areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

చిన్న సమోసాలు ఎక్కడి వంటకమో తెలుసా..?

  • 400 ఏళ్ల క్రితం నగరవాసులకు పరిచయమైన చిన్న సమోసాలు..
  • తక్కువ ఖరీదు తో లక్షలాది మందికి అల్పాహారంగా చిన్న సమోసాలు..
  • ఏక్ చాయ్.. దో సమోసే.. అంటూ ఇరానీ హోటల్లో ఆర్డర్ ఇచ్చే యువత..
  • ఇష్టంగా తింటున్న పేద,మధ్య తరగతి ప్రజలు..
  • 400 ఏళ్ల క్రితం నగరవాసులకు పరిచయమైన చిన్న సమోసాలు..
  • తక్కువ ఖరీదు తో లక్షలాది మందికి అల్పాహారంగా చిన్న సమోసాలు..
  • ఏక్ చాయ్.. దో సమోసే.. అంటూ ఇరానీ హోటల్లో ఆర్డర్ ఇచ్చే యువత..
  • ఇష్టంగా తింటున్న పేద,మధ్య తరగతి ప్రజలు..
  • ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి గా  చిన్న సమోసాల తయారీ కేంద్రాలు..

ఆర్సీ న్యూస్, అక్టోబర్ 23(హైదరాబాద్): చిన్న సమోసాల పట్ల ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. చిన్న సమోసాలను స్థానిక ప్రజలు ఇష్టంగా తింటారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న సమోసాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. బేకరీలలో జంక్ ఫుడ్స్ ఎన్ని అందుబాటులోకి వచ్చినా… సమోసాలకు ప్రాధాన్యత ఎక్కడా తగ్గ లేదు. బేకరీలు ఎక్కువగా అందు బాటులో లేనప్పటి నుంచి వినియోగ దారులకు చిన్న సమోసాలు అందు బాటులో ఉన్నాయి. తక్కువ ధరకు లభించే చిన్న సమోసాలు అంటే ప్రజలకు ఎంతో ఇష్టం. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కాలక్షేపానికి బయటికి వచ్చినప్పుడు ఇరానీ హోటల్లో సమోసా ఆర్డర్ ఇవ్వడం పరిపాటి.  అంతేకాకుండా ఏక్ ఛాయ్..దో సమోసా అంటూ ఇరానీ హోటళ్లకు వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటుంటారు. కేవలం రూ.2 నుంచి రూ.5 లకు ఒకటి లభించే సమోసాలకు గిరాకీ ఎక్కువే. అతి తక్కువ ఖర్చుతో లైట్ ఫుడ్ గా సమోసాలను తీసుకోవడం నిజాం కాలం నుంచి వస్తోంది. 400 ఏళ్ల క్రితమే ఇరాన్ నుంచి నగరానికి దిగుమతి అయిన వంటకం సమోసా. ఇరానియన్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే సమోసాను నగర ప్రజలకు తమ ఆహారంలో ఒకటిగా కలిసి పోయింది. ఇరానీ హోటళ్లలో ఇరానీ చాయ్ తో పాటు ఇరానీ సమోసాలను తప్పనిసరిగా విక్రయిస్తుంటారు. వెజిటేరియన్ సమోసాలతో పాటు చికెన్, మటన్, స్వీట్ సమోసాలు సైతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సమోసాల ధరలు మారుతుంటాయి. సాధారణంగా వెజిటేరియన్ సమోసాలతో పాటు చికెన్ సమోసాలు, స్వీట్ సమోసాలు మార్కెట్లో లభిస్తున్నాయి. లక్షలాది మందికి అల్పాహారంగా సమోసాలు ఉపయోగపడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మైదా పిండితో సమోసాలను తయారు చేస్తున్నారు. పిండి ని చిన్న గా కట్ చేసి అందులో ఉల్లి గడ్డలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలాలతో తయారు చేసిన మిక్చర్ ను వేసి నూనెలో వేయడంతో సమోసాలు తయారు అవుతాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కార్మికులు అధికంగా పని చేస్తున్నారు.తక్కువ ధరకు లక్షలాది మంది పొట్ట నింపుతూ..వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న చిన్న సమోసాలకు..హాట్స్ అఫ్..