నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లతో 2BHK నిర్మాణాలు…

రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లతో 2BHK నిర్మాణాలు...
  • 2BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
  • చంచల్ గూడ పిల్లి గుడిసెలులో 1.5 ఎకరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం..
  • రూ.24.91 కోట్ల వ్యయంతో 2BHK నిర్మాణం
  • రెండు బ్లాక్ లలో 9 అంతస్థుల నిర్మాణం
  • రూ. 8.65 లక్షల వ్యయంతో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం
  •  గ్రేటర్ లో ఇంకా సిద్దంగా 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

 

ఆర్పీ న్యూస్, ఆగస్టు 28 (హైదరాబాద్): రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామని..వీటన్నింటిని అర్హులైన పేద ప్రజలకు అందిస్తున్నామని  మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పిల్లి గుడిసెలు ఇళ్లలో నివాసమున్న పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం ఫ్రారంభించారు. ముందుగా ఇళ్లను సందర్శించిన ఆయన ఐదారు ఇళ్లలో పూజలు నిర్వహించారు. ఇళ్లను పరిశీలించారు. అర్హులైన లబ్దిదారులకు లాటరీ పద్దతి ద్వారా ఇళ్లను అందజేశారు. 

  • మలక్ పేట నియోజకవర్గం లోని ఛావునీ  మున్సిపల్ డివిజన్ లో శనివారం పిల్లి గుడిసెలు బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ..గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దంగా  ఉన్నాయన్నారు. 
  • బహిరంగ మార్కెట్ లో ఇక్కడి ఒక్కో ఇళ్లు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల విలువ ఉంటుందన్నారు. 
  • లక్షలు ఖరీదు చేసే ఈ ఇళ్లను పేదలకు ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం కేవలం తమదేనన్నారు. 
  • నిజాం కాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న పిల్లి గుడిసెలు పేద ప్రజలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందాయన్నారు. 
  • చంచల్ గూడా చౌరస్తా వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తారక రామారావుతో పాటు హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మలక్పేట్ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు అమీన్ జాఫ్రీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఇళ్లు అందజేశారు. 
  •  రూ. 24.91 కోట్ల వ్యయంతో తొమ్మిది అంతస్తులలో జిహెచ్ఎంసి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. 
  • దాదాపు ఒకటిన్నర ఎకరం స్థలంలో  నిర్మాణం పనులు జరిగాయి. 
  • రెండు బ్లాక్ లో తొమ్మిది అంతస్తులు నిర్మించారు. 
  • ఈ తొమ్మిది అంతస్తుల వరకు లబ్ధిదారులు వెళ్లేందుకు లిస్టులను ఏర్పాటు చేశారు. 
  • అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బ్లాక్ లో 19 కమర్షియల్ షాపులను ఏర్పాటు చేశారు. 
  • షాపులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బుతో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నిర్వహణ పనులు, నెల వారి ఖర్చులు వినియోగించనున్నారు. 
  • నిజాం కాలం నుంచి తరతరాలుగా పిల్లి గుడిసెలు బస్తీలో పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం లో తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్నికోరడంతో.. వెంటనే అంగీకరించిన ప్రభుత్వం 26-08-2016 న, నిర్మాణ పనుల కోసం నిధులను మంజూరు చేసింది. 
  • నిధులు మంజూరు అయిన వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిల్లి గుడిసెలు టుబిహెచ్కె శంకుస్థాపన పనులను ప్రారంభించారు.
  •  దాదాపు ఐదేళ్లపాటు గృహ నిర్మాణ పనులు కొనసాగి ఎట్టకేలకు పూర్తయ్యాయి. 
  • 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణం జరిగింది. 
  • ఇందుకోసం రూ. 7.90 లక్షలు నిర్మాణం పనుల కోసం వెచ్చించగా..రూ.0.75 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వినియోగించారు. 
  • మొత్తం రూ.8.65 లక్షలు వెచ్చించి ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మించారు. 
  • ఇప్పటికే మంచినీటి సౌకర్యం కోసం 100 KL సంపును నిర్మించారు.
  •  సి సి రోడ్డు తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. 
  • అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడి డబుల్ బెడ్ రూమ్ లను పూర్తి చేసిన ప్రభుత్వం శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులకు అందజేశారు. 
  • జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగినప్పటికీ.. ఎట్టకేలకు పేద ప్రజలకు అందుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
  • హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం తో పాటు మురికివాడలు లేని నగరంగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందజేసింది. 
  • ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం లోని పిల్లి గుడిసెల బస్తీలో టుబిహెచ్కె డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నిర్మించింది.