మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బోనాల ఏర్పాట్లపై అధికారుల పర్యటన…

బోనాల ఏర్పాట్లపై పాతబస్తీలో పర్యటించిన అధికారుల బృందం..

 

  • ఉత్సవాల నిర్వాహకులతో కలిసి పర్యటించిన అధికారులు
  • దేవాలయాల వద్ద చేపట్టనున్న అభివృద్దిపనులపై పరిశీలన
  • జీహెచ్ఎంసీ,విద్యుత్,ఎలక్ట్రికల్,ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యటన
  • బోనాల పండుగ ప్రారంభానికి ముందే అభివృద్దిపనులు చేయాలంటున్న నిర్వాహకులు
  • పర్యటనలో జోనల్ కమిషనర్ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఉత్సవాల నిర్వాహకులు
  • మరోసారి జోనల్ కమిషనర్ పర్యటించాలంటున్న నిర్వాహకులు

ఆర్సీ న్యూస్,జూలై 3 ( హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం దక్షిణ మండలం అధికారులు పాతబస్తీలో పర్యటించారు. రాబోయే బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా పాతబస్తీలోని దేవాలయాల వద్ద చేపట్టాల్సిన అభివృద్ది పనులపై అధికారుల బృందం అంచనా వేసింది. జీహెచ్ఎంసీ,విద్యుత్,ఎలక్ట్రికల్,ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యటన శనివారం మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు మీరాలంమండిలో ముగిసింది. అధికారుల వెంట భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ప్రతినిధులున్నారు. దేవాలయాల వద్ద చేపట్టాల్సిన అభివృద్ది పనులను సంబందిత అధికారులకు వివరించారు.

చేపట్టాల్సిన పనులపై అంచనా వేసిన అధికారులు..

  • ఎక్కడ ఎలాంటి పనులు చేపట్టాలనే విషయాలను సంబందిత అధికారులు పరిశీలించారు.
  • వాస్తవానికి జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం పాతబస్తీలో పర్యటించాల్సి ఉంది.
  •  కొన్ని సాంకేతిక కారణాలతో జోనల్ కమిషనర్ పర్యటనలో లేరని కొంత మంది అధికారులు తెలిపారు. 
  • అయితే జోనల్ కమిషనర్ పర్యటనలో లేకపోవడంతో ఉత్సవాల నిర్వాహకులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
  • జోనల్ కమిషనర్ తో మరోసారి పర్యటన నిర్వహిస్తే బావుంటుందని నిర్వాహకులు అంటున్నారు. 
  • పాతబస్తీ ఉప్పుగూడ శ్రీ మహాంకాళి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన అధికారుల పర్యటన లాల్ దర్వాజ, మేకల మండి, అలియాబాద్, గౌలిపురా,సుల్తన్ షాహీ, బేలా చందులాల్,శాలిబండ,హరిబౌలి,కోట మైసమ్మ,మీరాలంమండి తదితర ప్రాంతాలలోని అమ్మవారి దేవాలయాలను సందర్శించి అక్కడ నిర్వహించాల్సిన అభివృద్దిపనులను పరిశీలించారు.
  •  జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కొత్తగాా రోడ్ల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన రోడ్ల మరమ్మత్తులు,ప్యాచ్ వర్క్స్ తదితర పనులను నిర్వహించడానికి అంచనా వేశారు. 
  • పారిశుద్య సమస్యలు,వీధి దీపాల ఏర్పాటు, తాత్కాలిక లైట్ల ఏర్పాటు, రోడ్డుకు అడ్డంగా ఉండే విద్యుత్ వైర్ల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం మొబైల్ ట్రాన్స్ పార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారుల బృందం దృష్టి సారించింది.

ఈ నెల 18న విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బోనాల సమర్పణ..

  • సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా 18వ తేదీన విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ఈ నెల 17న, ఉత్సవాల నిర్వాహకులు,భక్తులు కళాకారులు,పోతు రాజులతో కలిసి పాతబస్తీ నుంచి బయలు దేరి విజయవాడ వెళ్లనున్నారు.
  • భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు. 
  • రాబోయే ఉత్సవాలను పురస్కరించుకుని ఊరేగింపు కమిటి  అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృదం ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావును కలిసి విజయవాడలో నిర్వహించే తెలంగాణ ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలపై చర్చించింది. 
  • బోనాల ఊరేగింపుకు అవసరమైన తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
  • ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు మంత్రిని కోరారు. 

ఈ నెల 30న,పాతబస్తీ అమ్మవార్లకు విజయవాడ అమ్మవారి పట్టు వస్త్రాల సమర్పణ

  • అలాగే ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న, పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనక దుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
  • ప్రతి ఆషాడ మాసం సందర్బంగా అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయి తీగా వస్తొంది…ఇందులో భాగంగా ఈ నెల 30న,నగరానికి పట్టు వస్త్రాలు తీసుకురావ డానికి దేవాలయం ఈవో అంగీకారం తెలిపారు.