నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా ఫోన్ చేసి చెప్పిందా : సీఎం కేసీఆర్

కరోనా ఫోన్ చేసి చెప్పిందా..ఎందుకు ఇదంతా ప్రచారం చేస్తుండ్రూ…

 

  • ఒకడు  బ్లాక్ ఫంగస్ అనే..ఇంకోడు ఎల్లో ఫంగస్ అని పెట్టే..ఇంకోడు వైట్ ఫంగస్ అనే..ఫంగస్ పాడు గాను..
  • జనాలను ఎందుకు భయపెడుతుండ్రూ..ఏమోస్తది మీడియాకు
  • మానసిక స్థైర్యం కల్పించాలి తప్పా..భయపెట్టొద్దు
  • ధర్డ్ వేవ్..చిన్నపిల్లలంటూ రాద్దాంతం చేస్తుండ్రూ..మంచిది కాదు
  • మీడియా మిత్రులు భాధ్యతగా ఉండండి
  • వరంగల్ సభలో ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ 

ఆర్సీ న్యూస్, జూన్ 22 ( హైదరాబాద్): ‘‘ఈ మద్య పుట్టిచ్చేది..పేపరోడా..టీవీ ఓడా..ఎవడు పుట్టిస్తుండో గానీ..ఒకడు  బ్లాక్ ఫంగస్ అనే..ఇంకోడు ఎల్లో ఫంగస్ అని పెట్టే..ఇంకోడు వైట్ ఫంగస్ అనే..ఫంగస్ పాడు గాను.. చెప్పి చావకూడదా..ఫంగస్ ఉన్నదో..చచ్చిందో గానీ..చదివి విని జనం సత్తాఉండ్రూ..అంతే కదా..టీవీ ఓళ్లకు పాపమైతే గ్యారంటీ తగుల్తది..నేను చెప్తున్న.. వాళ్లు నన్ను తిట్టినా మంచిదే..ఏమన్నామంచిదే గానీ..’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నిన్న వరంగల్ జిల్లాలో అభివ్రుద్ది కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి చెప్పిన తీరుకు ప్రజలు ఫిదా అవుతు న్నారు. చెప్పేన మాటలు రాష్ట్ర  ప్రజలను మంత్రముగ్దులను చేస్తోంది. ముఖ్యమంత్రి ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం చేసిన ప్రసంగం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాండమిక్ సిట్యూవేషన్ ను తీసుకుని ప్రజలను భయపెట్ట వద్దని అంటున్నారు. పరిస్థితులు భయం కరంగా మారినప్పటికీ..రోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ కుండా భరోసా కలిపించే విధంగా వార్తా కథనాలుండాలంటున్నారు. ఎప్పుడో..ఎక్కడో ఏదో జరుగుతుందని..ఇప్పటికిప్పడు మనకు ఇబ్బందులు కలుగుతాయని భయపెట్టడం సరైంది కాదంటున్నారు. 

