డిసెంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బక్రీద్ పండుగకు సర్వం సిద్దం…కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు.

బక్రీద్ పండుగకు సర్వం సిద్దం…కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు.
  • రేపటి బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
  • ఈద్గాల వద్ద ట్రాఫిక్ ఆంక్షల అమలు
  • ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాల దారి మళ్లింపు 
  • కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు

ఆర్సీ న్యూస్,జూలై 20 (హైదరాబాద్): నగరంలో బక్రీద్ సందడి నెలకొంది. ఈ నెల 21న ముస్లీంలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకోనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం అసవరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. పండుగ సందర్బంగా అల్లాహ్ కు ఖుర్బానీ ఇవ్వడం కోసం ముస్లిం ప్రజలు మేకలు,పోట్లెళ్లను ఖరీదు చేయడంలో పూర్తిగా నిమగ్న మయ్యారు. గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బక్రీద్ పండుగను జరుపుకున్నప్పటికీ… ఈద్గాలలో సామూహిక ప్రార్దనలకు ప్రభుత్వం అనుమతించ లేదు. దీంతో ముస్లీంలు సామూహిక ప్రార్ధనలను తమ తమ ఇళ్లల్లోనే జరుపుకున్నారు. ఐతే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మసీదులతో పాటు ఫవిత్రంగా బావించే ఈద్గాలలో కూడా సామూ హిక ప్రార్ధనలకు అనుమతించడంతో సంబందిత అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. బక్రీద్ సందర్బంగా ఈద్గాలలో నిర్వహించే సామూహిక ప్రార్ధనలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబందిత ఉన్నతాధికారులను ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వక్ప్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం ఈ నెల 17న, ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి పాతబస్తీ మీరాలం ఈద్గా వద్ద సమీక్షా సమావేశం నిర్వహిం చారు. బక్రీదు పండుగకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, రెవెన్యూ, టీఎస్ఎస్పీడీసీఎల్, అగ్నిమాపక విభాగం తదితర విభాగాలకు చెందన అధికారులు పాల్గొన్నారు. పండుగ సందర్బంగా ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించడానికి వచ్చే ముస్లింలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చైర్మన్ ఆదేశాల మేరకు సంబందిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్దరించడానికి మోబైల్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు మాదన్నపేట్ ఈద్గాలలో అందుబాటులో ఉంచారు. 

కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు..

నగరంలో బుధవారం ఉదయం జరిగే బక్రీద్ సామూహిక ప్రార్ధనల సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన దక్షిణ మండలం ట్రాఫిక్ ఏపీపీ రాములు నాయక్ తో పాటు స్థానిక పోలీసు స్టేషన్ లకు చెందిన ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ లతో కలిసి పాతబస్తీలో పర్యటించారు. మీరాలం ఈద్గాతో పాటు మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించిన ఆయన వాహనాల దారి మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. సామూహిక ప్రార్ధనలు కొనసాగినంత సేపు ఆయా దారుల్లో వాహనాలను దారి మళ్లించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు. విధినిర్వాహణలోని తమ సిబ్బందితో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్తలు అవసరం…

కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సంబందిత అధికారులు కోరుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే..పరిస్థితులు అదుపు తప్పుతాయంటున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామూహిక ప్రార్ధనల సందర్బంగా రెండు మీటర్ల దూరం పాటించాలంటున్నారు. సామూహిక ప్రార్ధనలకు హాజరయ్యే  ముస్లీంలు ఇళ్లల్లో వజూ చేసుకుని వస్తే భావుంటుందంటున్నారు. మాస్క్ లు ధరించి జానిమాజ్ లను వెంట తెచ్చుకుని భౌతిక దూరం పాటించాలంటున్నారు. తమంతట తాము కరోనా నుంచి కాపాడు కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం లాక్ డౌన్ మాత్రమే తొలగిందని..కరోనా వైరస్ ఎక్కడికి పోలేదని..అందరూ అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం అన్నారు. ఈద్గాలలో ఖాళీ ప్రదేశం చాలా ఉంటుందని సామూహిక ప్రార్ధనలకు ఎలాంటి ఆటంకాలుండవని అధికారులు చెబుతున్నారు. అయితే సామూహిక ప్రార్ధనలకు హాజరయ్యే ముస్లింలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలంటున్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే..రాబోయే రోజుల్లో మనమంతా కరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయంటున్నారు..