మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్రంలో రాకపోకల కట్టడి.. పటిష్టంగా లాక్ డౌన్..

రాష్ట్రంలో రాకపోకల కట్టడి.. పటిష్టంగా లాక్ డౌన్..

స్పెషన్ డ్రైవ్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం విధినిర్వాహణ లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద రాకపోకలను కట్టడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహన దారులను తనిఖీ చేశారు. వారి వద్ద అవసరమైన మేరకు అనుమతుతులు, ఈ-పాస్ లు ఉన్నాయా..? లేవా..? అనే విషయాలను ఆరా తీశారు. సరైన అనుమతి పత్రాలు ఉన్న వారిని వదిలేసి..ఎలాంటి పత్రాలు లేని వారికి లాక్ డౌన్ పై అవగాహన కల్పించారు. కేసులు నమోదు చేసి జరిమాన విధించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

డీజీపీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

డీజీపీ ఆదేశాలతో స్పెషన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

  • లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
  • గత వారం రోజులతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టడంతో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ఱయం తీసుకుని… మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు.
  • రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో హైకోర్టు జోక్యంతో ముందుగా ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.
  •  మొదటి దఫా విధించిన లాక్ డౌన్ తో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడంతో లాక్ డౌన్ ను మే 30వ తేదీ వరకు పొడిగించారు.
  •  లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి.
  • లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.
  • ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తే..మరింత ఆశించిన ఫలితాలు వస్తాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా లాక్ డౌన్ ను మే 30వ తేదీ వరకు పొడిగించింది.
  • అయితే లాక్ డౌన్ ఉన్నప్పటికీ..కొంతమంది ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికి..రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయని.. లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి భావించి విధినిర్వహణలో పోలీసు భాస్ లకు ఆదేశాలు జారీ చేశారు.
  • దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు గురువారం రాకపోకలను కట్టడి చేశారు.
  • ముఖ్యంగా నగరంలోని అన్ని జోన్ లకు చెందిన పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

గత రెండు రోజుల్లో…తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు…

  • ఈ నెల 18వ తేదీన అధికారిక లెక్కల ప్రకారం సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 3982 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..రెండు రోజుల అనంతరం అంటే గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 322 పాజిటివ్ కేసులు తగ్గి 3660 గా నమోదయ్యాయి.
  •  ఆరోజు కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతూ 27 మంది చనిపోగా..ఈరోజు అంటే రెండు రోజుల అనంతరం మరణాలు నాలుగు తగ్గి..23 గా నమోదైనట్లు ప్రజా ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.
  • ఇక, గురువారం 5,44,263 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా…ఇందులో 4,95,446 మంది వైద్య సేవలు పొంది కోలుకున్నారు. వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
  • రాష్ట్రంలో 91.03 శాతం, దేశంలో 86.7 శాతం రికవరీ రేటు ఉండని డైరెక్టర్ వెల్లడించారు. అంటే కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 91 శాతానికి పైగా ఉంటున్నారు.
  •  సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా కోలుకుంటున్నారని ఆయన వివరించారు.
  • కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళనలకు గురవుతుండటంతో మరణిస్తున్నారని ఆయన తెలిపారు.
  • నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించుకుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతున్న వారు కరోనా వైరస్ బారి నుంచి తమను తాము కాపాడుకుంటున్నారన్నారు.
  • లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..మే 30వ తేదీ అనంతరం మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు ఉండదని అధికారులు అంటున్నారు.
  • అందుకే వాహనాల రాకపోకలను కట్టడి చేస్తున్నారు.