ఏప్రిల్ 17, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బీసీలు కేవలం బర్లు, గొర్లు కే పరిమితమా..?

బీసీలు కేవలం బర్లు, గొర్లు కే పరిమితమా..?
  • కార్పోరేషన్లకు కన్నం..బీసీలకు సున్నం..

  • బీసీల సంక్షేమం కోరుతూ బీసీ భవన్ ముట్టడి

  • రాష్ట్ర ఓబీసీ మోర్చ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో ధర్నా
  • మాసాబ్ ట్యాంక్ లోని బీసీ భవన్ వద్ద నాయకులు,కార్యకర్తల బైటాయింపు
  • అరెస్టు చేసి గోషామహాల్ స్టేడియంకు తరలించిన పోలీసులు.
  • కొలువులు లేవు..స్వయం ఉపాధి లేదు..లోన్లు పెండింగ్


ఆర్సీ న్యూస్,జూలై 19 (హైదరాబాద్): ‘కార్పోరేషన్లకు కన్నం..బీసీలకు సున్నం’ పేరుతో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చ నాయ కులు, కార్యకర్తలు సోమవారం ఉదయం మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర బీసీ వెల్పేర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో బీసీల సంక్షేమం ఏమాత్రం జరగడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగ వ్యవహరిస్తోందని..కుల వ్రుత్తులకు సంబందించిన కార్పొరేషన్లు.. ఫెడరేషన్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని..దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీసీ భవన్ వద్ద ఓబీసీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.బీసీ భవన్ ముట్టడి విషయం ముందే తెలుసుకున్న పోలీసులు బీసీ వెల్పేర్ కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు కొనసాగించారు. మాసబ్ ట్యాంక్ రోడ్డు నుంచి బీసీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో ప్ల కార్డులు పట్టుకుని కేసీఆర్ డౌన్..డౌన్ అంటూ ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలను పట్టించుకుని బీసీల సంక్షేమానికి క్రుషి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ధర్నాలో కూర్చున్న రాష్ట్ర ఓబీసీ మోర్చ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్, రాష్ట్ర ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు నందనం దివాకర్, కార్యదర్శి సంజయ్ తదితరులతో పాటు నాయకులను బందోబస్తులోని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు మరికొద్దిసేపు ధర్నా నిర్వహించారు. గోషామహల్ స్టేడియంకు తరలించిన నాయ కులు,కార్యకర్తలకు పోలీసులు అందజేసిన లంచ్ బోజనం సక్రమంగా లేదని..తినడానికి ఏమాత్రం వీలు లేకుండా బోజనం ఉందని ఆరోపిస్తూ కొంత సేపు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారందరిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆలే భాస్కర్ రాజ్ మాట్లాడుతూ…సరైన కొలువులు లేవు..నిరుద్యోగ భ్రుతి లేదు..స్వయం ఉపాధి లేదు..బీసీలు కేవలం బర్లు,గొర్లు కే పరిమితమా..? అని ఆలే భాస్కర్ రాజ్ ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాల బతుకులు మారతాయని భావించిన వారందరికి నిరాశే మిగిలింద న్నారు. కార్పేరేషన్లను, ఫెడరేషన్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. బీసీల అభివృద్ది అంటూ మంగలి,చాకలి కుల వృత్తుల వారి సంక్షేమం కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు చేసింది కేవలం రూ. 55 కోట్లు మాత్రమేనన్నారు. మోడల్ సెలూన్లు కట్టిస్తామని..సాంకేతిక పరిజ్ఞానంతో దోభీఘాట్ లను ఆధునీకరిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం నెలలు..ఏళ్లు గడుస్తున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2017లో జీఓ 16 ద్వారా ప్రకటించిన ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. సంచార జాతులు, ఎంబీసీల మద్య చిచ్చుపెట్టిం దన్నారు. 2017-21 వరకు కేటాయించిన రూ.2505 కోట్లలో కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల ఆర్ధిక పరిస్థితు లు మరింత దిగజారాయన్నారు. గత ఏడేళ్లలో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ.186 కోట్లు మాత్రమేనన్నారు. బీసీలకు ఇచ్చే రుణాలు సైతం సకాలంలో మంజూరు కావడం లేదన్నారు. ఇప్పటికీ 5.5 లక్షల ధరఖాస్తులు లోన్ కోసం పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కార్పోరేషన్ కు విలువ లేకుండా చేశార న్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చ ఐటీ సెల్ కన్వీనర్ ప్యారసాని వెంకటేష్ తో పాటు నాయకులు పెండెం లక్ష్మన్, మోకాళ్ల వెంకటేష్,ప్రకాష్, పుప్పాల మధుసూదన్ రావు, గౌరీ శంకర్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.