- పురాతన కట్టడాలు,మ్యూజియంల సందర్శన ప్రారంభం..
- లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో…మొదలైన సందర్శన
- నేటి నుంచి సందర్శనకు అందుబాటులోకి రావడంతో కిటకిటాడిన పర్యాటక ప్రాంతాలు
- చార్మినార్,గోల్కోండ,సాలార్జంగ్ మ్యూజియం, రామప్ప, ఆలంపూర్ పురాతన కట్టడాల సందర్శన షురూ..
ఆర్సీ న్యూస్,జూన్ 20 (హైదరాబాద్): పురాతన కట్టడాలు,మ్యూజియంలను ఆదివారం తెరవడంతో ఆయా పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారాయి.ఇవన్నీ వాస్తవానికి ఈ నెల 16 నుంచి సందర్శనకు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ..రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో సందర్శనకు వీలు పడ లేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఆదేశాల ప్రకారం ఈ నెల 16 నుంచి సందర్శన అందుబాటులోకి రావాల్సి ఉంది. దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలోని పురాతన కట్టడాలు,మ్యూజియంలను మూసి ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సందర్శన నిలిచి పోయింది. కరోనా వైరస్ తో పాటు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎస్ఐ ఆంక్షలు ఈ నెల 15 వ తేదీ వరకు కొనసాగాయి. ఈ నెల 15 వ తేదీతో గతంలో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, మ్యూజియంల సందర్శన తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతుండడంతో..పురాతన కట్టడాలు,మ్యూజియంలను అప్పటి వరకు మూసి ఉంచాల్సి వచ్చింది.
ఏఎస్ఐ ఆదేశాలున్నా..రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరగడంతో…
- ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ..ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శన అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది.
- ఈ ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి పర్యాటకులను అనుమతించాల్సి ఉంది.
- రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండడంతో సందర్శనకు వీలు పడ లేదు.
- దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ప్రాభావంతో్ పురాతన కట్టడాలు, మ్యూజియంలను ఈ నెల 15 వరకు పొడిగించినట్లు గతంలో ప్రకటించారు.
- ఇప్పటికే ఏఎస్ఐ పరిధిలోని అన్ని పురాతన కట్టడాలు, మ్యూజియంలను మొదటి దఫా కింద ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆంక్షలు విధించింది.
- .మళ్లీ మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది.
- దీంతో 31వ తేదీతో రెండో దఫా ఆంక్షల గడువు ముగియడంతో తిరిగి మరో 15 రోజుల పాటు వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో జూన్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగాయి.
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట లాక్ డౌన్ ను ఎత్తివేసినప్పటకీ..19 వరకు రాత్రిపూట లాక్ డౌన్ కొనసాగుతుండడంతో… ఏఎస్ఐ ఆధీనంలోని కట్టడాలు,మ్యూజియంల సందర్శన కూడా నిలిచిపోయింది.
- ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని గోల్కొండ,చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం లతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ టెంపుల్, వరంగల్ లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోట తదితర పర్యాటక ప్రాంతాలన్నింటినీ జూన్ 15 వరకు మూసి వేశారు.
ఏప్రిల్ 16 నుంచి బంద్…ఇప్పటి వరకు బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు..నేడు కళకళ.
- ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదటి దఫా వచ్చిన ఆదేశాల ప్రకారం నగరంలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటను మూసి వేశారు.
- సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు.
- జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు గతంలో కన్నాగణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ..రాత్రిపూట లాక్ డౌన్ కొనసాగడంతో పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేయడం బెటర్ అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
- ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో నగరంలోని చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడంతో పాటు సాలార్జంగ్ మ్యూజియం,గోల్కొండ కట్టడాలు పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి వచ్చాయి.
- దీంతో వీకెండైన ఆదివారం పాతబస్తీలోని చార్మినార్ – మక్కా మసీదు పరిసర ప్రాంతాలన్నీ సందర్శకులతో సందడిగా మారాయి.
- ఇప్పటి వరకు పర్యాటకుల రాకపై ఆధారపడిన చిరువ్యాపారాలన్నీ ఆదివారం పుంజుకున్నాయి.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..