ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

216 అడుగుల రామానుజ మహా మూర్తి విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

216 అడుగుల రామానుజ మహా మూర్తి విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
  • సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ..
  • ఈ నెల 5న, నగరంలోప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలు
  • ఈనెల 2 నుంచి ప్రారంభమైన సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సహస్రాబ్ది ఉత్సవాలు…
  • ఇప్పటికే ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజ మహా మూర్తి విగ్రహం.. శనివారం సాయంత్రం విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
  • త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం..
  • ప్రధాని పర్యటన సందర్శంగా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్, ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్
  • బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు.
  • సమానత్వమే రామానుజుల మాట..రాబోయే రోజుల్లో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా మారనుంది: సీఎం కేసీఆర్ 

ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 04 (హైదరాబాద్): సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నరేంద్ర మోడీ పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటున్న ప్రధాని అక్కడి నుంచి 2.45 గంటలకు నేరుగా ఇక్రిశాట్ వేళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొననున్నారు. శంషాబాద్ లోని ముచ్చింతల్ ప్రాంతంలో ఎంతో అత్యద్భుతంగా నిర్మించిన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఉత్సవాలు ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిష్టించిన 216 అడుగుల ఎత్తున రామానుజుల మహా మూర్తి విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 

216 అడుగుల రామానుజ మహా మూర్తి : ప్రధాని పర్యటన సందర్శంగా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం..

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్శంగా ముచ్చింతల్లో ఏర్పాట్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించిన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమన్నారు. సమానత్వాన్ని బొధించే రామానుజుల మాటను ఈ స్పూర్తి కేంద్రంలో దొరకుతుందన్నారు. అందరిని సమాన ద్రుష్టితో చూడాలనే రామానుజుల  బాటలో మనమందరం నడవాలన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా మారి పర్యాటకు లను ఆకట్టుకుంటుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులు ఎంతో కష్టపడి స్ఫూర్తి కేంద్రం నిర్మించు కున్నారని ఆయన కొనియాడారు. ఈ కేంద్రాన్ని ఆకర్షణీయంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. 

అనుమతి పాస్ లు ఉన్న వారే రావాలి: డీజీపీ మహేందర్ రెడ్డి

శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్శంగా స్పూర్తి కేంద్రంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని  ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో కలిసి ఆయన శనివారం ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. మోడీ పర్యటన సందర్శంగా అవసరమైన 

బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…వీఐపీలతో పాటు ఇతర అనుమతి పాస్ లు ఉన్న వారు మాత్రమే స్పూర్తి కేంద్రానికి రావాలని సూచించారు. జెడ్ క్యాటగిరి బందోబస్తు కొనసాగనున్నందున పాస్ లు లేని వారిని ఎట్టిపరిస్థితులలో లోనికి అనుమతించరన్నారు.

ప్రధాని పర్యటన సందర్శంగా ఉత్సవాల్లో భాగంగా…

ఉత్సవాల్లో భాగంగా 40 ఎకరాలు ఇప్పటికే ఏర్పాటు చేసిన 1035 హోమ గుండాల ద్వారా ఐదువేల మంది స్వాములతో శ్రీ లక్ష్మి నారాయణ యాగం జరుగుతోంది. యాగం కోసం రాజస్థాన్ నుంచి పది వేలు కుండలు తెప్పించారు. యాగం కోసం లక్షన్నర కిలోల దేశవాళి ఆవు పాలతో రూపొందించిన నెయ్యిని ద్రవ్యంగా వినియోగిస్తున్నారు. సమతా మూర్తి స్పూర్తి కేంద్రంలో 4 ద్వారాలు ఉన్నాయి. లోనికి ప్రవేశించడానికి నిర్మించిన ఈ నాలుగు ద్వారాలు కాకతీయ నిర్మాణ శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి. 90 అడుగుల ఎత్తుతో 9 నుంచి 6 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. రామానుజుల విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. కాగా, ఈ వేడుకలలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అంతే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.