నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మాకూ సమస్యలున్నాయి.. ఎప్పుడు పరిష్కరిస్తారు: జర్ణలిస్టులు

మాకూ సమస్యలున్నాయి.. ఎప్పుడు పరిష్కరిస్తారు: జర్ణలిస్టులు
  • సమస్యల పరిష్కారం కోరుతూ దశలవారీగా ఆందోళన
  • ఈనెల 20న, రాష్ట్ర వ్వాప్తంగా నిరసన ప్రదర్శనలు
  • జర్ణలిస్టుల డిమాండ్ డే..గా పరిగణిస్తూ నిరసనలు
  • ఈనెల 27 నుంచి వారం రోజుల పాటు నిరసనలు.. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణలు
  • అక్టోబర్ లో వందలాది మంది జర్ణలిస్టులతో “ఛలో హైదరాబాద్”

 ఆర్సీ న్యూస్, సెఫ్టెంబర్ 12 (హైదరాబాద్):  సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసే జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. జర్ణలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడబ్లుజేఎఫ్ ఆందోళన బాట పట్టడానికి సిద్దమైంది. జర్నలిస్టుల దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్( టి డబ్ల్యూ జే ఎఫ్) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు టి డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం తీర్మానించింది. ఆదివారం పాతబస్తీ మిరాలం మండి లో జరిగిన రాష్ట్ర విస్త్రుత స్థాయి సమావేశంలో లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా ఎలాంటి పరిష్కారానికి నోచుకోకుండా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగా ఈనెల 20న, జర్నలిస్ట్ డిమాండ్ డే..పాటించాలని నిర్ణయించింది. జర్నలిస్టు డిమాండ్ డే.. సందర్భంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని సమావేశం తీర్మానించింది. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల 27 నుంచి వారం రోజుల పాటు అన్ని జిల్లాల లోని నియోజకవర్గాలలో స్థానిక జర్నలిస్టులు తమ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించింది. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల అక్టోబర్ లో వందలాది మంది జర్నలిస్టులతో “చలో హైదరాబాద్” కార్యక్రమం చేపట్టాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి అక్టోబర్ 25 వరకు ఫెడరేషన్ జిల్లా మహా సభలు నిర్వహించి.. నవంబర్ 21న, రాష్ట్ర మహాసభలు జరపాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు..ఇళ్ల స్థలాలు ఇవ్వాలని… హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని.. మంజూరు చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇప్పటికే కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని.. కరోనా చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని.. తెలంగాణ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని.. జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేయాలని సమావేశం కోరింది. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను, అక్రమ కేసులు బనాయింపులను ఆపాలని.. దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేయాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ,వెబ్ సైట్, వెబ్ ఛానల్ లను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాం చందర్, కార్యదర్శులు ఏ. నర్సింగ్ రావు, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబురావు, మెరుగు చంద్రమోహన్, విజయ్ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభించడానికి ముందు ఇటీవల మ్రుతి చెందిన జర్ణలిస్టుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యుల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.