మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలు కోసం అంతా సిద్ధం..

సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలు కోసం అంతా సిద్ధం..
  • ఈ నెల 28వ తేదీ నుంచి టీకా ప్రారంభం..
  • రాష్ట్రంలో 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలు..
  • గ్రేటర్ లో 3 లక్షల మందికి టీకాలు
  • జీహెచ్ఎంసీలో ఇప్పటికే అన్నిఏర్పాటు..
  • 1వ సర్కిల్ నుంచి 30వ సర్కిల్ వరకు..వాక్సినేషన్ కేంద్రాలు..
  • ప్రతి సెంటర్లో రోజుకి 1000 మందికి టీకాలు..

ఆర్సీ న్యూస్ (హైదరాబాద్): రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్ప్రెడర్స్ కు వాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకాలను ఉచితంగా అందజేయడానికి వాక్సినేషన్ కేంద్రాలను గుర్తించి అంతా సిద్ధం చేశారు.  మొదటి దఫా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.75 లక్షల మందికి టీకా చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని ఇప్పటికే గుర్తించారు. ఇందులో 20,000 మంది జర్నలిస్టులు, 49,616 మంది ఎల్పీజీ గ్యాస్ డెలివరి సిబ్బంది, 33,980 మంది రేషన్ షాప్ డీలర్లు,1,435 మంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) సిబ్బంది, 30,000 మంది వ్యవసాయ సంబంధిత విత్తనాలు,ఎరువులు, మందులు అమ్మే దుకాణాల డీలర్లు,సిబ్బందికి ఈ నెల 28వ తేదీ నుంచి టీకా వేయనున్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వ విభాగాల అధిపతులకు బాధ్యతలను అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ డీలర్స్, పెట్రోల్ పంప్ సిబ్బంది, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ సిబ్బంది, రైతు బజార్లలో వ్యాపారులు, నిత్యావసర వస్తువుల విక్రయ దారులు, షాప్ కీపర్, వైన్ షాప్స్ సిబ్బంది, మటన్,చికెన్ వ్యాపారులు,ఆటో,క్యాబ్ డ్రైవర్లు,చిరువ్యాపారులు సూపర్ స్పైడర్స్ గా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికి ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు..అంటే మూడు రోజుల పాటు ఉచితంగా టీకా వేయనున్నారు.

గ్రేటర్లో ఇప్పటికే అన్నిఏర్పాటు చేసిన అధికారులు… 

  • ఈ మేరకు గ్రేటర్లో 3 లక్షల మందికి టీకాలు వేయడానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలోని సర్కిల్స్ వారీగా టీకా సెంటర్లను ఏర్పాటు చేశారు.
  • గురువారం ఉదయం జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ సంబందిత అధికారులతో కలిసి గౌలిపురాలోని మిత్రా క్లబ్ లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని పరిశీలించారు.
  • ఆటో డ్రైవర్లకు తమ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ తో సంబంధిత ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో రిజిస్టర్ చేసుకుంటున్నారు.
  •  రేషన్ డీలర్స్ కు సంబంధిత సహాయ పౌరసరఫరాల అధికారులు డీలర్ కుటుంబ సభ్యులు,పని చేసే సిబ్బంది సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు.
  • ఐ అండ్ పీఆర్ విభాగంలోని జిల్లా డీపీఆర్ఓ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు,పోలీస్ స్టేషన్ వారీగా పోలీసులకు టీకాలు వేయనున్నారు.
  •  వీరందరికి జీహెచ్ఎంసీ పరిధిలో ఆయా సర్కిల్ లలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • ఈ టీకా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి.
  • ఒక్కో వాక్సినేషన్ సెంటర్ లో 9 గుర్తించిన కేటగిరీల వారికి టీకాలను అందజేయనున్నారు.
  • ప్రతి సెంటర్లో రోజుకి 1000 మందికి టీకాలను వేయనున్నారు.
  • ఇలా ఆయా ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో సూపర్ స్ప్రెడర్స్ పేర్లతో కూడిన లిస్టులను తయారు చేశారు.
  • ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ లో 30 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి పది రోజుల పాటు టీకాలను అందజేయనున్నారు.
  • ఒక్కో సెంటర్ లో పది కౌంటర్లను ఏర్పాటు చేసీ ఒక్కో కౌంటర్లో 100 మంది చొప్పున రోజుకు ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి టీకాలను అందజేస్తారు.
  •  జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మందికి వాక్సిన్ వేయాల్సి ఉంది.
  • అంటే పది రోజుల్లో 3 లక్షల మందికి టీకాలను అందజేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 1వ సర్కిల్ నుంచి 30వ సర్కిల్ వరకు..వాక్సినేషన్ కేంద్రాలు 

