ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాబోయే మొహర్రం సంతాప దినాలకు ఏర్పాట్లు చేయాలి..

రాబోయే మొహర్రం సంతాప దినాలకు ఏర్పాట్లు చేయాలి..
  • హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీతో షియా ముస్లింల సమావేశం
  • అషుర్ ఖానాల అభివ్రుద్దికి నిధులు కేటాయించాలి..
  • గత రెండేళ్లుగా నిధులు మంజూరు చేయడం లేదంటున్న షియా ముస్లింలు
  • మొహర్రం సంతాప దినాల ప్రారంభానికి ముందే అభివౄద్ధిపనులు చేయాలి
  • సానుకూలంగా స్పందించిన మంత్రి మహ్మద్ మహమూద్ అలీ.

ఆర్సీ న్యూస్,జూలై 17 (హైదరాబాద్): మొహర్రం సంతాప దినాల ప్రారంభానికి ముందే తగిన ఏర్పాట్లు చేయాలని షియా ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగరంలోని పాతబస్తీలో ఇప్పటికే షియా ముస్లిం మత పెద్దలు సమావేశాలు నిర్వహించి రాబోయే మొహర్రం సంతాప దినాల ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. పలువురు మత పెద్దలు కూర్చుని 68 రోజుల పాటు నిర్వహించే మొహర్రం సంతాప దినాల సందర్బంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రెండు రోజుల క్రితం పాతబస్తీ కోమటివాడిలోని ఆషుర్ ఖానాలో షియా ముస్లిం మత పెద్దలు సమావేశం నిర్వహించి ఆషుర్ ఖానాలకు మరమ్మత్తులు చేయడంతో పాటు ఆధునీకరణ, రోడ్ల అభివౄద్ధితదితర అంశాలను చర్చించారు. షియా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో వెంటనే సమావేశాలు నిర్వహించి మొహర్రం సంతాప దినాల ప్రారంభానికి ముందే అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మొహర్రం పంతాప దినాలు మొదలవుతాయని..ఇవి 68 రోజుల పాటు కొనసాగుతాయని..57 రోజుల ముందుగానే నిధులను మంజూరు చేసి ఆషుర్ ఖానాల వద్ద అభివౄద్ధి పనులు ప్రారంభించాలని షియా ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందులోె భాగంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ షియా ముస్లిం మత పెద్దలతో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి మర్కజి షియా ఉలేమా హైదరాబాద్, తెలంగాణ షియా వెల్పేర్ డెవలప్మెంట్ కమిటి ప్రతినిధులు హాజరయ్యారు. గత కొంత కాలంగా షియా ముస్లింల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని..సంబందిత అధికారులు వాటిని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదనే విషయాన్నిషియా ముస్లిం మత పెద్దలు మంత్రి మహమూద్ అలీ దౄష్టకి తీసుకు వచ్చారు. వక్ఫ్ బోర్డు అదికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని..ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వక్ఫ్ భూములను కాపాడే దిశలో వక్ప్ భూములపై సర్వే నిర్వహించాలని కోరినప్పటికీ..ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. అలాగే షియా ముస్లింలకు సంబందించినంత వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగు తోందన్నారు. ఇందుకు ప్రధాన కారణం..వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో షియా ముస్లింకు చెందిన ఉద్యోగులు ఎవరూ లేకపోవడమేనని..సాధ్యమైనంత వెంటనే షియా ముస్లిం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పించాలని కోరారు. 2019 నుంచి ఆషుర్ ఖానాల అభివౄద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం లేదని..గతేడాది కోవిడ్19 కారణంగా మొహర్రం సంతాప దినాలపై ఆంక్షలు విధించిందన్నారు. దీంతో మొహర్రం సంతాప దినాలను కోవిడ్-19 ఆంక్షల నడుమ నిర్వహించామన్నారు. గత రెండేళ్టుగా ఆషుర్ ఖానాలకు మరమ్మత్తులతో పాటు ఆధునీకరణ పనులు నిలిచిపోయాయన్నారు. గతంలో లాగా కాకుండా ఈసారి నిధులను మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్వాప్తి తగ్గుముఖం పట్టడంతో మొహర్రం సంతాప దినాలను సామూహికంగా నిర్వహించుకుంటామని…ప్రతి రోజు అన్ని ఆషుర్ ఖానాలలో మాతం, మజ్లిస్ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరు చేసే విధంగా హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ క్రుషి చేయాలని షియా ముస్లిం మత పెద్దలు కోరారు. షియా ముస్లింలు చేసిన సూచనలను మంత్రి నోెట్ చేసుకుని..అవసరమైన మేరకు తగిన చర్యలు తీసుకోవడానికి క్రుషి చేస్తానని మంత్రి మహమూద్ అలీ వారికి హామి ఇచ్చారు. మంత్రితో జరిగిన సమావేశంలో మర్కజి షియా ఉలేమా హైదరాబాద్ అధ్యక్షులు మౌలానా షాజీ ముక్తార్, తెలంగాణ షియా వెల్పేర్ డెవలప్మెంట్ కమిటి అధ్యక్షులు సయ్యద్ ఆబిద్ హుస్సేన్ నక్వీ, ప్రధాన కార్యదర్శి అజ్మత్ జాఫ్రీ తదితరులు పాల్గొని ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.