మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పాతబస్తీ బోనాల ఉత్సవాలకు రూ.6 కోట్ల నిధులు..

పాతబస్తీ బోనాల ఉత్సవాలకు రూ.6 కోట్ల నిధులు..
  • రూ.6 కోట్లతో 138 అభివృద్దిపనులు. 
  • పాతబస్తీలో ఘనంగా బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు
  • సర్కిల్స్ వారిగా పనుల కోసం ప్రణాళికలు
  • పాతబస్తీ బోనాల ఏర్పాట్లపై చార్మినార్ జోనల్ కమిషనర్  సమావేశం..
  • పండుగకు ముందే పనులు చేపట్టాలి: ఊరేగింపు కమిటి 


ఆర్సీ న్యూస్,జూలై 15 (హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలో పలు అభివృద్దికార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సంబందిత అధికారులతో పాటు భాగ్యనగర్ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రథినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా పాతబస్తీలోని పలు దేవాలయాల వద్ద నిర్వహించాల్సిన పలు అభివృద్దిపనులపై జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ చర్చించారు. బోనాల జాతర ఉత్సవాలకు ముందే నగరంలో అభివృద్ది పనులు నిర్వహించి పూర్తి చేయాలని పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే సంబందిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 కోట్ల నిధులను మంజూరు చేసిందని…ఇందులో రూ.75 కోట్లు బోనాల ఏర్పాట్ల నిర్వాహణ కోసం, రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు అర్ధిక సహాయం అందజేస్తున్నామని మంత్రి ఈ నెల 12న సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు చార్మినార్ జోనల్ కమిషనర్ పాతబస్తీలోని తన కార్యాలయంలో గురువారం జోనల్ అధికారులతో పాటు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతి నిధులతో సమావేశం నిర్వహించి పలు అంశాలను చర్చించారు. మలక్ పేట్ సర్కిల్-6 పరిధిలో రూ.92.31 లక్షలతో 35 పనులను చేపట్టనున్నారు. సంతోష్ నగర్ సర్కిల్‌-7 పరిధిలోని యాకుత్ పురా నియోజక వర్గంలోని పలు ప్రాంతా లలో రూ.1,36,81,000 లతో పనులు చేపట్టనున్నారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్‌-8 పరిధిలో రూ.1,31,20,000 లతో 40 పనులు, చార్మినార్ సర్కిల్-9 పరిధిలో రూ.1,07,50,000 లతో 21 పనులు, ఫలక్ నుమా సర్కిల్‌-10 పరిధి లోని బహదూర్ పురా నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో రూ.33.68 లక్షలతో 10 పనులను, రాజేంద్రనగర్ సర్కిల్-11లో పరిధిలో రూ.53.26 లక్షలతో 14 పనులను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్బంగా జోెనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ మాట్లాడుతూ..బోనాల పనులు నిర్వహించడానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. పనుల టెంటర్లు పొందిన కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లతో సకాలంలో పనునలు పూర్తి చేయించాల్సిన బాధ్యత సంబందిత అధికారులపై ఉందన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబందిత అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. పాతబస్తీలో జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందన్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ మాట్లాడుతు.. పాతబస్తీలో ఈ నెల 23న దేవాలయాలలో కలశ స్థాపనతో బోనాల హడావుడి మొదలవుతుంద న్నారు. పాతబస్తీలో గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయన్నారు. ఈసారి బోనాల జాతర ఉత్సవా లను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిం దని..అందుకే తాము కూడా భక్తిశ్రద్దలతో ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి నగరంలోని అమ్మవార్ల కు బంగారు బోనంతో పాటు పట్టు వస్థ్రాలు అందజేస్తున్నామన్నారు. అమ్మ వారి దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ఈ నెల 26, 27 తేధీలలో ప్రభుత్వం నుంచి కేటగిరిల వారిగా చెక్కులు లభించనున్నా యన్నారు.