మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

TSRTC మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ ఉచిత వాహన సౌకర్యం..

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ ఉచిత వాహన సౌకర్యం..
  • ఈ నెల 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన సదుపాయం..
  • గౌలిగూడ ప్రధాన రోడ్డు నుంచి బస్ స్టేషన్ లోనికి ఉచిత వాహన సదుపాయం
  • కాలి నడకన వెళ్లే ప్రయాణికులకు ఉచిత సేవలు 
  • ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు ఏర్పాటు..

ఆర్సీ న్యూస్, జనవరి 23 (హైదరాబాద్): హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎం.జి.బీ.ఎస్) వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత వాహన సదుపాయం ఉంది. గౌలిగూడ ప్రధాన రోడ్లు నుంచి బస్ స్టేషన్ లోనికి కాలి నడకన వెళ్లే ప్రయాణికులకు ఈ ఉచిత సర్వీస్ను అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మహాత్మ గాంధీ బస్ స్టేషన్ కు చేరుకుంటున్న ప్రయాణికులు లగేజీ తో బస్ స్టేషన్ లోని ప్లాట్ ఫారం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ : కాలినడకన వెళ్లే ప్రయాణీకులకు..

  • కాలి నడకన వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టి ఎస్ ఆర్ టి సి ఉచిత బ్యాటరీ సర్వీస్ ను ప్రారంభించింది.
  • గౌలిగూడ  ప్రధాన రోడ్డు నుంచి మూసీ నదిపై నిర్మించిన కాజ్ వే బ్రిడ్జి వద్ద నుంచి ఈ ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటుంది.
  • ఇక్కడ ఉచిత సర్వీస్ అంటూ సైన్ బోర్డు సైతం ఏర్పాటు చేశారు.
  • ఎవరైనా తమ లగేజీతో ఈ ఉచిత సర్వీస్ ను వినియోగించుకోవడానికి వీలు కల్పించారు.
  • ప్రతి రోజు అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు ప్రతి ఐదు-పది నిమిషాలకు ఒక ట్రిప్ ఉంటుంది.
  • ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సర్వీస్ ప్రయాణికులకు సేవలు అందజేస్తుంది.
  • కాలుష్య రహిత వాహనం అయిన ఈ బ్యాటరీ వెహికల్ సర్వీస్ ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ : సజ్జనార్ ఆదేశాల మేరకు..

  • టి ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఒకరోజు మహాత్మ గాంధీ బస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కాలినడకన వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
  • వెంటనే బ్యాటరీ వెహికల్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
  • ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా ఈ ఉచిత సర్వీస్ ను ప్రవేశ పెట్టారు.
  • 12 సీట్ల ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  • రెండు షిఫ్టులలో ఇద్దరు డ్రైవర్లు విధినిర్వహణ కొనసాగిస్తూ ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.
 ఆర్టీసీ ప్రయాణీకుల సౌకర్యార్థం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు నడిచే టీఎస్ ఆర్టీసీ ఉచిత సర్వీసు కోసం..మరిన్ని వివరాలకు ఈ కింది లింక్ ను ఓపెన్ చేయ గలరూ..
 

Full video watch here : https://www.youtube.com/watch?v=ZpB2t61UAwo