నవంబర్ 22, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నెహ్రూ జూ పార్క్ లో సందడే..సందడి

నెహ్రూ జూ పార్క్ లో సందడే..సందడి
  • గత మూడు రోజులగా నెలకొన్న సందడి
  • రెండు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చిన సందర్శన
  • ఈ నెల 11 నుంచి సందర్శకులకు అనుమతి
  • వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జూ లో సరదాగా గడుపుతున్న సందర్శకులు
  • కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మే 2 నుంచి మూసి వేసిన జూ 
  • కరోనా నిబంధనలు పాటిస్తూ..సందర్శనకు అనుమతి

ఆర్సీ న్యూస్, జూలై 14 (హైదరాబాద్): నగరంలోని నెహ్రూ జులోజికల్ పార్క్ లో సందర్శకుల సందడి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా మూసి వేసిన జూ పార్క్ సందర్శన తిరిగి అందుబాటులోకి రావడంతో గత మూడు రోజులుగా జూ సందడిగా మారింది. సందర్శకులు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి జూ పార్క్ ను సందర్శిస్తున్నారు. దీంతో సందర్శకులతో జూ పార్క్ సందడిగా మారింది. చిన్నారులు జూ లో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టన నేపధ్యంలో నగరంలోని నెహ్రూ జులోజికల్ పార్క్ ను ఈ నెల 11 ఉదయం నుంచి తిరిగి తెరిచిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సందర్శకులను జూ పార్క్ లోనికి అనుమతించారు. రెండు నెలల తర్వాత తెరిచిన జూ పార్క్ తిరిగి సోమవారం మూసి వేసారు. ప్రతి సోమవారం జూ పార్క్ కు సెలవు ఉంటుండడంతో సందర్శన నిలిచిపోయింది. తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా సందర్శకులకు అందుబాటులో ఉంది. దీంతో నగరంలోని సందర్శకులే కాకుండా ఇతర జిల్లాలలకు చెందిన సందర్శకులు సైతం జూ పార్క్ సందర్శనకు వస్తున్నారు. కాగా, గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సందర్శకుల సందడి తగ్గ లేదు. గత రెండు నెలల క్రితం మూసి వేసిన జూ సందర్శన తిరిగి తెరుచుకోవడంతో జంతు ప్రేమికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు దూరం కావడంతో రోజంతా ఇళ్లల్లోనే గడపడానికి చికాకుపడుతున్న నేపధ్యంలో జూ పార్కు సందర్శన వారికి కొంత ఊరటనిస్తోంది. తమకు ఇష్టమైన జంతువులను లైవ్ గా చూస్తు  సంబరపడుతున్నారు. అధికారుల సూచనల మేరకు జూ పార్క్ లోనికి వచ్చే సందర్శకులు తప్పని సరిగా కోవిడ్19 నిబంధనలు పాటిస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి ఛలానా విధించబడుతుందని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పడంతో సందర్శకులు జాగ్రత్త పడుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ధర్మన్ స్ర్కీనింగ్ తప్పని సరిగా చేయించుకోవాలని,జర్వంతో పాటు జలుబు తదితర అనారోగ్య లక్షణాలున్న వారిని జూ పార్క్ లోనికి అనుమతించడం లేదు.  రోగ్యంగా ఉన్న వారిని మాత్రమే జూ సందర్శనకు అనుమతిస్తున్నారు. 10 ఏళ్ల వయస్సు కన్నాతక్కువ ఉన్న చిన్నారులను..65 ఏళ్ల వయస్సు కలిగిన పెద్దలను వీకెండ్ లలో అనుమతించమని అధికారులు అంటున్నారు. ఈ వారంలో ఇంకా వీకెండ్ రాలేదు. రాబోయే శనివారం,ఆదివారం లలో సందర్శకుల సందడి పెరిగే అవకాశాలున్నందున నిబంధనలను కఠినతరం చేస్తామని అధికారులు అంటున్నారు. సఫారీ పార్క్ కాంప్లెక్స్, రాత్రిపూట యానిమల్ హౌజ్,సరీస్రుపాల ఎన్ క్లోజర్, ఫిష్ అక్వేరియం,శిలాజ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం తదితర ఎన్ క్లోజర్లు సందర్శకులకు అందుబాటులో లేవు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవి మూసి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. టిక్కెట్ బుకింగ్ వద్ద భౌతిక దూరంతో పాటు జూ పార్క్ లోని ఎన్ క్లోజర్ల వద్ద గుంపులు, గుంపులుగా కాకుండా ఆరు అడుగుల దూరం పాటించేటట్లు జూ సిబ్బంది నిఘాను ముమ్మరం చేశారు. సెఫ్ మాస్క్ లు లేకుండా జూ పార్క్ లోనికి అనుమతించడం లేదు. మీరు..మీ చిన్నారులతో కలసి జూ పార్క్ సందర్శించాలంటే..కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.