- చత్తీస్ గడ్ లో జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం..
- వైరల్ గా మారిన యువకుడి చితక బాదిన వీడియో
- కలెక్టర్ పై వేటు వేసిన సీఎం
ఆర్సీ న్యూస్(హైదరాబాద్): లాక్ డౌన్ సందర్భంగా విధినిర్వహణలో కొంత మంది పోలీసులు, అధికారులు సహానం కోల్పోతున్నారు. కేవలం కింది స్థాయి పోలీసు సిబ్బంది మాత్రమే కాకుండా ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు విమర్షలను ఎదుర్కొంటున్నారు. వారు చేసే చిన్న చిన్న తప్పిదాలతో తెరపైకి వస్తున్నాయి. లాక్ డౌన్ సందర్భంగా కొంతమంది పోలీసులు మీడియా ప్రతినిధుల రాకపోకలను అడ్డుకుంటున్నారు. అనుమతి లేదంటూ ఆపేస్తున్నారనే సమాచారం వస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా మీడియాకు ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని చోట్ల కాకుండా నగరంలోని ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు జర్నలిస్టు సంఘాల నాయకులు తెలిపారు. విధి నిర్వహణలోని అధికారులు కొన్నిసార్లు విచక్షణ కోల్పోతున్నారు. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలతో అబాసు పాలు అవుతున్నారు. కోపం తట్టుకోలేని కొంత మంది అధికారులు వింత ధోరణితో వ్యవహరిస్తున్నారు. బాధితుల పై చేయి చేసుకున్న కొంతమంది వార్తల్లోకి ఎక్కుతున్నారు. లక్షల్లో ఒకరిద్దరు చేసే తప్పిదాలు ఆయా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. తప్పు తెలుసుకుని సారీ చెప్పే లోపే వారు చర్యలకు గురవుతున్నారు. గతంలో ఓ ఐఏఎస్ అధికారి పెళ్లి వారి మండపం లోకి దూసుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరించి పెళ్లి వారందరిని భయభ్రాంతులకు గురి చేసి విమర్శల పాలయ్యారు. ఈ సంఘటన మరువక ముందే తాజాగా మరో సంఘటన చత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ లో చోటు చేసుకుంది.
చత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ లో…
- చత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ లో మే 22న..సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్(ఐఏఎస్) రణవీర్ శర్మ రోడ్డుపై వెళుతున్న ఓ యువకుడిని పిలిచి అతని ఫోన్ ను లాక్కుని నేలకేసి కొట్టాడు.
- లాక్ డౌన్ అమలు జరుగుతున్న వేళ రోడ్డుపై రాకపోకలు నిర్వహించడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- యువకుడు చెబుతున్న విషయాన్ని సావధానంగా వినకుండా చెంప చెల్లుమనిపించారు.
- అంతేకాకుండా అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పిలిచి యువకుడిని కొట్టాంటూ ఆదేశించారు.
- వెంటనే అక్కడి పోలీసులు లాఠీలు ఝులిపించారు.
- మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్తున్నాను అని చిట్టీ చూపించే ప్రయత్నం చేశారు.
- యువకుడు తడబడుతూ సమాధానం చెబుతుండడంతో కలెక్టర్ రణవీర్ శర్మకు కోపం వచ్చింది.
- ఒకసారి ఒక విధంగా..మరోసారి మాట మార్చి మరో విధంగా పొంతన లేని సమాధానం చెబుతుండడంతో సహనం కోల్పోయిన కలెక్టర్ ఊగిపోయారు.
- రెచ్చిపోయిన ఆయన దురుసుగా ప్రవర్తించారు.
- ఈ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్వయంగా తమ ఐఏఎస్ ల సంఘం కూడా అలా జరిగి ఉండాల్సింది కాదని స్పష్టం చేసింది.
- అక్కడ జరుగుతున్న సంఘటన ను స్థానికుడొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
- ఆ నోటా..ఈ నోటా దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అయ్యింది.
- విషయం ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది.
- విచారణ చేసి జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ పై వేటు వేశారు.
- దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీస్ సేవలలో ఉండే వారు సహనాన్ని కోల్పోకుండా బాధితులకు సైతం చేయూత అందించాల్సి ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు.
- ఇక ఈ విషయం పై కలెక్టర్ రణవీర్ శర్మ వివరణ ఇచ్చారు.
- అడ్డదిడ్డంగా పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కోపం వచ్చినట్లు చెబుతూ జరిగిన దానికి పశ్చాతాపం వ్యక్తం చేశారు.
- ఇలా ఉన్నత హోదాలో ఉన్న అధికారులు తమ సహనాన్ని కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేస్తే..బాధితుల మొర ఆలకించే దెవరు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More Stories
బహదూర్ పురా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ..
చాంద్రాయణగుట్టలో బీజేపికి పెరిగిన ఆధరణ..
సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..