నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తేనే అభివృద్ది..

కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తేనే అభివృద్ది..
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావడంతో ఆశించిన స్థాయిలో లేని అభివృధ్ధి..
  • 10 ఎకరాల విస్థీర్ణంలో కంటోన్మెంట్ ఏరియా..
  • రసూల్ పురాలో 2BHK ప్రారంభోత్సవం..

ఆర్సీ న్యూస్, సెప్టెంబర్ 23(హైదరాబాద్) : పేద ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నా యని రాష్ట్ర మంత్రులు అన్నారు. కంటోన్మెంట్- రసూల్ పురా క్రిష్ణ కాలనీ లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం మంత్రులు ప్రారంభించారు. మూడు అంతస్తుల్లో 8 బ్లాకుల్లో 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం  కొత్తగా నిర్మించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.17.36 కోట్లను వెచ్చించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా  జిహెచ్ఎంసిలో విలీనం చేస్తేనే  ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అన్నారు.  కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర కృష్ణకాలనీలో  కట్ట మైసమ్మ  సిల్వర్ కాంపౌండ్ రూ. 17.36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన జి+3  అంతస్తుల గల  8 బ్లాక్ లలో నిర్మించిన  168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి  సిహెచ్ మల్లా రెడ్డి,  శాసన సభ్యులు సాయన్న లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ….ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉందని…ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు  ఏమాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ ఏరియా చుట్టు ప్రక్కల ప్రాంతం ఎంతో అద్భివృద్ది చెందినట్లు జిహెచ్ఎంసిలో విలీనమైతే సంక్షేమ అధివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు.  కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జిహెచ్ఎంసిలో  విలీనం అయితే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చాన్నారు. తద్వారా పేదలు  గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత   మిగితా ప్రాంతాలలో మౌలిక వసతులు  అభివృద్ధి  చెందాయి. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు  ముఖ్య మంత్రి కె.సి.ఆర్  ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. బీదలు ఆత్మాభిమానంతో  గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి ఆశయంతో  రెండు పడకల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని  చెప్పారు.  గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేసిన గృహాల కాలనీలకు మౌలిక సదుపాయాల పై దృష్టి పెట్టలేదన్నారు. రెండు పడకల గృహాల కాలనీ విద్యుత్తు త్రాగు నీరు సిసి రోడ్లు సదుపాయాలను కల్పించామన్నారు. ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు 56 గృహాలను మంత్రి మంజూరు చేశారన్నారు. రెండు పడకల గదుల నిర్మాణాల  డిజైన్ రూపకల్పన  ముఖ్యమంత్రి చేశారన్నారు. రాజకీయ నాయకులు చాలా మంది ఏవేవో మాట్లాడుతున్నారనీ..వాస్తవం ఇక్కడికి వచ్చి చూడాలన్నారు. వారికి పేదలు గొప్పగా బ్రతుకాలనే ఆలోచన లేదని…గత ప్రభుత్వాల హయాంలో లబ్ది దారులకు కొంత శాతం సబ్సిడీతో మంజూరు చేసేవారని…తమ ప్రభుత్వం పేదలకు  ఉచితంగా  అందిస్తున్నట్లు  వివరించారు.రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… దేశంలో మరెక్కడా లేని విధంగా రెండు పడకల గదులను  తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ నిరుపేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు బందు, రైతు భీమా పథకాలతో పాటు ఆసరా ఫించన్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు మరెక్కడా  లేవన్నారు.

కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి మాట్లాడుతూ…. గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి నిధులు  మంజూరు కాక అభివృద్ధి జరగ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ధనవంతులు నివసించే గృహాల మాదిరిగా డబుల్ బెడ్  రూం గృహాలను పేదలకు పంపిణీ  చేస్తున్నట్లు చెప్పారు. శాసన సభ్యులు సాయన్న మాట్లాడుతూ… గతంలో ఈ కాలనీ ప్రజలకు  అడ పిల్లలను ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని,  ముఖ్య మంత్రి  కృషి మేరకు పేదలకోసం రెండు పడకల గృహాలను నిర్మించి పంపిణీ పండుగ వాతావరణంగా ఉందని అన్నారు.  మరొక 56 గృహాలు మంజూరు చేయాలని మంత్రిని  కోరారు.

 కరోనా వ్యాధి  మూలంగా నిర్మాణ పనులు జాప్యం జరిగడానికి కారణమన్నారు.  ఏదైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. కేసిఆర్ పాలనలో  పేదల కోసం  ఎక్కడ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రులు 168 మంది లబ్దిదారులకు ఇళ్ల పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్  కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిహెచ్ఎంసి హౌసింగ్ ఓ.యస్ డి శంకరయ్య,  అర్డిఓ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.