నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జూన్ నెలాఖరు వరకు తగ్గనున్నసెకండ్ వేవ్ తీవ్రత…

జూన్ నెలాఖరు వరకు తగ్గనున్నసెకండ్ వేవ్ తీవ్రత…
  • ఈ నెలాఖరు వరకు పరిస్థితుల్లో మార్పు..
  • రాష్ట్రంలో 92.5 శాతం రికవరీ రేటు
  • నేటి నుంచి ప్రారంభమైన కోవిడ్ ఓపీ సేవలు
  • ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ కు వాక్సినేషన్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): జూన్ నెలాఖరు వరకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతుందని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు వరకు పరిస్థితుల్లో గణనీయంగా మార్పులొస్తాయని ఆశిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ , చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు చేపట్టనున్న కార్యక్రమాలు, లాక్ డౌన్ అమలుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రజా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మార్పులొస్తున్నాయని వివరించారు. ఈ నెలాఖరు వరకు పాజిటివ్ కేసుల్లో మార్పులొస్తాయని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వివరించారు. సీఎం కేసీఆర్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. రాష్ట్రంలో 92.52 రికవరి రేట్ ఉందన్నారు. మరణాలు తగ్గాయని..రాష్ట్రంలో 0.56 శాతం, దేశంలో 1.14 శాతం డెత్ రేట్ ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి 33 జిల్లాలో కోవిడ్ అవుట్ పేషంట్ ( ఓపీ) సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ కు వాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్స్, పెట్రోల్ పంపు సిబ్బంది, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరి సిబ్బంది, రైతు బజార్లలో వ్యాపారులు, నిత్యావసర వస్తువుల విక్రయ దారులు, షాప్ కీపర్స్, వైన్ షాప్స్ సిబ్బంది, మటన్,చికెన్ వ్యాపారులు,ఆటో,క్యాబ్ డ్రైవర్లు,చిరువ్యాపారులు సూపర్ స్పైడర్స్ గా ప్రభత్వం గర్తించింది. వీరందరికి ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఉచితంగా టీకా వేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలోని సర్కిల్స్ వారిగా టీకా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు తమ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ తో సంబందిత ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవాలని సంబందిత ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టోకెన్ ఇస్తారని..దీనిని వాక్సినేషన్ సెంటర్ కు తీసుకెళ్లి ఆధార కార్డు చూపిస్తే..టీకా వేయనున్నారు. రేషన్ డీలర్స్ కు సంబందిత సహాయ పౌరసరఫరాల అధికారులు డీలర్ కుటుంబ సభ్యులు,పని చేసే సిబ్బంది సమాచారాన్నిఇప్పటికే సేకరించారు. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సూపర్ స్ర్పెడర్స్ పేర్లతో కూడిన లిస్టులను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇక ప్రజలు కరోనా వైరస్ నుంచి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు వరకు 3,762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3.93 లక్సల టెస్ట్ లు చేశారు.ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుతోందని శ్రీనివాస్ రావు తెలిపారు. 1,01,28,000 ఇళ్లలో ఫీవర్ సర్వే చేశామని..ప్రస్తుతం రాష్ట్రంలో 31,375 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని..23,745 మంది కరోనా వైరస్ సోకిన రోగులు ఆసుప్రతిలో వైద్య సేవలు పొందుతున్నారని..ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు 40 శాతం మంది ఉన్నారన్నారు.  ఆయన వివరించారు. ప్రస్తుతం లాక్ డౌన్ పటిష్టంగా కొనసాగుతోందని..పోలీసులు రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారని..అదే విధంగా ఈ నెల 30వ తేదీ వరకు బందోబస్తును మరింత పటిష్టం చేసే కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. గత రెండు వారాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం రెండో డోసు టీకా పంపిణీ మొదలైందని..కోవాక్సిన్ కు 4-6 గడువుందని..కోవీషీల్డ్ కు 12-16 వారాల సమయం ఉందని ఆయన వివరించారు. అయితే కోవీషీల్డ్ వేసుకునే వారెవరూ లేరని..ఒకవైళ అనివార్య కారణాలతో గడువు లోపు వేసుకోలేని వారు ఇప్పుడు వేయించుకోవచ్చునన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 51,785 మందికి కోవాక్జిన్ రెండో డోస్ టీకా వేశామన్నారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే జోరుగా జరుగుతోందన్నారు. ఫీవర్ సర్వే ద్వారా జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి సకాలంలో వారికి హోం ఐసోలేషన్ కిట్స్ అందజేస్తుండడంతో ఆశించిన ఫలితాలు వస్తున్నయన్నరు. ప్రస్తుతం సెకండ్ వేవ్ సర్వే కొనసగుతోందన్నారు. 17,089 ఫీవర్ సర్వే టీంలు పని చేస్తున్నాయని..46,70,358 ఇళ్లను సర్వే చేసి 1,57,963 మందికి లక్షణాలున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 93 వేల మందికి ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేశామన్నారు.