నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

లాక్ డౌన్ తో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు …

లాక్ డౌన్ తో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు…

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోొనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. మొదటగా 12 నుంచి 22 వరకు లాక్ డౌన్ ను అమలు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను రెండో దఫా 30వ తేదీ వరకు పొడిగించింది. లాక్ డౌన్ అమలు కారణంగా సత్పలితాలు వస్తుండడంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంబందిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితులలో ఈ-పాస్ తో పాటు అనుమతి పత్రాలు ఉన్నవారు, మినహాయింపు ఉన్న వారు తప్సా..రోడ్లపై ఎవరూ ఉండకండా చూడాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు జరుగుతోంది.

  • లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
  •  ఆదివారం  సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 2242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..4693 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారని..వీరందరి ఆరోగ్యం మెరుగైందని  రాష్ట్ర ప్రజా ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ  డైరెక్టర్ తెలిపారు.
  •  ఈరోజు కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొందుతూ 19 మంది చనిపోయారని తెలిపారు. ఈ రోజు వరకు 5,53,277 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా…ఇందులో 5,09,663 మంది వైద్య సేవలు పొంది కోలుకున్నారు.
  •  వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
  • తెలంగాణలో 0.56 శాతం, దేశంలో 1.1 శాతం డెత్ రేట్ ఉండగా..రాష్ట్రంలో 92.11శాతం, దేశంలో 88.3 శాతం రికవరీ రేటు ఉండని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
  •  అంటే కరోనా వైరస్ బారిన పడి వైద్య సేవలు పొంది రికవరి అవుతున్న వారు 90 శాతానికి పైగా ఉంటున్నారు.
  •  సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా కోలుకుంటున్నారు.
  • రాష్ట్రంలో 40,489 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నట్లు వెల్లడించారు.
  • కాగా, ఈ రోజు 42,526 టెస్టులు నిర్వహించగా..ఇందులో ప్రైమరీ కాంటాక్ట్ టెస్టులు 49.9 శాతం ఉండగా..సెకండరీ కాంటాక్ట్ టెస్టులు 12.2 శాతం ఉన్నాయి.
  •  కరోనా వైరస్ లక్షణాలు బయట పడిన వెంటనే అప్రమత్తమై టెస్టులు చేయించుకుంటున్న వారికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హోం ఐసోలేషన్ లో కొంత మంది ఉండటం..మరికొంత మంది కుటుంబానికి దూరంగా ఆస్పత్రిలో చేరి వైద్య సేవలు పొందుతుండడంతో వీరి నుంచి ఇతరులకు( సెకండరీ కాంటాక్ట్) చాలా తక్కువగా అంటే.. 12.2 శాతం మాత్రమే వైరస్ సోకిందని తెలుస్తోంది.
  • మొత్తం 42,526 టెస్టులలో 31,479 టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించగా..31,479 టెస్టులను ప్రైవేటు ఆసుపత్రులలో నిర్వహించారు.
  •  5,53,277 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా..ఇందులో 79.9 శాతం మందికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు.
  • ఇక 20.1 శాతం మందికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలున్నాయి.
  • రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ఇంటింటికి తిరిగి నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే సత్పలితాలను ఇస్తోందని వైధ్యాధికారులు చెబుతున్నారు.
  •  ఇంటింటి ఫీవర్ సర్వేలో ఎక్కడైనా..,ఎవరైనా జ్వరం తో బాధపడుతున్నట్లు తెలిస్తే..వెంటనే వారి సమాచారాన్ని రికార్డు చేసుకుని వారికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేస్తున్నామని..అందుకే వారు వైరస్ బారిన పడకుండానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
  •  జ్వరంతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు అమలులో ఉండనుంది.
  • గత రెండు వారాలతో పోల్చితే పాజిటివిటీ రేట్ గణనీయంగా తగ్గింది.
  • లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి.
  •  ప్రస్తుతం మూడు వేల (2242) లోపు వచ్చాయి అనే విషయాన్ని వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
  • లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.