మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మహారాష్ట్రలో 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ: సీఎం ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్రలో నేటి రాత్రి నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ..సంపూర్ణ లాక్ డౌన్ ఉండదు: ఉద్దవ్ థాక్రే

ఆర్సీ న్యూస్( ముంబాయ్):మహారాష్ట్రలో బుధవారం నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ అమలులోకి వస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే బుధవారం రాత్రి 8 గంటల నుంచి జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అదుపు తప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సంపూర్ణ లాక్ డౌన్ ఉండదన్నారు. ఇప్పటికే రాష్ట్రలో వీకెండ్ లలో రాత్రిపూట కరోనా కర్ప్యూ కొనసాగుతుండగా..ఈ నెల 14 నుంచి జనతా కర్ప్యూ అమలు కాబోతోంది. సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రజలకు ఈ పాక్షిక కర్ప్యూ కొంత ఊరటనిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఆక్సీజన్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉందని…వెంటనే సరఫరా చేయాలని సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని మోదీని కోరారు. 

  • ప్రజలెవరూ అవసరం లేకుండా బయటికి రావద్దన్నారు. 
  • ప్రజా సంక్షేమం కోరి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు కట్టుబడి ఉండాలన్నారు. 
  • అత్యవరంగా  ఏదైనా పని ఉంటేనే ఇళ్ల నుంచి బయటికి రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు లో ఉన్నందున ప్రజలు సహకరించాలన్నారు. 
  • మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ( ఆంక్షలు) ఈ కింది విధంగా ఉన్నాయి.
  • ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల మూసి వేత
  • సినిమా థియేటర్లు,స్విమ్మింగ్ ఫూల్స్,జిమ్స్, ఆట స్థలాల మూసి వేత
  • బీచ్ లు, పార్కులు, గార్డెన్స్, ఓపెన్ ప్టేస్ లు మూసి వేత
  • సినిమా,సీరియల్స్ షూటింగ్ లకు అనుమతి లేదు
  • బార్స్,రెస్టారెంట్స్ మూసి వేత. రెస్తారెంట్స్ ద్వారా హోం డెలివరికి అనుమతి
  • మతపరమైన స్థలాల మూసి వేత
  • హేర్ కటింగ్ సెలూన్ల మూసి వేత
  • పెట్రోల్ పంపులు,మెడికల్ షాప్ లకు అనుమతి
  • అత్యవసర పబ్లిక్ సర్వీస్ లకు అనుమతి
  • అత్యవసర సేవలు అందజేసే పబ్లిక్ వర్కర్స్ కు అనుమతి
  • అత్యవసర సేవలు అందించే వారికిట్రైన్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి
  • వారం రోజుల్లో 24 శాతం పాజిటివ్ కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లో…

  • ఇక ఉత్తర్ ప్రదేశ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. 
  • సాక్షాత్తు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్వీయ నియంత్రణలోకి వెళ్లారు.
  •  సీఎం కార్యాలయంలో పని చేసే సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.