మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

శాసన సభ సభ్యత్వానికి ఈటెల రాజీనామా ..

శాసన సభ సభ్యత్వానికి ఈటెల రాజీనామా ..

 

  • ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
  • స్సీకర్ ఫార్మేట్లో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ
  • వెంటనే ఆమోదించిన స్సీకర్
  • ఈ నెల 14న బీజేపీలో చేరనున్నఈటెల రాజేందర్.
  • ఆత్మగౌరవంతో పోరాడుతానంటున్నఈటెల
  • తనకు పలువురు ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది: ఈటెల. 

ఆర్సీ న్యూస్, జూన్ 12 (హైదరాబాద్): మాజీ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం తన శాసన  సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం ఆయన తన నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో అనుచరులు,కార్యకర్తలతో కలిసి నగరానికి చేరుకున్నారు. ముందుగా గన్ ఫార్క్ వద్ద అమర వీరులకు జోహార్లు అర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీ భవనంకు చేరుకుని స్సీకర్ కు రాజీనామా లేఖ అందజేయడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు స్సీకర్ అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మేట్ లో రాసి అందజేయడానికి ఎదురు చూసిన ఈటెలకు స్పీకర్ అందుబాటులోకి రాలేదు. కరోనా వైరస్ కారణంగా కలువడానికి వీలు లేకపోవడంతో ఎట్టకేలకు అసెంబ్లీ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. దీనిని అసెంబ్లీ కార్యదర్శి వెంటనే స్పీకర్ కు అందజేశారు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఆయన రాజీనామా లేఖ అందగానే స్సీకర్ ఆమోదించినట్లు సమాచారం. ఈ నెల 14న బీజేపీ నేత జేపీ నడ్డా సమక్షంలో ఈటెల బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నవారు డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. అటువంటి వారికి ప్రజలు బుద్దిచెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు తనకు అండగా ఉన్న హుజూరాబాద్ నియోజక వర్గం ప్రజలు రాబోయే రోజుల్లో తనతో పాటు తన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు.త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలలో  టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా జవాబివ్వనున్నారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనలేరన్నారు. తనకు పలువురు ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్నారు.

రాజకీయ మలుపులు తిరిగిన ఈటెల భూ వివాదాలు…

  • ఈటెల రాజేందర్ భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
  •  అంచెలంచెలుగా ఈటెల భూ కబ్జాలపై విచారణ చేయించింది. 
  • ఇందులో భాగంగా దేవర యంజాల్ లోని సీతారామస్వామి దేవాలయం భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 
  • ఒకవైపు జమునా హ్యాచరీస్ కు సంబందించిన అసైన్డ్ భూముల కబ్జా కొనసాగుతుండగానే..రాష్ట్ర ప్రభుత్వం దేవర యంజాల్ దేవాలయ భూముల ఆక్రమణపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
  •  పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు టీం లీడర్ గా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో దేవర యంజాల్ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 
  • దాదాపు 1521 ఎకరాల దేవాలయ భూమి కబ్జా జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
  • దాదాపు 30 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు భావించారు. 
  • దాదాపు వెయ్యి కోట్ల రూపాలయలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని లెక్కలు తేల్చారు. 
  • అయితే తాను ఎక్కడా భూములను కబ్జా చేయలేదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. 
  • ఈటెల ఎపిసోడ్ ఏప్రిల్ నెల 30వ తేదీన మొదలైంది. 
  • ఈటెల రాజేందర్ భూ భాగోతం..ఈటెల భూ కబ్జా..అంటూ ఏప్రిల్ 30న, తెలుగు ఛానల్స్ లలో ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు రావడంతో సీఎం వెంటనే స్పందించారు. 
  • ఈటెల భూ కబ్జాల విషయాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర ఛీప్ సెక్రటరి సోమేష్ కుమార్ చేత ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 
  •  సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, రెవెన్యూ,పోలీసు అధికారుల బ్రుందాలు రంగంలోకి దిగి మే 1న (శనివారం) ఉదయం నుంచే వివాదస్పదంగా మారిన అచ్చంపేట్ భూములపై విచారణ ప్రారంభించారు.
  • విచారణలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని…మెదక్ జిల్లా కలెక్టర్ తో పాటు భూ కబ్జా జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమికంగా నిర్ధేశించి తమ నివేదికలను సీఎం కేసీఆర్ కు అందజేయడంతో.. వెంటనే స్పందించిన సీఎం మే 1న, ఈటెల రాజేందర్ వైద్య,ఆరోగ్య శాఖ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. 
  •  ఆ వెంటనే విచారణకు సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందడం.. అందులో భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధారణ కావడంతో మే 2న, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం, గవర్నర్ కు సిఫారస్ చేయడం.. గవర్నర్ వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయాయి. 
  • వీటన్నింటిపై మే 3న ఉదయం ఈటెల రాజేందర్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా..దేవర యంజాల్ సీతారామస్వామి దేవాలయ భూముల ఆక్రమణ అంశం వెలుగు చూసింది. 
  • దీంతో ఈటెల భూ కబ్జాల వ్యవహరం ఎపిసోడ్ నాలుగవ రోజుకు చేరింది.
  •  మొదటి రోజైన ఏప్రిల్ 30న..అచ్చంపేటలోని జమున హ్యాచరీస్ అసైన్డ్ ల్యాండ్ భూ వివాదంపై మీడియాలో హల్ చల్..
  • మే 1న, వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఆయనను తొలగించడం..
  • మే 2న, ఆ వెంటనే మళ్లీ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.
  • ఇక మే 3న, కొత్తగా దేవరయంజాల్ దేవాలయం భూమి ఆక్రమణలు తెరపైకి వచ్చాయి. 
  • ఇలా ఈటెల రాజేందర్ భూ వివాదం రాజకీయ మలుపులు తిరిగి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాతో పాటు శనివాంర తన శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసారు.తిరుగుతుందో వేచి చూడాలి.
  • ఈ నెల 14న ఈటెల బీజేపీలో చేరున్నారు.