  • కాప్రా సర్కిల్ లో : కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాల
  • ఉప్పల్ సర్కిల్ : రామంతాపూర్ ఫంక్షన్ హాల్
  • హయాత్ నగర్: మన్సూరాబాద్ లోని కేబీఆర్ ఫంక్షన్ హాల్
  • ఎల్బీనగర్: వనస్థలిపురంలోని హుడా కమ్యూనిటీ హాల్, చంపాపేట్ లోని మల్టీ ఫర్ఫస్ ఫంక్షన్ హాల్
  • సరూర్ నగర్: దిల్ సుక్ నగర్ రాజధాని థియేటర్ వెనుక నున్న గణేష్ ఫంక్షన్ హాల్
  • మలక్పేట్: అక్బర్ బాగ్ లోని ముంతాజ్ కాలేజీ
  • సంతోష్ నగర్ : గౌలిపుర లోని మిత్రా స్పోర్ట్స్ క్లబ్, రెయిన్ బజార్ లోని ఎస్సార్టీ స్పోర్ట్స్ గ్రౌండ్
  • చాంద్రాయణ గుట్ట:  చాంద్రాయణగుట్ట తాళ్ల కుంట రోడ్డులోని సుహానా ఫంక్షన్ హాల్
  • చార్మినార్: సర్దార్ మహల్ సమీపంలోని సనా గార్డెన్ ఫంక్షన్ హాల్
  • ఫలక్ నుమా: జూ పార్క్ సమీపంలోని తాడ్బన్ వద్ద నున్న కుడా పాలిటెక్నిక్ కాలేజీ
  • రాజేంద్రనగర్: శివరాంపల్లి లోని ఎస్ ఎన్ సీ కన్వెన్షన్ హాల్
  • మెహిదీపట్నం: మెహదీపట్నంలోని ఎంపీ గార్డెన్స్
  • కార్వాన్: టోలిచౌకీలోని ఇంపీరియల్ గార్డెన్
  • గోషామహల్: నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హల్
  • ముషీరాబాద్: ముషీరాబాద్ లోని గవర్నమెంట్  హై స్కూల్
  • అంబర్పేట్: అంబర్ పేట్ ఇండోర్ స్టేడియం
  • ఖైరతాబాద్: సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
  • జూబ్లీహిల్స్: లేక్ వ్యూ బంజారా గార్డెన్ ఫంక్షన్ హాల్
  • యూసుఫ్ గూడ: మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్
  • శేరిలింగంపల్లి: గచ్చిబౌలి స్టేడియం
  • చందానగర్: పీజేఆర్ స్టేడియం
  • పటాన్ చెరువు: చైతన్య నగర్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
  • మూసాపేట్: ఎన్ కే ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్
  • కూకట్ పల్లి: నైనా గార్డెన్స్
  • కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల లోని సరోజినీ గార్డెన్స్
  • గాజుల రామారం: మహారాజా గార్డెన్
  • అల్వాల్: వీబీఆర్ గార్డెన్స్
  • మల్కాజిగిరి: జడ్పీహెచ్ఎస్, మల్కాజిగిరి క్రాస్ రోడ్
  • సికింద్రాబాద్: మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
  • బేగంపేట్: బన్సీలాల్ పేట్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్