నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందకీ ఉచితంగా టీకాల పంపిణీ…

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందకీ ఉచితంగా టీకాల పంపిణీ…

 

  • దీపావళి వరకు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ
  • రెండు నెలల వరకు ఉన్న పంపిణీని నవంబర్ వరకు పొడిగింపు
  • దేశంలో 80 కోట్ల మందికి పైగా పథకం అమలు..
  • ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ
  • రాష్ట్రాలకు ఖర్చు లేకుండా కేంద్రమే వాక్సినేషన్ కొనసాగిస్తుంది.
  • ప్రైవేట్ ఆసుపత్రులలో టీకా కోసం కేవలం రూ.150 మాత్రమే సర్వీస్ చార్జి తీసుకోవాలి.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అలాగే దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు వినిపించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు నవంబర్ వరకు ఉచితంగా సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రెండు నెలల వరకు కొనసాగనున్న ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నవంబర్ నెల వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో మే,జూన్ నెలలకు అర్హులైన పేద ప్రజలందరికి ఉచితంగా బియ్యం పంపిణీ జరుగుతుంది. దీనిని రాబోయే దీపావళి పండుగ వరకు పొడిగిస్తున్నట్లు నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్న వాక్సినేషన్ ను ఇక జూన్ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలను వేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. దేశంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. వాక్సినేషన్ కోసం రాష్ట్రాలు డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు. ఉచిత బియ్యం పంపిణీపై మాట్లాడుతూ..గతేడాది 8 నెలల పాటు పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామన్నారు. ఇక వాక్సినేషన్ గురించి ఆయన మాట్లాడుతూ…ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలను తీసుకునే వారు కేవలం సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే చెల్లించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా కేంద్రమే వ్యాక్సిన్ ఆయా రాష్ట్రాల ద్వారా ఉచితంగా సరఫరా చేయిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే వాక్సినేషన్ సందర్భంగా దేశంలోని ఏ రాష్ట్రం కూడా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశ వ్యాప్తంగా టీకాల పంపిణీని బాధ్యతను కేంద్రమే తీసుకుందన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు టీకాల పంపిణీ ఎంతో అవసరముంద న్నారు. సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని గజగజ వణికిస్తుందన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ గత 100 ఏళ్లలో ఇలాంటి మహమ్మారిని చూడ లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయన్నారు. ఆధునిక ప్రపంచం ఇలాంటి విపత్తును చూడలేదన్నారు.  సెకండ్ వేవ్ కరోనా వైరస్ ను తాము ధీటుగా ఎదుర్కొంటున్నామన్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తూ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మనం కరోనా వైరస్ ను పారదోలగలుగుతున్నామన్నారు. సెకండ్ వేవ్ లో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా అందించడంతో పాటు వెంటిలేటర్లు కూడిన బెడ్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. జల,వాయు,రోడ్డు రవాణాతో పాటు రైల్వేల ద్వారా ఆక్సీజన్ ను తరలించి రోగులకు అందుబాటులో ఉంచామన్నారు. కరోెనా వైరస్ బారిన పడి చావుబతుకుల్లో ఉన్న రోగులను కాపాడడానికి వైద్య సిబ్బంది ఎంతో కష్టం పడుతున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో రికవరి రేట్ 93.94 శాతం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 1,00,636 కోవిడ్19 కేసులున్నాయన్నారు. గత 61 రోజులలో ఇది చాలా తక్కువగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య. కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,427 గా ఉందని..దీంతో ఇప్పటి వరకు 3,49,186 కు చేరుకుందన్నారు. ఇది గత 45 రోజులలో అతి తక్కువగా నమోదయ్యుందన్నారు. రోజు వారి పాజిటివ్ రేట్ 6.21 గా ఉందని..వీక్లి పాజిటివ్ రేట్ 6.21 గా ఉందన్నారు. కరోనా వైరస్ నుంచి 2,71,59,180 మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని..అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగటిపూట లాక్ డౌన్ ను తొలగిస్తున్నాయన్నారు. పగటిపూట లాక్ డౌన్ తొలగిస్తున్నారంటే…కరోనా వైరస్ పూర్తిగా లేదన్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. మాస్కలు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలన్నీ లాక్ డౌన్ తొలగించినప్పటికీ తీసుకోవాలన్నారు.