నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఒక్క పైసా ఖర్చు లేకుండా…డిగ్నిటీ హౌజింగ్ కాలనీ

ఒక్క పైసా ఖర్చు లేకుండా…డిగ్నిటీ హౌజింగ్ కాలనీ

 

  • కోటిన్నర ఖరీదు చేసే డబుల్ బెడ్ రూం ఇల్లు.
  • పేదలకు అందజేసిన మంత్రి కేటీఆర్
  • అంబెద్కర్ నగర్ లో రూ.28 కోట్ల నిధులతో 330 డబుల్ బెడ్ రూం ఇల్లు
  • బోనాలతో పూజలు..ధూంధాంగా ప్రారంభోత్సవం
  • స్థానికులతో కలిసి సహాపంక్తి బోజనం చేసిన కేటీఆర్
  • పచ్చదనాన్ని పెంచాల్సిన భాధ్యత మహిళలదే.
  • నగరంలో రూ.9 వేల కోట్లతో 2బీహెచ్కే ఇళ్ల నిర్మాణం.

ఆర్సీ న్యూస్,జూన్ 26 (హైదరాబాద్): ఒక్క పైసా ఖర్చు లేకుండా కోటిన్నర రూపాయల ఖరీదు చేసే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సనత్ నగర్ నియోజక వర్గం..రాంగోపాల్ పేట్ డివిజన్ లోని అంబెద్కర్ నగర్ లో పేదల కోసం కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇల్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. రూ.28 కోట్ల నిధులతో 330 డబుల్ బెడ్ రూం డిగ్నిటీ హౌజింగ్ కాలనీని ఆయన శనివారం ప్రారంభించారు. హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పశుసంవర్దక శాఖ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం పథకంలో కొత్తగా నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ధూంధాంగా ప్రారంభోత్సవం…ఆకట్టుకున్న సామూహిక బోనాల సమర్పణ..

  • ప్రారంభోత్సవ కార్యక్రమం ధూంధాంగా కొనసాగింది. స్థానికులతో కలిసి మంత్రి కేటీఆర్ సహాఫంక్తి బోజనం చేశారు. 
  • కార్యక్రమానికి ముందుగా అంబెద్కర్ నగర్ కు చెందిన మహిళలు సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. 
  • ఇక్కడ శనివారం నిర్వహించిన బోనాల ఊరేగింపును చూస్తే..అప్పుడే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు వచ్చేశాయా..అన్నట్లు కనిపించింది. 
  • మహిళలు నిష్టగా బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
  •  నగరంలోనే అత్యంత ఖరీదైన స్థలంలో నగరం నడిబొడ్డున  హుస్సేన్ సాగర్ నది పక్కన నిర్మించిన డిగ్నిటీ హౌజింగ్ కాలనీ లోని డబుల్ బెడ్ రూం లు బహిరంగ మార్కెట్ లో ప్రైవేట్ బిల్డర్లు నిర్మిస్తే…ఒక్కొక్కటి కోటిన్నర రూపాయల ఖరీదు చేస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 
  • కోట్ల విలువ చేసే ఖరీదైన భూమిలో పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం లను ఉచితంగా అందజేస్తున్నామన్నారు.
  •  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి..ఎంతో శ్రద్దతో క్వాలిటీగా డబుల్ బెడ్ రూం లను పూర్తి చేయడం జరిగిందన్నారు. 

 

నగరంలో రూ. 9 వేల కోట్ల నిధులతో…

  • సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో రూ. 9 వేల కోట్ల నిధులతో డబుల్ బెడ్ రూం డిగ్నిటీ హౌజింగ్ కాలనీలను నిర్మించి పేదలకు అంద జేస్తున్నామన్నారు. 
  • అర్హూలైన పేదలందరికి ఇళ్లు అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం పథకంలో అవకాశం లభించని లబ్డిదారులకు రాబోయే రోజుల్లో నిర్మించే ఇళ్లలో అవకాశం కల్పిస్తామన్నారు.
  •  పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తున్న పథకం దేశంలోనే మన రాష్ట్రంలో అమలు జరుగుతోంద న్నారు.
  •  ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలలో డిగ్నిటీ హౌజింగ్ కాలనీలు వెలుస్తున్నాయన్నారు. 
  • అంబెద్కర్ నగర్ లో డబుల్ బెడ్ రూం లను సొంతం చేసుకున్న లబ్దిదారుల ఆనందం చూస్తే తన గుండెలో సంతేషం ఉప్పొంగు తోందన్నారు.
  •  పేద ప్రజల సంతోషానికి అవధులు లేవన్నారు. 
  • గతంలో ఉన్న అంబెద్కర్ నగర్ బస్తీ రూపురేకలు ప్రస్తుతం మారిపోయాయన్నారు. తాము ఊహించని విధంగా ఇంత అద్బుతమైన ఇండ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారన్నారు. 

దేశంలో మొదటిసారి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇక్కడే…

  • దేశంలో మొదటిసారి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదన్నారు.
  •  పేదలు ఇళ్లు కట్టాలన్నా..ఆడ పిల్ల పెళ్లి చేయాలన్నా..ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు. 
  • ఇళ్లు కట్టించి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్లి చేయించి ఆడ పడుచుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దూరం చేస్తున్నారన్నారు.
  •  జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం పథకంలో ఎక్కడా అవకతవకలకు ఆష్కారం లేకుండా పార దర్శకంగా పంపిణీ కొనసాగుతుందన్నారు.
  •  అర్హులైన లబ్డిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
  •  అవసరమైతే అంబెద్కర్ నగర్ లో మరికొన్నిఇండ్లు నిర్మించి ఇస్తా మన్నారు. 
  • ఇక్కడి బస్తీ ప్రజల సౌకర్యార్ధం బస్తీ దవాఖానాతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఇస్తామని మంత్రి కేటీఆర్ హామి ఇచ్చారు.
  •  ప్రజల నుంచ ప్రభుత్వం ఆశించేది..రెండే రెండు అని..ఒకటి పరిశుభ్రత కాగా..రెండోది పచ్చదనం అని ఆయన తెలిపారు.
  •  పరిశుభ్రత, పచ్చదనంపై ప్రజలు ద్రుష్టి సారించాలన్నారు.
  •  సీఎం కేసీఆర్ కు పచ్చదనం అంటే ఎంతో ఇష్టమని..తాను సీఎం అయ్యాక..పచ్చదనం 23 నుంచి 28 శాతం వరకు పెరిగిందన్నారు.
  •  పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను ఆడపడుచులు తీసుకోవాలన్నారు. 
  • హైదరాబాద్ నగరంలో చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
  • హుస్సేన్ సాగర్ పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
  • ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవీ,మేడర్ గద్వాల్ విజయ లక్ష్మి,డిఫ్యూటి మేయర్ మోతే శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పోరేటర్లు,అధికారులు పాల్గొన్నారు.