థర్డ్ వేవ్..చిన్నపిల్లలకు పొంచి ఉన్న ముప్పు..అంటూ

  • థర్డ్ వేవ్..చిన్నపిల్లలకు పొంచి ఉన్న ముప్పు..అంటూ మీడియాతో పాటు కొంత మంది చేస్తున్న ప్రచారం ఆపేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరారు.
  •  అనవసరంగా చిన్న పిల్లలను భయాందోళనకు గురిచేయడం సరైంది కాదన్నారు. 
  • ఈ తాప వస్తే పిల్లల కొస్తది..అని అంటుండ్రూ..కరోనా వైరస్ వీరికి ఫోన్ చేసి చెప్పిందా..ఎందుకు భయపెడుతుండ్రూ..జనాలను..బాధకలుగతదండీ..ఏం సాధిస్తరు.. సమాజం పట్ల బాద్యత ఉండాలి.. పండకుండా..లేవకుండా..తినకుండా..లేని పోని భయాలు పెడుతుండ్రూ..ఇంత దుష్ప్రచారం చేయడం అవసరమా..ఇది మీకు మంచిదా..అని సీఎం కేసీఆర్ మీడియాకు సలహా ఇచ్చారు.
  •  ఇప్పటికే స్కూల్స్ లేక పిల్లలు ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులను భయాందోళనకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 
  • బడి బంద్ కావడంతో ఏం చేయాలో తెలియక చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారని..వీరికి విధ్యాబుద్దులు చెప్పించాలని ప్రభుత్వం చూస్తుంటే..ధర్డ్ వేవ్ అంటూ అదరకొడుతున్నారు. 
  • అది కూడా చిన్న పిల్లలకు వస్తుందని భయపెట్టడం మంచిదా..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
  • అది వచ్చినప్పుడు చూసుకుందాం..ఇప్పుడే పిల్లలను బెదరకొట్టడం ఎందుకు..? ధర్డ్ వేవ్..పిల్లలు అంటూ ప్రచారం చేస్తే..ఇక దవాఖానాల పొంటి తిరగడం..పుస్తె,మెట్టెలు అమ్ముకుని దవాఖానాల పొంటి తిరిగి లక్షలు, లక్షలు గుమ్మరియ్యాలి..ఇది మంచిదా..ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
  •  ఇదంతా మీడియా ఎందుకు చేస్తుందో అర్డం కావడం లేదన్నారు. 
  • మంచి విషయాలను పదే పదే చెబితే బావుంటుంది కానీ..అనవసర విషయాలను తెర మీదికి తెచ్చి పదే పదే చెప్పడం మానుకోవాలని ఆయన కోరారు.
  • కరోనా వైరస్… వీరికి ఫోన్లో చెప్పినట్లే ప్రచారం చేస్తుంటారు..వద్దు ఇలాంటి భయపెట్టె పనులు చేయోద్దన్నారు. 
  • ఇది సైకలాజికల్ ప్రాబ్లం..మనిషి యెక్క సుపీరియర్ థింకింగ్ ను..ఇన్పీరియర్ చేస్తే వచ్చే నష్టాలను తెలియజేస్తు ఒక రచయిత రాసిన పుస్తకాన్ని తాను చదివినట్లు..ఆ బుక్ లోని ఒక కథను సీఎం కేసీఆర్ తెలిపారు. 

భయంతో చనిపోయిన వారే ఎక్కువ అంటూ..సీఎం చెప్పిన కథ ఇదీ.

  • ఒక రాజ్యంలో పూర్వం గత్తర మహమ్మారి లేదా కలరా వచ్చి చాలా మంది చనిపోతున్నారు. 
  • తన రాజ్యంలో ప్రజలు ఇలా మరణించడం పట్ల ఆ రాజు ఆందోళన వ్యక్తం చేస్తూ..తన ప్రజలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 
  • పలువురి సలహాలు తీసుకున్నాడు.
  •  ఎవరో్ ఒకతను ఇచ్చిన సలహా మేరకు..పక్క రాజ్యంలో ఒక మంత్రగాడు ఉన్నాడు..వాడు నయం చేస్తాడని చెప్పడంతో..వెంటనే రాజు ఆ మంత్రగాడిని తన రాజ్యానికి రప్పించుకున్నాడు.
  •  మంత్రగాడు వస్తున్నాడనే సమాచారం తెలుసుకున్న కలరా పారిపోయే ప్రయత్నం చేస్తూ..మంత్రగాడికి ఎదురు పడింది.
  •  వెంటనే మంత్రగాడు స్పందిస్తూ..ఏం ఒకేసారి 500 మందిని చంపుతావా అంటూ కలరాను ప్రశ్నించాడు.
  •  దీనికి కలరా బదులిస్తూ..నేనే కేవలం 50 మందిని మాత్రమే చంపాను..మిగిలిన 450 మంది భయపడి వారంతట వారే చనిపోయారని బదులిచ్చింది. 
  • ఇలా భయపడి చనిపోయిన వారి సంఖ్యే అధికంగా ఉంటుందని సీఎం కేసీఆర్ కథ రూపంలో వినిపించారు. 
  • రోగంతో బాధపడే వారికి మానసిక స్థైర్యాన్ని అందజేయాలి తప్పా..భయాందోళనకు గురి చేయోద్దన్నారు. తనకు కూడా కరోనా సోకిందని..తాను కేవలం డోలో 650తో పాటు ఆంటిబయోటిక్ గోలీలను మాత్రమే వాడనని..వెంటనే కోలుకున్నానని తెలిపారు.
  •  అలాగే ఇటీవల నగరానికి వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బందువొకరికి కరోనా వచ్చింది..డాక్టర్ కు చెప్పి జర చూసుకోంది అని చెబితే..అడ్డమైన స్టిరాయుడ్స్ ఇవ్వడంతో అతను ప్రస్తుతం లావుగా మారాడు.
  • ఇలా అడ్డమైన వైద్యం చేస్తుండడంతో పరిస్థితులు సైడ్ ఎఫెక్ట్ లకు దారి తీస్తోంది. మీడియా మిత్రులు గమనించాలి..అడ్డమైన న్యూస్ తో ప్రజలను భయాందోళనకు గురి చేయోద్దు..ధయచేసి అర్దం చేసుకోండి..అంటూ కోరారు.