- కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలి..
- మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి..
- భౌతిక దూరం పాటించాలి..
- గత 24 గంటల్లో దేశంలో 50,848 పాజిటివ్ కేసుల నమోదు
- మరోవైపు దడ పుట్టిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్..
ఆర్సీ న్యూస్,జూన్ 23 (హైదరాబాద్): లాక్ డౌన్ మాత్రమే తొలగింది. కరోనా వైరస్ ఎక్కడికి పోలేదు..ఈ విషయాలను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సీనియర్ వైద్యులు,ప్రజా ఆరోగ్య శాఖ, మెడికల్ విధ్యా విభాగం,ఐసీఎంఆర్ వైద్యులు తెల్చి చెబుతున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ తొలగిన వెంటనే చాలా మంది కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ లలో మాస్క్ లు లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కేవలం లాక్ డౌన్ ఆంక్షలు మాత్రమే తొలగాయి..తప్పా కరోనా వైరస్ కనుమరుగు కాలేదు. అందుకే ప్రజలం దరూ తప్పనిసరిగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబందిత అధికారులు చెబుతున్నారు.
గత 24 గంటలలో దేశంలో…
- బుధవారం వరకు గత 24 గంటలలో దేశంలో కొత్తగా 50,848 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- 68,817 మంది వైద్య సేవలు పొందుతూ రికవరి అయ్యారు.
- నిన్నటి కన్నా..నేడు 19 శాతం కేసులు పెరిగాయి.
- దేశ వ్యాప్తంగా 1,358 మంది మరణించారు.
- దేశంలో రోజుకు 2.67 శాతం పాజిటివిటి రేట్ నమోదయ్యింది.
- ప్రస్తుతం దేశంలో 6,43,194 ఆక్టివ్ కేసులున్నాయి.
- మహారాష్ట్రలో 10,066 పాజిటివ్ కేసులు నమోదు కాగా..11032 రికవరి అయ్యారు.
- జమ్ము,కాశ్మీర్ లో 444 కేసులు నమోదు కాగా..ప్రస్తుతం 6,782 ఆక్టివ్ కేసులున్నాయి.
- కర్ణాటక రాష్ట్రంలో 4436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..123 మంది మరణించారు.
- ఉత్తరాఖండ్ లో కేవలం 149 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 5 మంది మరణించారు.
- ఆంధ్రప్రదేశ్ లో 4684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..7,324 మంది రికవరి అయ్యారు. 36 మంది కరోనా సోకి వైద్యం పొందుతూ మరణించారు.
- తెలంగాణలో 1,114 కేసులు నమోదు కాగా..12 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 129 కొత్త కేసులు నమోదయ్యాయి.
- కేరళలో 12,787 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 150 మంది మరణించగా..13,683 మంది వైద్య సేవలు పొందుతూ రికవరి అయ్యారు.
- ఢిల్లీలో 111 పాజిటివ్ కేసులు నమోదు కాగా..7 మంది మరణించారు. 702 మంది రికవరి అయ్యారు.
ఆందోళనకు గురి చేస్తున్న డెల్టా ప్లస్ అనే కొత్త వేరియంట్...
- ఇక,దేశంలో డెల్టా ప్లస్ అనే కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
- ఇప్పటికే దేశ వ్యాప్తంగా 40 కేసులు నమోదైనట్లు సంబందిత కేంద్ర వైద్యాధికారులు చెబుతున్నారు.
- డెల్టా వ్లస్ వేరియంట్ కేసులు దేశంలోని మహరాష్ట్ర, మధ్యప్రదేశ్,కేరళ,తమిళ్ నాడు తదితర నాలుగు రాష్ట్రాలలో నయోదయ్యాయి.
- మహారాష్ట్రలోని ఏడు జిల్లాలలో 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
- వీరి వద్ద నుంచి అవసరమైన డీటేయిల్స్ తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.
- డెల్టా ప్లస్ వేరియంట్ తో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని ఆయన వెల్లడించారు.
- కొత్త వేరియంట్ తో బాధపడే వారి ట్రావెల్ హిస్టరీతో పాటు ఎక్కడెక్కడ తిరిగారు..ఎవరెవరితో కలిశారు అనే విషయాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
- డెల్టా ప్లస్ వేరియంట్ యూరప్ లో మొదటగా నమోదైనట్లు సంబందిత అధికారులు బావిస్తున్నారు.
More Stories
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..
Hyderabad : నగరంలో వరద నీటి సమస్యకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం..