నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ధూం..ధాం..గా గోల్కొండ అమ్మవారి బోనం తో ఉత్సవాలు ప్రారంభం..

ధూం..ధాం..గా గోల్కొండ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం..
  • భక్తి శ్రద్దలతో మొదలైన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనాల సమర్పణ
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రులు తలసాని,ఇంద్రకరణ్ రెడ్డి 
  • పాతబస్తీ నుంచి ధూం..ధాం..గా బంగారు బోనంతో ఊరేగింపు
  • ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బంగారు పాత్రలో బోనం..
  • భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు..

ఆర్సీ న్యూస్,జూలై 11 (హైదరాబాద్): గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ధూం..ధాం గా ప్రారంభమయ్యాయి. ఆదివారం అమ్మవారికి భక్తులు సమర్పించిన బోనాలతో నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాల సందడి మొదలయ్యింది. ఈ నెల 11న,గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించిన  మొదటి బోనంతో ఈసారి నగరంలో ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులకు ఎక్కడ ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగ లేదు. ఉత్సవాలలో భాగంగా లంగర్ హౌజ్ నుంచి గోల్కండ కోటకు భారీ తొట్టెలతో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. లంగర్ హౌజ్ వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు గోల్కొండ జగదాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు.  మంత్రులు అందజేసిన పట్టు వస్తాలను అమ్మవారి పల్లకి మీద ఉంచి జగదాంబ అమ్మవారికి పంపించారు. 

పాతబస్తీ నుంచి బంగారు బోనం,పట్టు వస్త్రాలు…

అలాగే పాతబస్తీ నుంచి భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కె.ఎస్.ఆనంద్ రావు, ఆకుల వేణుగోపాల్, మధుసూదన్ యాదవ్, గాజుల అంజయ్య, మధుసూదన్ గౌడ్, రాజు యాదవ్, ప్యారసాని వెంకటేష్, గాజుల రాహుల్ తదితరుల బ్రుందం గోల్కొండ జగదాంబ దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలతో భయలు దేరి వెళ్లారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరారు. దారి పొడవునా పోతరాజుల న్రుత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వాహనాలలో లంగర్ హౌజ్ చేరుకున్నారు. అక్కడ మంత్రుల పూజల అనంతరం ర్యాలీగా గోల్కొండ కోటకు చేరుకుని జగదాంబ అమ్మవారికి నేవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. గోల్కొండ అమ్మవారికి వారంలో రెండు రోజుల చొప్పున 9 పర్యాయాలు నెల రోజుల పాటు భక్రులు బోనాలు సమర్పిస్తారు.ఈ సందర్బంగా లంగర్ హౌజ్ వద్ద మంత్రి తలసాని మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బోనాల పండుగ సందర్బంగా గుళ్లకు నిధులను అందజేస్తున్నామన్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూ. 10 లక్షలు అందజేశామన్నారు. అమ్మవారి దేవాలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి కేటగిరిల వారిగా నిధులు అందజేస్తున్నామన్నారు.

25న,సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ..

నగరంలో ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన  మొదటి బోనం అనంతరం ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు జరుగనుంది. శాలిబండలోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది. అనంతరం ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.