మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ముగిసిన మీరాలంమండి అమ్మవారి పంచమ వార్షికోత్సవ వేడుకలు..

ముగిసిన మీరాలంమండి అమ్మవారి పంచమ వార్షికోత్సవ వేడుకలు..

మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగిన మీరాలంమండి శ్రీ మహాంకాళి దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు శనివారం జరిగిన ప్రత్యేక పూజలతో ముగిసాయి. ముగింపు వేడుకల్లో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిజాం కాలం నుంచి భక్తుల పాలిట కొంగు బంగారంగా..కోరిన కోర్కేలు తీర్చే మహాంకాళి అమ్మవారిగా పేరు తెచ్చుకున్న మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 15వ తేదీన ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు వేద పండితులు పాల్గొని అమ్మవారితో పాటు శువుడు, హనుమంతుడు, నవగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. ఈ నెల 15,16,17 తేదీల్లో.. వరుసగా జరిగిన ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దేవాలయం పునర్నిర్మాణం అనంతరం ప్రతి ఏడాది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐదేళ్లు పూర్తిాకావడంతో పంచమ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ముగింపు వేడుకల్లో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి

ముగింపు వేడుకల్లో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి పాల్గొని అష్టోత్తర మహా కుంబాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా పంచహారతి తదితర పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 1809 నుంచి మీరాలంమండి శ్రీ మహాంకాళి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. నిజాం కాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు అవసరమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు మీరాలంమండిలో అందుబాటులో ఉండేవి. నగరానికి చుట్టు పక్కల ఉండే గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన కాయకూరలను మీరాలంమండికి తీసుకొచ్చి విక్రయించే వారు. ఇలా వచ్చిన రైతులు స్థానికులతో కలిసి మహాంకాళి అమ్మవారికి ప్రతి రోజు పూజలు నిర్వహించే వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడి అమ్మవారికి నిరంతరం పూజలు నిర్వహిస్తున్నారు. మహిమ గల అమ్మవారు కావడంతో భక్తుల ఆధరణ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో దేవాలయాన్ని భక్తులకు సౌకర్యంగా తీర్చిదిద్దే భాధ్యతలను స్వీకరించిన ప్రస్తుత దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య దేవాలయ విస్థరణ, అభివ్రుద్ది పనులను చేపట్టారు. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా 2015లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ దేవాలయం పుననిర్మాణం పనుల ప్రారంభించిన ఆయన 2016 ఏప్రిల్ 11న, పూర్తి చేయించారు. పాతనగరంలో అత్యంత విశాలంగా దేవాలయ పుననిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండువగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15,16,17 తేదీల్లో మూడు రోజుల పాటు పంచమ వార్షికోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. పంచమ వార్షొకోత్సవాల్లో భాగంగా ఈ నెల 15,16 తేదీల్లో తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజతో వార్షికోత్సవ పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి.  హోమాలు, ద్వాజారోహనం, అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. ఇక వేడకల్లో భాగంగా ముగింపు రోజైన శనివారం ( 17వ తేదీన) జరిగిన పూజా కార్యక్రమాలన్నీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా పూర్తయ్యాయి.