- నియోజవ వర్గానికి ఒక స్టేడియం కడతాం..
- క్రీడాకారులకు తగిన సౌకర్యాల ఏర్పాటు..
- ఓలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన హీకీ జట్టు
- రవీంద్రభారతి వద్ద సంబరాలు నిర్వహించిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
- క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చిన మంత్రి
ఆర్సీ న్యూస్,ఆగస్టు 05(హైదరాబాద్): టోక్యోలో జరిగిన ఓలంపిక్స్ గేమ్స్ లో హాకీ జట్టుకు కాంస్య పతకం రావడం పట్ల రాష్ట్ర ఆబ్కారి,క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ గేమ్స్ లో హాకీ జట్టు కాంస్య పథకం సాధించడంతో హాకీ జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించడంతో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణ పతకం కోసం జరిగిన హోరాహోరీ పోరులో మన దేశానికి చెందిన రవికుమార్ అద్భుత ప్రతిభను కనబర్చి రజత పతకాన్ని సాధించారన్నారు. కోట్లాదిమంది భారతీయుల హృదయాలను హాకీ జట్టు తోపాటు రెజ్లింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన రవికుమార్ లకు అభినందనలు తెలిపారు. హాకీ జట్టు ఒలంపిక్స్ గేమ్ లో కాంస్య పతకాన్ని సాధించడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం రవీంద్రభారతి లోని తన కార్యాలయం వద్ద సంబరాలు జరిపారు. ఈ సంబరాలలో హాకీ క్రీడాకారులు పాల్గొని సందడి చేశారు. మంత్రి కాసేపు వారితో హాకీ ఆడుతూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో క్రీడా అభివృద్ధి కోసం స్టేడియంలు నిర్మించడానికి కృషి జరుగుతుందన్నారు. హాకీ క్రీడాకారులు దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించార న్నారు. ఒలంపిక్స్ లో హాకి క్రీడాకారులు కాంస్య పతకం సాధించడంతో భారత్ లో హాకీ ఆటకు పునర్ వైభవాన్ని తీసుకు వచ్చారన్నారు. కాంస్య పథకం కోసం జరిగిన పోటీలో బలమైన ప్రత్యర్థి అయిన జర్మనీ నీ ఎదుర్కొని భారత హాకీ జట్టు విజయం సాధించిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు. కాంస్య పథకం తో సంతృప్తి చెందకుండా బంగారు పతకాన్ని సాధించే ప్రయత్నం చేయాలన్నారు. సాధించిన కాంస్య పతకాన్ని కోవిడ్ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కి అంకితమిచ్చిన హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, కోచ్ గ్రహం రీడ్ లకు మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో లో క్రీడా అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఒకప్పుడు దేశానికి ఖ్యాతి తెచ్చిన వారు తమ వద్ద ఉన్నారన్నారు. విద్యార్థి దశ నుంచి ఆడుతున్నప్పటికీ.. ఒక్కోసారి పథకాలు రాకపోవడంతో కొంత నిరాశకు గురవుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం పథకాలు సాధించడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈ కాంస్య పథకం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఒలంపిక్స్ గేమ్స్ లో తమ క్రీడాకారులు సాధించిన విజయాన్ని ఆయన క్రీడాకారులతో కలిసి సంబరాలు జరిపారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి తన సంతోషాన్ని ఆ క్రీడాకారులతో కలిసి పంచుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు సరల్ తల్వార్, చైర్మన్ కొండ విజయ్, ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి, కోశాధికారి భాస్కర్ రెడ్డి లతోపాటు కళ్యాణి సింగ్, విద్యాసాగర్, పాండురంగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తెలంగాణ హాకీ జట్టు క్రీడాకారులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..