నవంబర్ 21, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..

చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ.
  • అస్సాం సీఎం పర్యటన అనంతరం విజయ అవకాశాలు..
  • నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఓటర్ల మద్దతు..
  • గెలుపు పై చాంద్రాయణ గుట్ట బీజేపి అభ్యర్థి కౌడి మహేందర్ ధీమా..

ఆర్సీ న్యూస్,హైదరాబాద్ (నవంబర్ 26): పాతబస్తిలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ఓటర్ దేవుళ్లను కోరుతున్నారు. సభలు సమావేశాలు పాదయాత్రలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా పార్టీల అభ్యర్థులు బిజీగా మారారు. పాతబస్తీలో ప్రధానంగా మజ్లీస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని ప్లాటు వస్తుంది.
మజ్లీస్ కంచుకోటలో పాగా కు బీజేపీ ప్రయత్నం..
ఒక రకంగా చెప్పాలంటే మజ్లీస్ పార్టీకి పాతబస్తీ కంచుకోటగా మారింది. అయినప్పటికీ.. ఈసారి పాతబస్తీలో సమీకరణాలు మారనున్నట్లు చాంద్రాయణగుట్ట గుట్ట బీజేపి అభ్యర్థి కౌడి మహేందర్ చెబుతున్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని వర్గాల ఓటర్లు తనకే ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే తాను వివిధ వర్గాల మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాతబస్తీలోని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు తన విజయం కోసం కృషి చేస్తున్నారన్నారు. వారు సైతం తన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనను గెలిపించడానికి శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ఎన్నికలలో తాను విజయం సాధిస్తే నియోజకవర్గం లో కులమతాలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. ప్రచారం సందర్భంగా తాను నిర్వహించే ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రాంతాల ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.