నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో మొదలైన బోనాల జాతర ఉత్సవాల సందడి..

నగరంలో మొదలైన బోనాల జాతర ఉత్సవాల సందడి..
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన నిర్వాహకులు
  • గతేడాది కరోనా వైరస్ వ్యాప్తితో నిరాడంబరంగా బోనాల జాతర ఉత్సవాలు
  • ఈసారి ఘనంగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకుల సన్నాహాలు
  • తగిన ఏర్పాట్లు చేయాలంటున్న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి
  • తమ వినతి పత్రం మేరకు సానుకూలంగా స్పందించిన తలసాని: బల్వంత్ యాదవ్

ఆర్సీ న్యూస్,జూన్ 16 (హైదరాబాద్): నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవా సందడి మొదలైంది. ఇందులో భాగంగా బుధవారం భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసానిని కోరినట్లు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, ఉపాధ్యక్షులు వేణు గోపాల్, కె.ఎస్.ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్ తదితరులు తెలిపారు. తమ వినతి మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

గతేడాది నిరాడంబరంగా బోనాలు…

  • గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి.
  • భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు.
  • అయితే ఆషాడ మాసం మొత్తం నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలు జరిగాయి.
  • భక్తులు తమ తమ ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించినప్పటికీ..దేవాలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాలలో అమ్మవారికి బోనం సమర్పించారు.
  •  వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల సమర్పణ రోజు భక్తులెవరూ అమ్మవారి దేవాలయాలకు వెళ్ల లేదు.
  • బోనాల సమర్పణ అనంతరం మరుసటి రోజు నిర్వహించే సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు సైతం భక్తుల రద్దీ లేకుండానే ముగిసింది.
  •  పరిమిత సంఖ్యలో ఆయా దేవాలయాలకు చెందిన భక్తులు అమ్మవారి ఘటం వెంట నడిచారు.
గతేడాది నిరాడంబరంగా బోనాలు...
గతేడాది నిరాడంబరంగా బోనాలు…

ఈసారి ఘనంగా నిర్వహించడానికి సిద్దమవుతున్న నిర్వాహకులు..

  • ఈసారి మాత్రం బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు సిద్దం చేసుకుంటున్నరు.
  • ఇందులో భాగంగా ప్రాచీన దేవాలయాలకు చెందిన భక్తులు నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
  •  కొత్తగా ఏర్పాటవుతున్న కమిటీ ప్రతినిధులు ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
  • రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో..ఇప్పటి వరకు దేవాలయాలలో భక్తుల పూజల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ లేదు.
  • గతంలో ప్రకటించిన ఆంక్షలే ప్రస్తుతం అమలులో ఉన్నాయి.
  • ఈ నెల 19వ తేదీ అనంతరం కొత్త నిబంధనలు వస్తే..అవి బోనాల జాతర ఉత్సవాలకు అనుకూలంగా ఉంటాయనే ఆశలో భక్తులున్నారు.
  • దీంతో ఈసారి ఆషాడ మాసం  బోనాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో ఈసారి జరిగే ఆషాడ మాసం బోనాల జాతర వివరాలు..

  • నగరంలో జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
  • జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ
  • అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుంది
  • శాలిబండలోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.
  • ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది.
  • ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుంది.
  • ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది.
  • కరోనా వైరస్ వ్యాప్తికి ముందు..అంటే 2020కు ముందు.. పాతబస్తీలో నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపుకు ఎంతో ఆధరణ ఉంది.
  • పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపును తిలకించడానికి భక్తులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండడంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు.
  • కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో 2021లో జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కోరినట్లు భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్  తెలిపారు.