ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా వైరస్ బారిన సీఎంలు సైతం..తాజాగా యుపీ సీఎం.

కరోనా వైరస్ బారిన ముఖ్యమంత్రలు సైతం..తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం

ఆర్సీ న్యూస్( లక్నో): దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. సామాన్యుల నుంచి అధికార,అనధికార ప్రముఖులు వైరస్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు వాక్సీనేషన్ జోరుగా కొనసాగుతున్నప్పటికీ..పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. టీకాల పంపిణీ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ..అక్కడక్కడ స్థానిక ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైరస్ బారిన పడి హోం క్వారంటైన్ లోకి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు.

మరో ఆరు వారాలు కష్ట కాలమే…

  •  గత నాలుగు వారాలుగా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండగా..
  • ఈ వేగం మరో ఆరో వారాల పాటు కొనసాగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 
  • దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్స్ లభించని దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. 
  • ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. 
  • మహారాష్ట్రలో ఇప్పటికే బుధవారం రాత్రి 8 గంటల నుంచి మహా జనతా కర్ఫ్యూ మొదలైంది. 

కరోనా వైరస్ బారిన ముఖ్యమంత్రులు సైతం..తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం..

  • కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్లో వైద్య సేవలు పొందుతున్నారు.
  • ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోెగి ఆధిత్యానాథ్ కు పాజిటివ్ వచ్చింది.
  • ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
  • ఆయన కార్యాలయం అధికారులు, సిబ్బందిలో కొందరు వైరస్ బారిన పడడంతో యోగి ఆధిత్యానాథ్ స్యీయ నియంత్రణలోకి వెళ్లారు.
  • బుధవారం సీఎంకు పరీక్షలు నిర్వహించగా..బుధవారం పాజిటివ్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
  • ఉత్తర్ ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
  • సీఎంతో పాటు మంత్రి అశుతోష్ టాండన్ సైతం తాజాగా వైరస్ బారిన పడ్డారు.
  • మాజీ ముఖ్యమంత్రి,సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.
  • ఈ విషయాన్ని ఆయనే బుధవారం స్యయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
  • ఇదిలావుండగా..గతేడాది డిసెంబర్ 11న, మోఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా కరోనా బారిన పడి వైద్య సేవలు పొందారు.
  • మోఘాలయ ముఖ్యమంత్రికి పాజిటివ్ వచ్చిన మరుసటి రోజు అంటే..
  • డిసెంబర్ 12న, ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ లో ఆయన వైద్య సేవలు పొందారు.
  • ఇక ఈనెల 7న, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్ లో వైద్య సేవలు పొందుతున్నారు.
  •  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడిన మరుసటి రోజైన ఈ నెల 8న, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైరస్ పాజిటివ్ వచ్చింది.
  • పినరయ్ విజయన్ అప్పటికే వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. 40 రోెజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉండగా..కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతున్నారు.
  • ఇలా దేశంలో కరోనా వైరస్ కోరలు చాచి విస్థరిస్తోంది.
  • వైరస్ ఎవరిని వదిలి పెట్టడం లేదు. 
  • అందుకే తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.