నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలకు గ్రేటర్ మేయర్ ఆదేశాల జారీ

జీహెచ్ఎంసీ అధికారులతో గ్రేటర్ మేయర్  సమీక్షా సమావేశం..

 

కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలకు గ్రేటర్ మేయర్ ఆదేశాల జారీ

 

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్): గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీలోని జోనల్ కమీషనర్ల వారిగా సమీక్షా సమావేశాలకు శ్రీకారం చుట్టారు.నగరంలోని అన్ని జోనల్ కమిషనర్ల పరిధిలో జరుగుతున్న అభివ్రద్ది పనులతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు మీటింగ్ లు ఏర్పాటు చేసి సమీక్షించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జోనల్ కమీషర్ల పరిధిలోని డిఫ్యూటీ కమీషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఎంహెచ్ఓ తదితరులతో సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపధ్యంలో గురువారం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధిలోని అధికారులతో సమావేశం జరిగింది. జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో పాటు డీసీలు, ఇంజనీర్లు,ఏఎంహెచ్ఓలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పలు ఆదేశాలు జారీ చేశారు. 

 

  • చేపట్టాల్సిన పనులతో పాటు ఇప్పటి వరకు చేసిన అభివ్రుద్ది పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..
  • ప్రస్తుతం నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని.. అవసరమైన అన్ని చోట్ల ఫాగింగ్ చేస్తూ..సోడియం హైఫో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఎంటమాలజీ అధికారులను ఆదేశించారు. 
  • రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. 
  •  వేసవి కాలంలో పూడికతీత పనులు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని..ఈ రెండు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుని వెనువెంటనే నాలాల్లో పూడికతీత పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
  •  పచ్చదనం పరిశుభ్రంలో భాగంగా నగరంలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
  •  నగరంలో గ్రీనరిని పెంచడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నగర సుంరీకరణకు పెద్ద పీట వేయాలన్నారు. 
  • ఇందుకోసం అవసరమైన మేరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో  అధిక సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. 
  • నాటిన మొక్కల సంరక్షణ భాద్యతలను విస్మరించరాదన్నారు. కేవలం మొక్కలను నాటడం వరకే తమ పని అని..వదిలేస్తే మందచిది కాదన్నారు.
  •  మొక్కలు ఎదిగి చెట్లు అయ్యేంత వరకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
  •  ఇక నగరంలో ఎక్కడ చెత్త కుప్పలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
  •  హైదరాబాద్ నగరాన్ని బిన్ లెస్ సిటీగా మార్చేందుకు క్రుషి జరగాలన్నారు.
  •  ఇందు కోసం వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. 
  • అవసరమైన మేరకు దశల వారిగా చెత్త కుప్పలను తొలగించడానికి ప్రయత్నించాలన్నారు.
  •  రాబోయే 10 రోజుల్లో ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ఏ వీధిలో చెత్త కుప్పలు కన్పించ వద్దన్నారు. 
  • నగరంలో ఇప్పటికే పలు చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల పర్యవేక్షణను దగ్గర్లోని స్ట్రీట్ వెండర్లకు అప్పగించాలన్నారు. 
  • అక్కడక్కడ టాయిలెట్లలోని కొన్ని పరికరాలను దొంగిలించినట్లు తెలుస్తోందని..దీనిపై సంబందిత అధికారులు ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 
  • విచారణ నిర్వహించి దొంగలను గుర్తించి కేసులు నమోదు చేయించాలన్నారు. 
  • పారిశుద్ద్య కార్మికులకు ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
  • అరవై ఏళ్ల వయస్సున్న వారిని గుర్తించి వారి అంగీకారం మేరకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు.
  •  వారు సూచించిన కుటుంబ సభ్యున్ని వారి స్థానంలో నియమించాలన్నారు. 
  • వీరి నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వద్దన్నారు.