నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పాతబస్తీలో 90 రోజుల పాటు భారీ వాహనాల దారి మళ్లింపు..

పాతబస్తీలో 90 రోజుల పాటు భారీ వాహనాల దారి మళ్లింపు..
  • బహదూర్ పురా మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా దారి మళ్లింపు..
  • ఆరాంఘర్ నుంచి పురానాపూల్ వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు..
  • లైట్ మోటార్ వెహికల్స్ యధావిధిగా వెళ్ళవచ్చు..
  • భారీ వాహనాలు చాంద్రాయణగుట్ట గుట్ట మీదుగా నల్గొండ క్రాస్ రోడ్ ద్వారా వెళ్లవచ్చు..
  • ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ..
  • వాహనదారులు సహకరించాలని కోరిన ట్రాఫిక్ డిసిపిలు..

ఆర్సీ న్యూస్, నవంబర్ 13 (హైదరాబాద్): నగరం లోని పాతబస్తీ బహదూర్ పురా జంక్షన్లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ దారి మళ్లింపు కొనసాగుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి తెలిపారు. గత కొంత కాలంగా బహదూర్పురా జంక్షన్ లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా గ్రేడ్ సపరేటర్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకోసం ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాల పై 90 రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. తొంబై రోజుల పాటు వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుందన్నారు. కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతించడం లేదని.. సాధారణ వాహనాలైన లైట్ మోటార్ వెహికల్స్ ను యధావిధిగా అనుమతించను న్నారు. ఆరంఘర్ చౌరస్తా నుంచి బహదూర్ పుర ద్వారా పురానాపూల్ చేరుకునే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు ఇతర భారీ వాహనాలను బహదూర్ పుర చౌరస్తా ద్వారా కాకుండా మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, మహబూబ్ నగర్ క్రాస్ రోడ్, చాంద్రాయణగుట్ట, డి ఎం ఆర్ ఎల్, మిధాని, ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్ గూడ ద్వారా నల్గొండ క్రాస్ రోడ్డుకు చేరుకోవడానికి సంబందిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక లైట్ మోటార్ వెహికల్స్ ఐన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎప్పటి లాగే ఆరాంఘర్ నుంచి పురానాపూల్ చేసుకోవచ్చును.  పాతబస్తీ తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు ఆరంఘర్ వెళ్లడానికి నల్లగొండ క్రాస్ రోడ్డు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. రాబోయే 90 రోజుల వరకు వాహనదారులు సహకరించాలని డీసీపీ కోరారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పురానాపూల్ నుంచి ఆరంఘర్ వరకు భారీ వాహనాల రాకపోకలు పై ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బహదూర్ పుర చౌరస్తా వద్ద జరిగే మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం పనుల సందర్భంగా అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డి సి పి ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డిసిపి భారీ వాహనాల పై ట్రాఫిక్ ఆంక్షలను కనసాగించనున్నారు.