నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

 రాత్రిపూట కర్ఫ్యూ పెట్టి వదిలేస్తే..ఎలా..: హైకోర్టు  

రాత్రిపూట కర్ఫ్యూ పెట్టి వదిలేస్తే..ఎలా..: హైకోర్టు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ..పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం రాత్రిపూట కరోనా కర్ఫ్యూ పెట్టి వదిలేస్తే..ఎలా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని..కరోనా కట్టడి కోసం వీకెండ్ లాక్ డౌన్ పై ద్రుష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది.  రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ..కేసుల సంఖ్య తగ్గడం లేదని..తక్కువ పరీక్షలు చేస్తూ తక్కువ కేసులు నమోదవుతున్నట్లు చూపిస్తే..ఎలా అంటూ హైకోర్టు అడిగింది. కొత్త కొత్త వేరియంట్ వెలుగు చూస్తున్నాయని..ఏపీలో అధిక రెట్ల మ్యుటేషన్ కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మొగిస్తున్నందున..ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఏమైనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారా..అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా పరీకసల సంఖ్య ఎందుకు పెంచడం లేదని..ఒక్క రోజు కూడా లక్స్ టెస్టులు జరగలేదని పేర్కొంది. హైకోర్టు విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు హాజరై ప్రభుత్వం తరఫున వివరాలు అందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అమలులో ఉంది. గత  నెల 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మే 1 వ తేదీ వరకు కొనసాగిన కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. అయితే గత కొన్నిరోజులుగా రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ..కరోనా వైరస్ వ్యాప్తి తగ్గక పోవడంతో బుధవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కేవలం కర్ఫ్యూతో సరిపోదని..వీకెండ్ చర్యలైనా తీసుకోవాలని కోరింది. ఈ నెల 8వ తేదీ లోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు  చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. రెండు రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలియజేయడంతో..వారం లోగా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైకోర్టు మరోసారి జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది. కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని..కేవలం రాత్రిపూట కర్ఫ్యూ ఒక్కటే చాలదని రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ విధించిందని..ఇక్కడ మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోందని..అదేంటి..? అని ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ లోపు వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఇదిలావుండగా..హైకోర్టు సూచనలు,ఆదేశాలకు అనుగుణంగా కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించేంత పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే..రాష్ట్ర ముఖ్యమంత్రి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని సోమేష్ కుమార్ తెలిపారు.