మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో మరో వారం పొడిగించనున్న లాక్ డౌన్..?

రాష్ట్రంలో మరో వారం పొడిగించనున్న లాక్ డౌన్..?

 

  • లాక్ డౌన్ అమలుతో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు
  • లాక్ డౌన్ కు ముందు 10 వేలు దాటిన కేసులు
  • ప్రస్తుతం మూడు వేలే..నివేదిక అందజేసిన వైద్య,ఆరోగ్య శాఖ
  • మరో వారం పొడిగిస్తే..ఆశించిన ఫలితాలుంటాయని భావన
  • జూన్ 7వ తేదీ వరకు పొడిగించవచ్చుననే ఆలోచన

 

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించనున్నారా..? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో..ఇంకో వారం రోజుల పాటు పొడిగిస్తే..ఆశించిన ఫలితాలుంటాయని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఇప్పటికే లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. లాక్ డౌన్ పొడిగిస్తే..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కంట్రోల్ అవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండో దఫా లాక్ డౌన్ ఈ నెలాఖరు (మే 30) వరకు అమలులో ఉంటుంది. గతంలో లాక్ డౌన్ లేని కారణంగా రాష్ట్రంలో ఒక్క రోజు ఒకేసారి 10 వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. దీంతో కోర్టు జోక్యం చేసుకోవడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమలు చేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మొదటగా మే 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..మే 8వ తేదీ వరకు పొడిగించారు. తిరిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి వచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూతో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదని..దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగు తుండగా..ఇక్కడ ఎందుకు లాక్ డౌన్ అమలు చేయడం లేదని..హైకోర్టు సీరియస్ కావడంతో..వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ ను విధించింది. రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని..4 గంటల సడలింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ అమలులో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పాటు డెత్ రేట్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను..మరో పది రోజుల పాటు అంటే..మే 30వ తేదీ వరకు పొడిగించింది. గత వారం రోజుల తో పోల్చితే పాజిటివిటీ రేట్ గణనీయంగా తగ్గింది. లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి. గత వారం రోజుల తో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ఱయం తీసుకుంది. ప్రస్తుతం సోమవారం (మే 24) సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 3043 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కోవిడ్-19 మీడియా బులెటిన్ లో స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తే..మరింత ఆశించిన ఫలితాలు ఉంటాయని వైద్యాధి కారులు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నెల 28న పరిస్థితులను అంచనా వేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మూడో దఫా లాక్ డౌన్ ను జూన్ 7వ తేదీ వరకు పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.