మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Asaduddin Owaisi Attack : అసదుద్దీన్ ఓవైసీ పై దాడి ఘటనలో ఇద్దరి నిందితుల అరెస్టు..

Asaduddin Owaisi Attack : అసదుద్దీన్ ఓవైసీ పై దాడి ఘటనలో ఇద్దరి నిందితుల అరెస్టు..
  • అసదుద్దీన్ దాడి సంఘటన పై వెంటనే స్పందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు..
  • ఇద్దరు నిందితుల అరెస్ట్,రిమాండ్..
  • నిందితులలో ఒకరు బిజెపి కార్యకర్త కాగా..మరొకరు రైతు.
  • తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసంగాలు చేసినందుకే దాడి..
  • ఈ దాడి పూర్తిగా తమ వ్యక్తిగతమన్న నిందితులు
  • తనపై జరిగిన దాడి..దాడి కాదని..ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి: అసదుద్దీన్ 

 ఆర్సీ న్యూస్, ఫిబ్రవరి 04 (లక్నో): హైదరాబాద్ ఎంపీ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్ పై జరిగిన దాడి సంఘటనలో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గురువారం మీరట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి కార్ లో ఢిల్లీకి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ కాల్పుల సంఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిందితులలో ఒకరు సచిన్ పండిత్ కాగా.. మరొకరు శుభం అనే రైతు. సచిన్ పండిత్ గ్రేటర్ నోయిడా నివాసి. సచిన్ పండిత్ బిజెపి సభ్యత్వం పొందినట్లు అతని వద్ద లభించిన సభ్యత్వ నమోదు రసీదు స్పష్టం చేస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఉపముఖ్యమంత్రి తో కలిసి ఫోటోలు దిగిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరో నిందితుడైన శుభం బలరాంపూర్ గ్రామానికి చెందిన సాధారణ రైతు. ఇతనిపై గతంలో హత్యాయత్నం కేసులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. టోల్ ప్లాజా వద్ద జరిగిన దాడి ఘటనలో ఒకరు  కారు చక్రం కింద కాలు నలిగి పోవడం తో గాయాలకు గురయ్యాడు. దాడి జరుగుతున్న సమయంలో అసదుద్దీన్ కారును గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ నడిపిస్తున్నారు. మొదటి బుల్లెట్ సౌండ్ వినిపించగానే మాజీద్ హుస్సేన్ కారును నిందితుడి వైపు వేగంగా మళ్లించడంతో నిందితుని కాలుపై నుంచి కారు టైరు వెళ్లడంతో అతను గాయానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితునీతో పాటు దాడికి వినియోగించిన ఆటోమేటిక్ ఫిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

Asaduddin Owaisi Attack : ఢిల్లీ కి వెళుతుండగా..దాడి: ఏడీజీ ప్రశాంత్ కుమార్

 గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తమ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు.

వైరల్ గా మారిన యూపీ సీఎం తో ఫోటోలు..

నిందితుల్లో ఒకరైన సచిన్‌ పండిట్‌ బీజేపీలో క్రియాశీలక కార్యకార్త. పార్టీ సభ్యత్వానికి సంబంధిన రిసిప్ట్‌ను సచిన్‌ సోషల్‌ మీడియాలో ఉంచారు. అందులో దేశ్‌ భక్త్‌ సచిన్‌ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఎంపీ మహేశ్‌ శర్మలతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Asaduddin Owaisi Attack : రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేసినందుకే దాడి: నిందితులు

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకే దాడికి పాల్పడ్డామని నిందితులు అన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని నిందితులిద్దరూ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. దేశంలోని హిందువులను టార్గెట్ చేసి.. హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఓవైసీ తోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగాలు చేస్తున్నారన్నారు. ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు తమను తీవ్ర మనోవేదనకు గురి చేశాయన్నారు. ఓవైసీపై తనకు కోపం పెరిగిందని.. తానే స్వయంగా దాడికి పాల్పడ్డానని.. ఇందులో ఎక్కడ పార్టీ ప్రమేయం కానీ ఇతర పకడ్బందీ ప్రణాళికలు కానీ లేవని నిందితుల్లో ఒకరైన సచిన్ పండిత్ పోలీసులకు తెలిపారు.

ప్రజాస్వామ్యం పై దాడి: అసదుద్దీన్ ఓవైసీ 

తనపై జరిగిన దాడి.. దాడి కాదని.. ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నన్ను చంపాలని చూసిన నిందితులతో పాటు దీని వెనుక కుట్ర దారులు ఎవరు ఉన్నారు..? ఎందుకు ఈ దాడి చేశారో తేలాల్సిన అవసరముందన్నారు. తనపై జరిగిన దాడి పట్ల దేశంలోని పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తనపై జరిగిన దాడిని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి డ్రామా వ్యాఖ్యానించడాన్ని అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. తన శరీరం లోకి బుల్లెట్ దాడి జరిగినట్లు అని ఆయన ప్రశ్నించాడు. మంత్రికి బుర్ర లేనట్లుంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.