మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కేసీఆర్ గొర్రేలు అన్నాడు..కేసీఆర్ గొర్రే అన లేదు

కేసీఆర్ గొర్రేలు అన్నాడు..కేసీఆర్ గొర్రే అన లేదు
  • సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్బంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాట..
  • అట్టహాసంగా జిల్లా పర్యటన..అడుగడుగున బ్రహ్మరధం పట్టిన ప్రజలు
  • వేల కోట్ల నిధులతో పూర్తి చేసిన పలు అభివృద్దిపనుల ప్రారంభం
  • వచ్చే నెల నుంచి 57 ఏళ్ల పైబడిన వారందరికి ఫించన్లు
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎన్ని వేల కోట్ల కరెంట్ బిల్లైన కడతాం..
  • గ్రామీణ ఆర్దిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కృషి..
  • రైతుల ఇళ్లల్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామం…

ఆర్సీ న్యూస్,జూలై 4 (సిరిసిల్ల): ‘‘కేసీఆర్ గొర్రేలు అన్నాడు..ఇంక కేసీఆర్ గొర్రే అన లేదు..నాకు నవ్వు వచ్చింది..తన పర్యటన సందర్బంగా ఒకప్పుడు రోడ్డపై మొత్తం గొర్రెల గుంపు కనిపించింది..కొంత మంది చిన్నారులను పిలిచి అడిగా..ఏమిటని..వారు వెంటనే సమాధానం ఇస్తూ..కేసీఆర్ గొర్రెలు సార్..అని చెప్పాడు. నిజమే ఒకప్పుడు నిరాధారణకు గురైన యాదవు లందరికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశ్యంతో రూ. 8 వేల కోట్ల రూపాలయల నిధులతో గొర్రేల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం..ఇందులో ఇప్పటికే మొదటి విడతగా రూ. 4 వేల కోట్ల నిధులతో గొర్రేల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. రెండో విడతలో రూ. 4 వేల కోట్లతో గొర్రేల పంపిణీ చేపట్టనున్నాం…’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్బంగా చెప్పారు. మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు,నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులతో కలిసి రాజన్న సిరిసిల్లా జిల్లాలలో సీఎం కేసిఆర్ పర్యటించి కోట్లాది రూపాయల విలువ చేసే పలు అభివృద్దిపనులను ప్రారంభించారు. రూ.80 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 1320 డబుల్ బెడ్ రూం డిగ్నిటీ హౌజింగ్ కాలనీ, 5 ఎకరాల్లో రూ.36 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల,రూ.22   కో్ట్ల  నిధులతో నిర్మించిన మాడర్న్ మార్కెట్ యార్డ్, 82 ఎకరాల్లో రూ. 70 కోట్ల నిధులతో అత్యంత అధునాతనంగా అన్ని సౌకర్యాలతో నిర్మించిన జీ ప్లస్ 3 అంతస్తుల కలెక్టరేట్ భవన సముదాయం..ఇలా పలు అభివృద్దిపనులను ఆయన ప్రారంభించారు. ఆదివారం సీఎం కేసీఆర్ నిర్వహించిన పర్యటనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అక్కడక్కడ దారులకు ఇరువైపుల ప్రజలు నిలుచుని స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదవులను,మత్స్యకారులను వేలాది కోట్ల రూపాలయల నిధులతో పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నామ న్నారు. దళితుల అభివృద్ది కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45 వేల కోట్ల నిధులను వారి సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అంద జేస్తామన్నారు. ఆగస్ట్ నెల నుంచి 57 ఏళ్ల వయస్సు పైబడిన అర్హులైన వారందరికి నెల నెలా      వృద్దాప్య పించన్లు అందజేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో 30 లక్షల కరెంట్ మోటార్లు న్నాయన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా రౌండ్ ది క్లాక్ సేవలు కొనసాగు తున్నాయ న్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకున్నామ న్నారు. మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేశామని.. పాలమూర్ పూర్తయితే మరో 10 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుందన్నారు. 180 కిలో మీటర్ల గోదావరి సజీవంగా మారిందన్నారు. ప్రపంచంలోనే కాలేశ్వరం అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని మన తెలుగు మీడియా గుర్తించనప్పటికీ..ఇంగ్లీష్ మీడియా దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చక్కగా వివరించిందన్నారు. కొంత మంది సన్నాసులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎన్ని వేల కోట్ల రూపాయల కరెంట్ బిల్లు కడతారని..కొంత మంది సన్నాసులు ప్రశ్నిస్తున్నారని..10 వేల కోెట్ల రూపాయల కరెంట్ బిల్లు కట్టడానికి కూడా తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్దిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రైతుల ఇళ్లల్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు. కరీంనగర్ ను జలధారగా మార్చామని..అప్పర్ మానేరు నుంచి గోదావరి వరకు వందలాది చెక్ డ్యాం లు నిర్మిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట స్టేట్ ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్,స్మితా సబర్వాల్ లతో పాటు పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.