నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉచిత మంచినీటి పథకం కోసం..ఏప్రిల్ నెలాఖరు లోగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.

ఉచిత మంచినీటి పథకం కోసం..ఏప్రిల్ నెలాఖరు లోగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.

ఆర్రీ న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. కుళాయిల ద్వారా మంచినీరు పొందే వినియోగదారులు ఇక నుంచి నెలనెలా నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మంచినీటి కనెక్షన్ క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. క్యాన్ నెంబర్ను అనుసంధానం చేసుకోకపోతే ఉచిత మంచినీటి పథకానికి అర్హులు కారు. వెంటనే ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. ఉచిత మంచినీటి పథకాన్నిరాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనవరి 12న,ప్రకటించిన విషయం తెలిసిందే.

మంత్రి ప్రకటన వెలువడిన నెల నుంచి జలమండలి అధికారులు గత మూడు నెలలుగా ఎలాంటి నీటి బిల్లులు వసూలు చేయడం లేదు. ముందుగా మార్చి నెలాఖరు వరకు చివరి గడువుగా జలమండలి ప్రకటించింది. అయితే గడువు ముగిసే లోపు ఆశించిన స్థాయిలో వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోవడంతో గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో ఉతిత మంచినీటి పథకం వినియోగంపై బస్తీలతో పాటు కాలనీలలో అవగాహాన కల్పిస్తున్నారు. ప్రతి నెలా 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్నిపొందాలంటే తప్పనిసరిగా క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సంబంధింత జలమండలి అధికారులు సూచిస్తున్నారు. ఈనెలాఖరు   ( ఏప్రిల్‌-2021) లోగా రిజిస్ట్రేషన్ చేయుంచుకోని వారు గత జనవరి నెల నుంచి బకాయి నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWSSB) పరిధిలో 2.5 లక్షల మీటర్లున్న మంచినీటి కనెక్షన్లు, 2 లక్షల మీటర్లు లేని కనెక్షన్లున్నాయి. వీరంతా కాన్ నెంబర్లతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుంటే ఉచిత మంచినీటి సరఫరా పథకానికి అర్హులుగా ఉంటారు. లేదా నెలనెలా నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే నీటి మీటర్లున్నవారు వెంటనే ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. మీటర్లు లేని వారు జలమండలి అధికారులకు తెలియజేస్తే..నిర్దేశించిన రుసుం చెల్లిస్తే..మీటర్లు బిగించి అనుసంధానం చేస్తారు.ప్రస్తుతం జలమండలి సిబ్బంది మురికివాడల్లో(న్లమ్స్) ఇంటింటికి వెళ్లి ఉచితంగా ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా తమ క్యాన్ నెంబర్ను రిజిష్టర్ చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉచిత మంచినీటి పథకాన్నిగ్రేటర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జలమండలి కోరుతోంది.