మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పెన్షన్ అనేది ఉద్యోగికి మానవ హక్కు

పెన్షన్ అనేది ఉద్యోగికి మానవ హక్కు
  • జీతం..పెన్షన్.. వేర్వేరు కాదు..
  • పెన్షనర్ కు రాజ్యాంగం కల్పించిన మానవ హక్కు.
  • ఉద్యోగులకు రాజకీయ చైతన్యం అవసరం..
  • రాజకీయ చైతన్యంతోనే తమ హక్కుల సాధన సాధ్యం..
  • ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు పెన్షన్..
  • పెన్షనర్ల పట్ల ప్రభుత్వ దృక్పథం మారాలి..
  • TGP JAC నిరసన లో ప్రొఫెసర్ నాగేశ్వర్..

ఆర్సీ న్యూస్, నవంబర్ 26(హైదరాబాద్): తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులకు రాజకీయ చైతన్యం ఎంతో అవసరమని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఉద్యోగులకు రాజకీయ చైతన్యం ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద పెన్షనర్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. సాధ్యమైనంత వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్ నెస్ సెంటర్ ను పటిష్ట పరచాలని.. వెల్ నెస్ సెంటర్ లో స్టాప్ ను పర్మినెంట్ చేయాలని..ఈ హెచ్ ఎస్ స్కీమ్ ను పటిష్ట పరచాలని వెల్ నెస్ సెంటర్లలో వైద్యులను నియమించాలని వారు ఫ్ల కార్డు లను పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించి పెన్షనర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. రాజకీయ చైతన్యం లేకుండా తమ హక్కుల సాధన సాధ్యం కాదన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో కూడా రాజకీయ చైతన్యం ఎంతో అవసరమన్నారు. ప్రజల పోరాటాలతోనే ఆయా సమస్యల పరిష్కారానికి వీళ్లు పడుతుందన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగికి మానవ హక్కు అని ఆయన అన్నారు. పెన్షనర్లకు ఆయా ప్రభుత్వాలు దయతో.. కరుణతో.. జాలితో ఇచ్చేది కాదన్నారు. పెన్షన్ వేరు..జీతం వేరు వేరు కాదన్నారు. జీతం ఇస్తున్నట్లు గానే పెన్షన్ ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వం మర్చిపోవద్దు అన్నారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వాల దృక్పథం మారాలన్నారు. విధి నిర్వహణ చేసినప్పటి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నంతవరకు ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు శక్తివంచన లేకుండా శ్రమిస్తారని.. పదవి విరమణ అనంతరం వారిని నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతం చెల్లించినట్లుగానే పదవీ విరమణ చేసిన అనంతరం కూడా జీతం లాగే పెన్షన్ ను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2018 లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రక రకాల సాంకేతిక కారణాలతో పెన్షన్ రాదు.. ఇతర సదుపాయాలు లేవని అంటున్నారని.. ఇక 2020 తర్వాత సంగతి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వ విధి విధానాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమస్యల సాధన కోసం పోరాటాలు తప్పవన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన మానవ హక్కు అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం నాడు తమ హక్కుల సాధన కోసం పెన్షనర్లు గొంతెత్తడం జరిగిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రభుత్వం కాపాడాలి కానీ.. కాలరాయ వద్దన్నారు.