు. 
  • గోల్కొండ,సికింద్రబాద్, లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయాల బోనాల ఏర్పాట్లను తమ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. 
  • దేవాలయాల గర్బగుడిలో తక్కువ స్థలం అందుబాటులో ఉంటుందని..అందుకు అనుగుణంగా నిర్వహకులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 
  • అలాగే అనారోగ్యంగా ఉన్న వారు జాతరలో పాల్గొనకుండా వారి వారి కుటుంబ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు.

ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో జరిగిన బోనాల సమావేశం..

  • భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ అధ్యక్షతన సోమవారం రాత్రి ఛత్రినాకలోని ఆర్డీ ఫంక్షన్ హాల్లో దక్షిణ మండలం(పాతబస్తీ)లోని అన్ని అమ్మవారి దేవాలయాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. 
  • ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులతో పాటు మీర్ చౌక్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్(ఏసీపీ) ఆనంద్, ఫలక్ నుమా ఏసీపీ మాజిద్, ఛత్రినాక ఇన్స్ ఫెక్టర్ జిలానీ తదితరులు హాజరయ్యారు. 
  • రాబోయే బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో పాటు దశ,దిశ నిర్దేశించుకునే విధంగా సమావేశం కొనసాగింది.
  • బోనాల జాతర ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందున అమ్మవారికి దేవాలయాలలో భక్తి శ్రద్దలతో భోనాలను సమర్పిద్దామని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఫిలుపునిచ్చారు.
  • ఉత్సవాలు కన్నుల పండువగా జరగడానికి సంబందిత పోలీసుల సహకారం ఎంతో అవసరమన్నారు.
  • కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిద్దామన్నారు.
  • ఈ సమావేశంలో ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, వేణుగోపాల్, కార్యదర్శులు గాజుల రాహుల్(గబ్బర్),ముఖేష్ యాదవ్ లతో పాటు ఊరేగింపు కమిటి మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, జనగామ మధుసూదన్ యాదవ్, మల్లేశం గౌడ్, కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ ధర్వాజ మహాంకాళి అమ్మవారి దేవాలయం సందర్శించిన ప్రతినిధులు..

  • భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం మంగళవారం ఉదయం నయాపూల్ లోని ఢిల్లీ ధర్వాజా మహాంకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించింది. 
  • వారితో పాటు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)కు చెందిన డిఫ్యూటి ఇంజనీర్ కూడా ఉన్నారు.
  • బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా పాతబస్తీలో ఘనంగా నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అనంతరం ముగింపు పూజలు ఢిల్లీ ధర్వాజ అమ్మవారి దేవాలయం వద్ద జరుగుతాయి.
  • పాతబస్తీ నుంచి జరిగే ఘటాల ఊరేగింపు ఇక్కడ పరిసమాప్తి అవుతుంది.
  •  దీంతో ఈ దేవాలయానికి బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
  • అందుకే ఢిల్లీ ధర్వాజ మహాంకాళి అమ్మవారి దేవాలయాన్ని వద్ద వెంటనే అభివృద్ది పనులు చేపట్టాలని కమిటి  డీఈ ని కోరింది.