మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పేదింటి ఆడపడుచులకు మేన మామ..కేసీఆర్

పేదింటి ఆడపడుచులకు మేన మామ..కేసీఆర్

 

  • ఇల్లు కట్టించి పెళ్లి ఖర్చుల కింద లక్ష రూపాయలకు పైగా అందజేత
  • పొట్టి శ్రీరాములు నగర్ లో రూ.14 కోట్ల నిధులతో 162 డబుల్ బెడ్ రూం ఇల్లు
  • బోనాలతో స్వాగతం పలికిన స్థానిక మహిళలు
  • పారదర్శకంగా లబ్దిదారులకు..2బీహెచ్కే ఇళ్ల అందజేత.
  • రూ.35 లక్షలతో నిర్మించనున్న దేవాలయానికి శంకుస్థాపన
  • బన్సీలాల్ పేట్ డివిజన్లో…మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

ఆర్సీ న్యూస్,జూన్ 28 (హైదరాబాద్): పేదింటి ఆడపడుచులకు మేన మామగా  కేసీఆర్ అండగా ఉంటున్నారని.. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద మామ కట్నంగా  డబ్బులను అందజేస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని  పశు సంవర్దక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజక వర్గం..బన్సీలాల్ పేట్ డివిజన్ లోని పొట్టి శ్రీరాములు నగర్ లో పేదల కోసం కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇల్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. రూ.14 కోట్ల నిధులతో 162 డబుల్ బెడ్ రూం డిగ్నిటీ హౌజింగ్ కాలనీని ఆయన సోమవారం ప్రారంభించారు, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,కార్పోరేటర్ హేమలత లతో కలిసి మంత్రి డబుల్ బెడ్ రూం పథకంలో కొత్తగా నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రి తలసాని తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలకు స్థానిక మహిళలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. రూ. 35 లక్షల నిధులతో నిర్మించనున్న దేవాలయాల పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూం పథకం ద్వారా ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేస్తున్నామన్నారు.  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల డబుల్ బెడ్ రూం డిగ్నిటీ హౌజింగ్ కాలనీలను నిర్మించి పేదలకు అంద జేస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన వారు ఇరుకు, ఇరుకు గదుల్లో నిర్మాణాలు చేపట్టి పేదలకు అంటగట్టారన్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా అందజేసిన గత ప్రభుత్వాలకు ధీటుగా తాము డబుల్ బెడ్ రూం లను నిర్మించి ఇస్తున్నామ న్నారు. ముఖ్యంగా సనత్ నగర్ నియోజక వర్గం నుంచే ముందుగా ఈ స్కీం ను ప్రారంభించా మన్నారు. ఇప్పటి వరకు సనత్ నగర్ నియోజక వర్గంలోనే ఎక్కువగా అర్హూలైన పేదలందరికి ఇళ్లు అందజేస్తు న్నామన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం పథకంలో అవకాశం లభించని లబ్డిదారు లకు రాబోయే రోజుల్లో నిర్మించే ఇళ్లలో అవకాశం కల్పిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తున్న పథకం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతోందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలలో డిగ్నిటీ హౌజింగ్ కాలనీలను పేదలకు అందు బాటులోకి తెస్తున్నా మన్నారు. దేశంలో మొదటిసారి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. పేదలు ఇళ్లు కట్టాలన్నా.. ఆడ పిల్ల పెళ్లి చేయాలన్నా..ఎన్నో ఇబ్బందు లను ఎదుర్కొనే వారికి సీఎం కేసీఆర్ మేన మామా లాగా అండగా ఉంటున్నార న్నారు. ఇళ్లు కట్టించి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద రూ. 1,16,000 లను అందజేస్తు పెళ్లి చేయించి ఆడ పడుచుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దూరం చేస్తున్నార న్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం పథకంలో ఎక్కడా అవక తవకలకు ఆష్కారం లేకుండా పారదర్శకంగా పంపిణీ కొనసాగుతుం దన్నారు. అర్హులైన లబ్డిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పరిశుభ్రత, పచ్చదనంపై ప్రజలు ద్రుష్టి సారించాలన్నారు. పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను స్థానికులు తీసుకోవాలన్నారు. నగరంలో చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిసరాల పరిశుబ్రం కోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.