నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మెరుగైన రవాణా వ్యవస్థ కోసం రూ.30 వేల కోట్ల నిధులు…

మెరుగైన రవాణా వ్యవస్థ కోసం రూ.30 వేల కోట్ల నిధులు…
  • మొదటి దశలో రూ.6 వేల కోట్లతో పనులు
  • రూ.387 కోట్ల నిధులతో బాలానగర్ బ్రిడ్జి పనులు
  • డాక్టర్ జగ్జీవన్ రాం పేరుగా నామకరణం
  • శివమ్మ అనే కార్మికురాలితో ప్రారంభోత్సవం
  • గ్రేటర్ లో మొట్టమొదటి 6 లేన్ల ఫ్లై ఓవర్ ఇదే.
  • 1.3 కిలో మీటర్ల పొడవుతో 24 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది.

ఆర్సీ న్యూస్,జూలై 6 (హైదరాబాద్): మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల నిధులతో ప్రణాళికలు రూపొందించిందని మునిసిఫల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వ్యూహాత్మక రహదారుల విస్థరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్నిరహదారులను మెరుగుపరచడంతో పాటు అండర్ పాస్, ఫ్లై ఓవర్, రోడ్ల విస్థరణ తదితర కార్యక్రమాల కోసం రూ.30 వేల కోట్ల నిధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రూ.6 వేల కోట్ల నిధులతో మొదటి దశ కింద పనులు జరుగుతున్నాయన్నారు. కూకట్ పల్లి నియోజక వర్గంలోని బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. డాక్టర్ జగ్జీవన్ రాం చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించిన మంత్రి కేటీఆర్ బాలానగర్ బ్రిడ్జ్ కు డాక్టర్ జగ్జీవన్ రాం పేరును పెట్టారు.  బాలానగర్ బ్రిడ్జి నిర్మాణం పనుల్లో గత రెండేళ్లుగా పని చేస్తున్న వనపర్తికి చెందిన శివమ్మ అనే కార్మికురాలితో మంత్రి కేటీఆర్ బాలానగర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభింప జేశారు.

డాక్టర్ జగ్జీవన్ రాం చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించిన మంత్రి కేటీఆర్

మన పూర్వీకులు పదే పదే చెబుతుంటారు..తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరో..అని. అంటే ఒక నిర్మాణం సంపూర్ణంగా పూర్తి కావడానికి కిందిస్థాయి కార్మికుల శ్రమ ఎంతో ఉంటుదని..అందుకే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల్లో రెండు సంవత్సరాలుగా పని చేసిన శివమ్మఅనే కార్మికురాలితో బాలానగర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభింప జేశారు.  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…గ్రేటర్ లో మెరుగైనా రవాణ వ్యవస్థ ఏర్పాటు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నగరంలో పలు ప్లై ఓవర్ల నిర్మాణం జరిగింద న్నారు. ఇంకా పలు చోట్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నయన్నారు. రోడ్లపై వాహన దారులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవైపు జీహెచ్ఎంసీ.. మరోవైపు హెచ్ఎండీఏ రహదారుల అభివృద్ది కోసం కృషి చేస్తున్నాయన్నారు. గత ఏడు ఏళ్లుగా కూకట్ పల్లి నియోజక వర్గంలో వెయ్యి కోట్ల నిధులతో అండర్ పాస్, ఫ్లై ఓవర్ పనులు జరిగాయన్నారు. ఇంకా కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. 40 ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్న నగర వాసులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ఈ జంక్షన్ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సమయం ఆదా కావడంతోొ పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు గంటల తరబడి వాహనాల జాం, చుట్టు తిరిగి పోవడం తదితర సమస్యలతో వాహనదారులు పడరాని పాట్లు పడిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. రూ. 387 కోట్ల నిధులను ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం కేటాయించామన్నారు. ఈ నిధుల్లో మిగిలిన డబ్బుతో ఫ్లై ఓవర్ తో అనుసంధానంగా ఉన్న చుట్టుపక్కల రహదారుల అభివృద్ది వినియోగిస్తామన్నారు. 2017 ఆగస్ట్ 21న మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జి నిర్మణం పనులను ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్లుగా నిర్మాణం పనులు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే.. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. పలు సాంకేతిక కారణాలతో బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్త నడకన కొనసాగినట్లు సంబందిత అధికారులు తెలిపారు. ఇక నుంచి కూకట్ పల్లి నంచి కంటోన్మెంట్ వెళ్లే వాహనదారులందరికి బాలానగర్ బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొట్టమొదటి సారి 6 లేన్ల ఫ్లై ఓవర్ ఇదే. ఒక్కో వైపు 3 లేన్ల తో రెండు వైపుల 6 లేన్ల తో మొదటిసారి నిర్మించిన బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. 1.3 కిలో మీటర్ల పొడవుతో 24 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది.