- మజ్లీస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..
- కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నత విద్యావంతులు..అడ్వకేట్
- జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్
ఆర్సీ న్యూస్,హైదరాబాద్ (నవంబర్ 27): హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధి లోని బహదూర్ పురా శాసన సభ నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటి నుంచో మజ్లీస్ పార్టీకి బహదూర్ పురా నియోజకవర్గ కంచుకోటగా ఉంది. అలాంటి కంచుకోటలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి..ఉన్నత విద్యావంతులైన పులిపాటి రాజేష్ కుమార్ (రాహుల్) గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ప్రతిరోజు నియోజక వర్గం లోని అన్ని ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఈ ఎన్నికలలో తనకే ఓటు వేయాలని ఓటర్ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6 గ్యారంటీల పట్ల నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని..అందుకే ఈ ఎన్నికలలో తాను ముమ్మరంగా ప్రచారం నిర్వహించి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నానని పులిపాటి రాజేష్ కుమార్ అంటున్నారు.
ఉన్నత విద్యావంతులు.. అడ్వకేట్ అయిన స్థానికుడు..
- పులిపాటి రాజేష్ కుమార్ బహదూర్ పురా నియోజకవర్గంలోని దూద్ బోలి ప్రాంతానికి చెందిన స్థానికులు.
- ఎం.బీ.ఏ, ఎల్.ఎల్.బి చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూనే ఉన్నత పదవులు నిర్వహించారు.
- ప్రస్తుతం టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గా కొనసాగుతున్న ఆయన 2019లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో రామ్నాస్ పురా డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు.
- 2006 నుంచి 2008 వరకు బహదూర్పురా నియోజకవర్గంలోని బి- బ్లాక్ అధ్యక్షునిగా పని చేశారు.
- అలాగే 2018 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పని చేసిన ఆయన నియోజకవర్గ ప్రజలకు ఏళ్ల తరబరి సుపరిచితులు.
More Stories
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..
Telangana Elections 2023 : నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన తగిన ఏర్పాట్లు..